వన భోజనాలు అంటే….

729

అసలు పూర్వం ఏమీవండుకొని తినేవారో తెలుసా?.. పూర్వము అడవుల్లో ఉన్న ఔషద గుణాలు కలిగిన ఆకులతో వంటలు చేసేవారు. అడవుల్లోలభించే ఆక్సిజన్ ఎక్కడా లభించదు.తిరుమల,శ్రీశైలం వెళ్ళిచూడండి.అక్కడ స్వచ్ఛమైన గాలి లభిస్తుంది.ఎంతోఆహ్లాదకరంగా ఉంటుంది.అందుకే పూర్వము ప్రాచీన దేవాలయాలు నదులు,ఎత్తేయినకొండ ప్రాంతంలో వెలిశాయి.
అసలుపూర్వపు రోజుల్లో వన భోజనాల అంటే  అడవుల్లో దొరికే పాషాణకేరి అనే మొక్క ఆకుతో పప్పును తయారు చేసుకొని భుజించేవారు. దీనినే కొండ పిండి అని కూడా పిలుస్తారు. ఈ ఆకులో మూత్ర పిండాల్లోని రాళ్లను కరిగించే శక్తి ఉందని చెబుతారు.
ఉసిరికాయ ఇందులో విటమిన్ సి. పుష్కలంగా ఉంటుంది. ఉసిరి కాయలను, గింజలను, ఆకులను, పూలను, వేళ్ళను, బెరడును ఆయుర్వేద ఔషధాలలో వాడతారు-ముఖ్యంగా చ్యవన ప్రాశ్‌లో. మలబద్ధకానికి ఉసిరి కాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది.
వనభోజనసమయంలో ఉసిరీ పచ్చడి తింటారు.
రేగి పండును బదరీ ఫలం అంటారు. రామాయణంలో శబరి శ్రీరామునికి తినిపించింది ఈ ఫలాలనే. సంక్రాంతి నాడు బోగి పండ్లు పోయాలి అని అంటుంటారు అవి కూడా రేగి పండ్లే. వినాయకుని పూజా విధానంలో బదరీ పత్ర సమర్పయామి అని రేగి పత్రాన్నె సమర్పిస్తారు. ఈ పండులో అనేక ఔషధ గుణాలున్నాయి. పండులోనె గాదు ఆకులలోను చెట్టు బెరడులోను. చివరకు కాయ లోని గింజల్లోకూడ ఔషధ గుణాలున్నాయని పరిశోధకులు కనిపెట్టారు. నిజానికి దీనిని వైద్యంలో వినిగించే పద్ధతి భారత దేశంలో ఈ నాటిది కాదు. చాల పూర్వ కాలంనుండే ఇది వాడుకలో ఉంది. ఇతర దేశాలలోకూడ ఈ రేగి పండు ఔషధ విలువలు తెలిసికొని వాడుతున్నారు. కొన్ని దేశాలలో రేగి లేత ఆకులను కూరలుగా వండుకొని తింటారు. రేగి పండ్లు తినడానికే కాదు ఈ రేగి పండ్లతో కొన్ని వంటకాలు కూడా చేస్తారు. కొండరేగిపచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది.
మారేడు దలముపత్రి యొక్క ఔషధ గుణాలు
అతిసార వ్యాధికి దీని పండ్ల రసం చాలా మంచి మందు.మొలలకు ఇది మంచి ఔషధము.
దీని ఆకుల రసము చక్కెర వ్యాధి నివారణకు చాలా మంచిదిఇన్ని ఔషధ గుణాలుగల పండ్లు,ఆకులు వండుకొని పూర్వం వన భోజనాలు చేసేవారు. ఇది ఒక ఆరోగ్యసూత్రం.

– చక్రాల రాఘవేంద్రశర్మ సిద్ధాంతి
కావలి
9110577718