తిరుపతి భద్రత మనందరి బాధ్యత

372

తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ప్రజలను భయభ్రాంతులను చేసే విధంగా హత్యలకు భూ కబ్జాలకు పాల్పడుతున్న వారిని అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తున్న వారిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం,జిల్లా పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదంతో అణిచి వేయాలి!తిరుపతి పవిత్రతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం “సంపూర్ణ మద్యపాన నిషేధం” ప్రకటించాలి!
తిరుపతి అర్బన్ పోలీస్ ఉన్నతాధికారులకు స్థానిక ఎమ్మెల్యే గతంలో ప్రకటించిన విధంగా ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రజా సంఘాలు ప్రజలు సహకరించి పార్టీలకు అతీతంగా నగరంలో రౌడీమూకల,భూ కబ్జాదారుల భరతం పట్టాలి! తిరుపతి నగరంలో గతంలో ఉన్న “అర్బన్ పోలీస్ బూత్” లను ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసి షిఫ్ట్ పద్ధతిలో 24 గంటలు పోలీస్ అధికారుల పర్యవేక్షణలో ఉండేలా చూడాలి!
తిరుపతి పట్టణము త్వరలో జిల్లాగా మారుతున్నoదున “పోలీస్ కమిషనరేట్” హోదాతో పాటు “A గ్రేడ్” ఇచ్చి ప్రతి పోలీస్ స్టేషన్లో 120 మంది సిబ్బంది ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని తిరుపతికి ప్రత్యేక “బడ్జెట్” కేటాయించాలి! తిరుపతికి ప్రతినిత్యం శ్రీవారి దర్శనానికి వస్తున్న విఐపిల తాకిడి కారణంగా పోలీసు అధికారులకు ఇబ్బందికరంగా మారి నగర ప్రజల భద్రత విషయంలో పూర్తిగా దృష్టి సారించ లేకపోతున్నారు!
తిరుపతి నగరంలో యాత్రికులు, స్థానిక ప్రజల దృశ్యా రెండు “క్రైమ్”, “ట్రాఫిక్” పోలీస్ స్టేషన్ల ఏర్పాటును పరిశీలించాలి! తిరుపతి నగరంలో ఉన్న పోలీస్ స్టేషన్లలో సిబ్బందికి తగ్గట్టుగా పరిధిని తగ్గించాల్సిన అవసరం ఉంది దాదాపు అన్ని స్టేషన్లలో “సిబ్బంది తక్కువ స్టేషన్ పరిధి ఎక్కువగా”ఉండడంతో ఎక్కడైనా దాడులు జరిగినప్పుడు సంఘటనా స్థలానికి సకాలంలో పోలీస్ అధికారులు చేరుకోలేక పోతున్నారు! హైదరాబాద్ తరహలో తిరుపతిలో ATS ( ANTI టెర్రరిస్ట్ స్క్వాడ్) సబ్ కంట్రోల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించాలి!

                                                                                                                      – నవీన్ కుమార్ రెడ్డి
                                                                                             రాయలసీమ పోరాట సమితి కన్వీనర్,
INTUC జిల్లా గౌరవ అధ్యక్షులు