ఈఫిల్ టవర్ ఘనత..అంతింత కాదయా..

413

ఈఫిల్ టవర్  1052 అడుగుల ఎత్తు.  దాదాపు 7000 టన్నుల బరువు , 2.5 ఎకరాల విస్తీర్ణము , ఉన్నా ఈఫిల్ టవర్ ప్రపంచం లోనే అత్యున్నత కట్టడాలలో ఒకటి గా పేరుతెచ్చుకున్న ఈఫిల్ టవర్ ఇప్పుడు మరో ఘనతను కుడా పొందింది . తాజమహల్ , చైనాగోడ , స్తాత్యు అఫ్ లిబర్టి , ఇలా పపంచం లో ఉన్న అద్భుత కట్టడాలలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే , అభిమానించే కట్టడం గా పేరుతెచ్చుకుంది .

 ప్రపంచం మొత్తం మీద పర్యాటకులు టిక్కెట్టు కొనుక్కొని సందర్శించే కట్టడాలలో ఈఫిల్ టవర్ దే మొదటి స్థానము . ప్రారంభమైన 1889 నుంచి ఇంతవరకు మొత్తం 20 కోట్ల మంది సందర్శించారు.ఫ్రాన్సు లోని పారిస్ లో ఉన్న దీన్ని ” గుస్తావా ఈఫిల్ ” అనే ఇంజినీర్ ఇంర్మించాడు . నిర్మాణానికి రెండు ఏళ్ళ రెండు నెలలు పట్టింది . 1889 మార్చి 31 న పూర్తీ చేసారు .1930 వరకు ఇదే ప్రపంచం లో ఎత్తైన కట్టడం , దీని నమూనా కోసం 50 మంది ఇంజినీర్లు 5,300 బొమ్మలు వేశారు .18,000 విడిభాగాలను ముందుగా రూపొందించి వాటిని కలిపి దీనిని నిర్మించారు .

ప్రతి ఏడు ఏళ్లకొకసారి రంగులు వేస్తారు . పూర్తిచేయడానికి సుమారు 18 నెలలు పడుతుంది , 50 టన్నుల రంగు అవసరమవుతుంది .దీనిపై మొత్తం 20,000 విద్యుత్ బుల్బులు అమర్చారు . మూడు అంతస్తులుగా నిర్మించిన దీనిలో రెండు రెస్టారెంట్లు , ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉన్నాయి . దీన్ని పేల్చివేయడానికి 1986 లో ఉగ్రవాదులు బాంబ్ పెట్టేరు … అదృష్టవశాత్తు అది పేలలేదు .దీంట్లో సందర్శకులకు పైకి తీసుకువెళ్ళే లిప్టులు తిరిగే దురాన్ని లెక్క కడితే ఏటా ౧౦,౦౦,౦౦౦ కిలోమీటర్లు అవుతుంది .

ఈఫిల్ టవర్ చివరి నిల్చుని 42 మైళ్ళ దూరం వరకు చుడొచ్చును . దీనిలో మొత్తం 1710 మెట్లు ఉన్నాయి .బలం గా గాలులు వీచితే టవర్ కాస్త ఊగుతుంది . 1999 లో ఒకసారి వీచిన గాలులకు 13 సెంటీమీటర్లు మేర ఊగింది .ఈ టవర్ ను శుబ్రం చేయడానికి 4 టన్నుల సామగ్రి కావాలి . డిటార్జంటలు 400 లీటర్లు అవసరమవుతాయి , దీని పొడవు వేసవి లో కొలిస్తే 3.25 అంగుళాలు ఎక్కువగా ఉంటుంది , శీతాకాలం లో 6 అంగుళాలు తక్కువవుతుంది … ఇనుము వ్యాకోచ , సంకోచాలే ఇందుకు కారణము . దీని నిర్మాణము లో 25, ౦౦,౦౦౦ రివట్లను (Rivits) ఉపయోగించారు .