శీతాకాలంలో ఉసిరి మరీ మంచిది

ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్లు, కెమికల్ తో కూడిన మందులు తీసుకుని ఆరోగ్యాన్ని చక్కబెట్టుకోవడం కంటే సహజమైన పద్ధతిలో దొరికే ఆహారం తినడం ఉత్తమం. వాటిల్లో ముఖ్యంగా ఉసిరి చాలా బెస్ట్. ప్రస్తుతం ఫ్లూలు, వైరస్‌లు పట్టి పీడిస్తున్న సమయంలో ఉసిరి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఆరోగ్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం.. వివరాలిలా ఉన్నాయి.
ఉసిరిలో విటమిన్ సితో పాటు ఐరన్, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వాటివల్ల బోలెడు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వాటిల్లో కొన్నింటిని చర్చిస్తే..
ఇమ్యూనిటీ:
ఉసిరిలో ఉండే విటమిన్ సీ ఇమ్యూనిటీని బూస్ట్ చేయడంలో ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. ఇది చాలా హెల్ప్ ఫుల్ మాత్రమే కాకుండా.. శీతాకలంలో వచ్చే బోలెడు ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.
మలబద్ధకం:
సహజంగానే ఉసిరి అనేది ఆల్కలైన్ కలిగి ఉంటుంది. ఫలితంగా జీర్ణ వ్యవస్థను శుభ్రం చేయడంతో పాటు, సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఇందులో దొరికే ఫైబర్, న్యూట్రియంట్ మలబద్ధకం రాకుండా అడ్డుకుంటాయి.
శ్వాస సమస్యలు
ఉసిరిలో ఉండే విటమిన్ సీ రక్త కణాలను బలపరిచి డిటాక్సిఫికేషన్ కు సహాయం చేస్తుంది. శ్వాసపరమైన ఒత్తిడిని తగ్గించే విధంగా యాంటీఆక్సిడెంట్లు కాపాడతాయి.
కంటిచూపు
ఉసిరిలో ఉండే కెరోటీన్ కంటిచూపును మెరుగుచేస్తుంది. కళ్లకు ఒత్తిడి తగ్గించి నీరు కారడాన్ని నియంత్రిస్తుంది.
ప్రకాశవంతమైన జుట్టు
ఉసిరి డాండ్రూఫ్ తగ్గించడంతో పాటు జట్టు రాలడాన్ని కంట్రోల్ చేస్తుంది. వెంట్రుకల కుదుళ్లు బలపడేలా చేస్తుంది. ఉసిరి షాంపూ, కండిషనర్ లేదా తల నూనె బలంతో పాటు ప్రకాశవంతమైన జుట్టు ఇస్తుంది.
జాయింట్ నొప్పి
శీతాకాలంలో సహజంగా వచ్చే జాయింట్ నొప్పులు, ఆర్థరైటిస్ నొప్పులను తగ్గిస్తుంది.
బరువు తగ్గడం
ఉసిరి తింటే మెటాబాలిజం ఇంప్రూవ్ అవడంతో పాటు అరుగుదల పెరిగి వెయిట్ లాస్ కూడా అవ్వొచ్చు.
ఆరోగ్యవంతమైన చర్మం
విటమిన్ సీ ఎక్కువగా ఉత్పత్తి అయి చర్మంపై ముడతలు తగ్గడంతో పాటు యూత్ ఫుల్ స్కిన్, మెరిసే చర్మం పొందొచ్చు.
గొంతు నొప్పి
శీతాకాలం వచ్చే సమస్యల్లో గొంతునొప్పి ఒకటి. ఉసిరి దీనికి సాయం చేస్తుంది. కొంచెం అల్లం రసంతో తేనె కలిపి తీసుకుంటే గొంతునొప్పి తగ్గుతుంది.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner
Bitnami