పవన్‌ను కలిసిన వైకాపా ఎమ్మెల్యే తండ్రి

81

అమరావతి: కృష్ణా జిల్లాలో నివర్‌ ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించేందుకు పర్యటించిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి తండ్రి, మాజీ ఎంపీ రెడ్డయ్య కలిశారు. పెద్దపూడి అడ్డరోడ్డు వద్ద కలిసి రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు పవన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం నమోదు చేస్తు్న్న పంట నష్టం అంచనాలన్నీ తప్పులేనని ఆరోపించారు. ఏ ప్రభుత్వం వచ్చినా రైతులకు న్యాయం జరగడం లేదని రెడ్డయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు జరుగుతున్న అన్యాయంపై చర్చించేందుకు  రౌండ్‌టేబుల్‌ సమావేశం పెడదామని ఆయనతో పవన్‌ చెప్పారు.