జిల్లా కలెక్టర్‌కు అరుదైన గుర్తింపు

455

యూనిసెఫ్ కార్యక్రమంలో  జిల్లా ఉత్తమ అభ్యాసాలపై  ప్రసంగం
విజయనగరం: జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ కు  జాతీయ స్థాయి లో మరో గుర్తింపు లభించింది.   యునిసెఫ్, జాతీయ గ్రామీణాభివృద్ధి సంయుక్తంగా నిర్వహించిన   7వ వాటర్, సానిటేషన్,  అండ్ హైజీన్ (వాష్) సదస్సులో బుధవారం వర్చ్యువల్ విధానం లో  జిల్లాలో చేపట్టిన ఉత్తమ అభ్యాసాల పై కలెక్టర్ ప్రసంగించారు.   ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన కొద్దిమంది   ఐ.ఏ.ఎస్. అధికారులకు ఈ అవకాశం రాగా  మన రాష్ట్రం నుండి  పశ్చిమ గోదావరి కలెక్టర్ రేవు ముత్యాల రాజు, ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్,   విజయనగరం కలెక్టర్ డా. హరి జవహర్ లాల్ కు  మాత్రమే అవకాశం  కల్పించారు.  ఈ కార్యక్రమం లో  ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్  బిశ్వభూషణ్  హరిచందన్ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కీలకోపన్యాసం చేసిన   జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్  అల్కా ఉపాధ్యాయ మన జిల్లా కలెక్టర్కు స్వాగతం పలుకుతూ పీపుల్స్ కలెక్టర్ అండ్ డైనమిక్ కలెక్టర్ డా. హరి జవహర్ లాల్ అంటూ సంబోదించడం విశేషం. అనంతరం కలెక్టర్ విజయనగరం జిల్లాలో  నీటి నిర్వహణ, పారిశుధ్య కార్యక్రమాలలో చేపట్టిన ఉత్తమ అభ్యాసాల పై  వివరించారు.
సేవ్ బ్లూ , స్ప్రెడ్ గ్రీన్ నినాదంతో   ప్రణాళికలు:
వర్చ్యువల్  కాన్ఫరెన్స్ లో జిల్లా అభివృద్ధికి చేపట్టిన ఉత్తమ అభ్యాసాల పై  జిల్లా కలెక్టర్  డా. ఎం. హరి జవహర్ లాల్ మాట్లాడుతూ  జల సంరక్షణకు, పచ్చదనాన్ని పెంపొందించడానికి సేవ్ బ్లూ, స్ప్రెడ్ గ్రీన్ నినాదం తో పనిచేస్తున్నామని కలెక్టర్ వివరించారు.   జల జీవన్ మిషన్ క్రింద ఇంటింటికి  కుళాయి  పధకం క్రింద జిల్లాలో 1871 పనులు రూ. 289.69 తో  మంజురైనాయని, ఈ పనులు ప్రస్తుతం గ్రౌన్దింగ్ అయ్యాయని, మార్చ్ 2022 నాటికీ 3 లక్షల 14 వేల  గృహాలకు  తాగు నీరందించడం జరుగుతుందన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టాప్ కనెక్షన్  ఇవ్వడం కోసం వంద రోజుల కాంపెయిన్ నిర్వహించామని తెలిపారు.   సేవ్ బ్లూ క్రింద  చెరువుల అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందని,  ఇంకుడు గుంతలు, మేజిక్ పిట్స్ నిర్మించడం జరిగిన్నారు. చెరువు గట్ల సుందరీకరణ,  వాకింగ్ ట్రాక్స్, సీటింగ్ ఏర్పాటు,  భూగర్భ జలాలను పెంచడానికి మొక్కలు నాటడం ద్వారా  కృషి చేయడం జరిగిందన్నారు.  ఈ కార్యక్రమం లో ప్రజలు స్వచ్చందంగా  భాగస్వామ్యులయ్యేలా చేశామన్నారు. స్వచ్చభారత్ మిషన్ క్రింద ఇంటింటికి టాయిలెట్ అర్యక్రమం ల   లక్ష్యానికి చేరువుగా ఉన్నామని వివరించారు.

బహింరంగ మల విసర్జన లేని గ్రామాలను  అదేవిధంగా కొనసాగించడానికి ప్రజలలో అవగాహన పెంచే ఐ.ఈ.సి కార్యక్రమాలను నిర్వహిస్తూ, ఘన వ్యర్ధాల నిర్వహణ పై  కూడా అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు.  సంక్రమిత వ్యాధులు సోకకుండా ఉండేలా చేతులు కడుక్కోవడం పై శిక్షణ నిచ్చిన కార్యకర్తల ద్వారా  అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు.  అదే విధంగా కోవిడ్-19  రెండవ సారి  చెందకుండా ఉండేలా   50 రోజుల అవగాహనా కార్యక్రమానికి ప్రణాళిక రుపొందించామని, జిల్లాను గ్రీన్ జోన్ లో ఉంచడానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నట్లు  తెలిపారు.
స్ప్రెడ్ గ్రీన్ నినాదంలో భాగంగా   హరిత విజయనగరం  పేరుతో  ఖాళీ గా  ఉన్న స్థలాల్లోను, రహదారుల కిరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ పెద్ద ఎత్తున   చేపట్టడం జరుగుతున్నదని వివరించారు.  గ్రామాల ప్రవేశం వద్ద బహిరంగ మల విసర్జన ను నివారించడానికి మొక్కల్ని నాటి, వాటి నిర్వహణ బాధ్యతను  ఆయా గ్రామాలకే  అప్పగించడం జరిగిందన్నారు. జిల్లా అంతట పచ్చదనం పెంచడం తో జిల్లాలో కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించగలిగామని పేర్కొన్నారు.