అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు..!!

774

చంద్రబాబుకు ఉన్న చిన్న మెదడు కూడా చితికి పోయినట్లుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నవారికెవరికైనా ఈ విషయం బోధ పడుతుంది. ప్రజా సమస్యలు ఎజెండాతో కాకుండా..కేవలం రచ్చ రాజకీయాలు చేయాలనే దుర్భుద్దితొనే చంద్రబాబు అసెంబ్లీలో అడుగు పెట్టినట్లు కనిపిస్తోంది. 40 ఏళ్ల రాజకీయం అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు అందుకు తగినట్లు వ్యవహారించడం లేదు. మోదీ  కంటే సీనియర్‌ పొలిటీషియన్‌ను అని చెప్పుకునే నారావారు రాజకీయాల్లో రాక్షసత్వాన్ని చూపిస్తున్నారు. వయసుకు తగ్గ అనుభవాన్ని చూపించకుడా  స్వార్ధ రాజకీయాలే ఎజెండగా ప్రజాస్వామానికి దేవాలయం లాంటి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు.  చంద్రబాబు రాజకీయ జీవితమే వెన్నుపోట్లమయం. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా కాలంలో వెన్నుపోట్లకు, అబద్దపు రాజకీయాలకు తావులేదనే విషయాన్ని చంద్రబాబు ఇంకా గ్రహించినట్లు లేదు.

చంద్రబాబు సలహాదారులు కూడా మూస రాజకీయాలకు అలవాటుపడి ఆ దోవలోనే పయనిస్తున్నారు. అసెంబ్లీలో చంద్రబాబు చేస్తోన్న రాజకీయ చిల్లర ట్రిక్కులు అన్నీ మూస రాజకీయాల కోవలోకే వస్తాయి. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో రాజకీయాలు చేయడమంటే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినంత ఈజీ  కాదు అనే విషయాన్ని ఇప్పటికైనా   చంద్రబాబు గుర్తుంచుకుంటే ఆయన హార్ట్‌ ఎటాక్‌ లాంటివి రాకుండా  ఉంటాయి. చలికాలపు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి  చంద్రబాబు రెచ్చగొట్టే ధోరణిలోనే వెళ్తున్నారు. నిజాయితీగా ప్రజాసమస్యలపై మాట్లాడిందీ లేదు, పోరాడిందీ లేదు. ఎల్లో మీడియా కథ, స్క్రీన్‌ ప్లే, డైరక్షన్‌లో  చంద్రబాబు అసెంబ్లీలొ  నాటకాలు వేయడం చూస్తుంటే హథావిధి అనిపిస్తోంది. ఏమాత్రం ప్రజాభిమానంలేని చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా పని  చేశాడంటే అది ఎల్లో మీడియా పుణ్యమే. అందుకేనేమో అసెంబ్లీలో కూడా ఎల్లో  మీడియా రచించిన  స్క్రీన్‌ ప్లే ప్రకారమే వేషాలు వేస్తున్నాడు.

40 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్లు సీఎంగా పని చేశాను, అనేక మందిని ప్రధానులను, రాష్ట్రపతులను చేశాననే చెప్పుకునే చంద్రబాబు ఏమాత్రం జ్ఙానంలేని ఎల్లో మీడియాను ఫాలో అవుతన్నాడంటే నారావారి తెలివితేటలు ఏమాత్రమో అర్ధం చేసుకోవచ్చు. 1994లో ఎన్టీఆర్‌ ఉమ్మడి ఏపీలో ఘన విజయం సాధించారు. సంవత్సరం కూడా తిరగకుండానే అంటే 1995లో  పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కున్నాడు. 1999లో  బీజేపీతో కలిసి కార్గిల్ శవాల మీద ఓట్లు వేరుకుని మరోసారి సీఎం అయ్యారు.2004లో వైఎస్‌ఆర్ ప్రభంజనంలో చంద్రబాబు కొట్టుకుపోయారు. 50 కంటే తక్కువ సీట్లకు పరిమితమయ్యారు. 2009లో వైఎస్‌ఆర్‌ను ఎదుర్కోవడానికి మహా కూటమి పేరుతో చంద్రబాబు దండయాత్ర చేసినా కాంగ్రెస్‌ను వైఎస్‌ఆర్‌ విజయ తీరాలకు చేర్చారు. 2014 మళ్లీ ఒక పక్క  మోదీని, మరోపక్క పవన్‌ కల్యాణ్‌ను కూర్చోపెట్టుకుని 13 జిల్లాలతో కూడిన నూతన రాష్ట్రానికి సీఎం  అయ్యారు  చంద్రబాబు. ఎంతో అనుభవం ఉందని, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆర్ధికంగా గట్టేక్కిస్తాడని, మోదీతో కలిసి వచ్చాడు కాబట్టి కేంద్రంతో సఖ్యగాఉంటాడని 2014లో చంద్రబాబు తెలుగు దేశానికి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. కానీ..చంద్రబాబు మాత్రం తరతరాలు కూర్చుని తిన్నా కరగనంత ఆ ఐదేళ్లలో కూడబెట్టుకున్నాడు. ఏపీ అసెంబ్లీ సాక్షిగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి అన్న మాటలు ఇక్కడ ప్రస్తావించదలచకున్నాను. “2014 నుంచి 2019 వరకు చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకుని దివాళ తీయించారు. ఇదే నేను చేసి ఉంటే ఆర్ధిక పరిస్థితి చేజారి పోయేది. కాని మేము అధికారంలోకి వచ్చింది దోచుకోవడానికి కాదు, ప్రజల కోసం పని చేయడానికి”. ఈ మాటలతోనే అర్ధమవుతుంది చంద్రబాబు ఎంత దోపిడీకి పాల్పడ్డాడో.పైగా ఎల్లో మీడియాతో వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద బురద జల్లుతూ కాలవ గడుపుకుంటున్నాడు చంద్రబాబు.

ఆంధ్రప్రదేశ్‌ చలికాలపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి చంద్రబాబు ప్రభుత్వం, ప్రజల దృష్టిని మరిల్చి తాను మీడియాలో కనిపించాలని తాపత్రయపడుతున్నాడు తప్పితే నిజాయితీగా ప్రజాసమస్యలపై పోరాటం చేయడం లేదు.  స్పీకర్‌ మీద కూడా చంద్రబాబు నోరు పారేసుకోవడాన్ని ఐదు కోట్ల ఆంధ్రులు టీవీల్లో చూసి నివ్వెర పోయారు. మైనార్టీ ఎమ్మెల్యేను ఉద్దేశించి “ఏం పీకుతావ్”అన్న చంద్రబాబు మాటలు ఆయన అనుభవాన్నే సిగ్గు పడేలా చేస్తున్నాయి. గతంలో నాయి బ్రాహ్మణులను, మత్స్యకారులను, ఎస్సీలపై కూడా చంద్రబాబు నోరు పారేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ..ఆయన గతం నుంచి పాఠాలు నేర్చుకోకుండా నేనింతే సీతయ్యను అంటూ  మాట్లాడటాన్ని  ప్రజలు గమనిస్తున్నారు. అంతేకాదు..ఆంధ్రప్రదేశ్‌ సీఎంను పట్టుకుని ఏకవచనంతో సంభోదించడం, సీఎం అనే గౌరవం లేకుండా వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడటం 40 ఏళ్ల అనుభవజ్ఞుడిని అని చెప్పకునే చంద్రబాబును ప్రశ్నించేలా చేస్తున్నాయి. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు మరో సీఎంను పట్టుకుని ఏకవచనంతో సంభోదించడం కచ్చితంగా ఆయన మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. అంతేకాదు..151 అసెంబ్లీ సీట్లతో అధికారంలోకి వచ్చిన  వైఎస్ఆర్‌ సీపీ ప్రభుత్వాన్ని గాలికి వచ్చిందని మాట్లాడటాన్ని ఆయన ఓర్వలేని తనానికి అద్దం పడుతుంది. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ఒంటరిగా బరిలోకి  దిగుతుంటే ఎదుర్కోవడం చేతగాని చంద్రబాబు మరోపక్క నుంచి పవన్ కల్యాణ్‌ను ఉసిగొల్పాడు. ఎస్సీల ఓట్లు చీల్చాలనే కుతంత్రంతో పవన్ కల్యాణ్‌ను మాయావతి  కాళ్ల మీద పడేలా చేశాడు. కమ్యూనిస్టులు జనసేనతో కలిసేలా కుతంత్రం నడిపాడు. వీరందర్నీ ఎదుర్కొని 2019 ఎన్నికల బరిలో ప్రజల ఆశీర్వాదంతో విజేతగా నిలిచిన నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి. అటువంటి లీడర్‌ను పట్టుకుని గాలికి వచ్చారని అనే చంద్రబాబు మాటలను  ప్రజలు క్షమించరు.

కోవిడ్ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు కుదించారు. సమయం చాలా త క్కువుగా ఉంది. ఈ తక్కువ సమయంలో ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఆలోచన చంద్రబాబుకు లేనేలేదు. పైగా పగటి వేషగాడిలా 1970 నాటి రాజకీయ స్ట్రాటజీ ప్లే చేస్తూ ప్రజలను, మీడియాను ఆకర్షించాలని కష్టపడుతు న్నాడు. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది. ఈ 18 నెలల కాలంలోనే సంక్షేమ పథకాలకు  70వేల కోట్లు కేటాయించడమే కాదు, లబ్ధిదారుల ఖాతాల్లో పడేలా చేశారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా  వైఎస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం పని చే స్తుంది. 2014 -19 మధ్య కాలంలో డబ్బుల్లేవని ప్రతి  మీటింగ్‌, ప్రెస్‌ మీట్‌లో బీద అరుపులు అరిచారు చంద్రబాబు.ఈ 18 నెలల కాలంలో ఒక్కసారైనా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి డబ్బుల్లేవనే మాటను మాట్లాడారా?.ఈ  ప్రశ్నకు చంద్రబాబు ఆయనకు మద్దతిచ్చే మీడియా గుండె మీద చేతులు వేసుకుని ప్రమాణ పూర్తిగా సమాధానం చెప్పాలి. కోవిడ్ నేపథ్యంలో ఆర్ధిక వ్యవ స్థ అతలాకుతలం అయినప్పటికీ వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి మాత్రం ఇచ్చిన మాట తప్పకుండా, మడమ తిప్పకుండా పాలన సాగిస్తూ సంక్షేమ పథకాలు ప్రజల గడపతొక్కేలా  నిర్ణయాలు తీసుకుంటున్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థతో పాలనా రంగంలొ వి ప్లవాత్మక మార్పులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. 2021, జనవరి1నుంచి ఇంటింటికి రేషన్ అందించే కార్య క్రమాన్ని చేపట్టారు. ఒకప్పుడు పింఛన్ తీసుకోవాలంటే  ప్రాణాలు పోయేవి, ఇప్పుడు పింఛనే కాదు రేషన్ కూడా గడప తొక్కుతోంది. గాంధీ జీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం ఇదే కదా..!. చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు ఇవన్నీ కనిపించడం లేదా..!?.

సీఎం వైఎస్‌జగన్‌మోహన్ రెడ్డి పాలనలో పథకాల ఫలాలు ప్రజలు అనుభవిస్తున్నారు. చంద్రబాబు, ఎల్లో మీడియా ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కట్టు కథలు అల్లినా ప్రజలకు వాస్తవాలు తెలుసు అనే విషయాన్ని పచ్చ నాగులు గ్రహించాలి. చంద్రబాబు ఆవేశంతో ఊగిపోతే వచ్చేది ఆయాసమే. పోడియం ముందు కూర్చుంటే మోకాళ్ల నొప్పులు మరింత పెరుగుతాయి. కాబట్టి..చంద్రబాబుకు నేను ఇ చ్చే సలహా ఏమంటే నాటకాలు ఆపండి. రాజధానిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టుకెళ్లి స్టే తెచ్చింది  చంద్రబాబు అనే విషయం ఆయా సామాజిక వర్గాలకు  బాగా తెలుసు. చంద్రబాబుకు కర్రు కాల్చి వాత పెట్టడానికి  వారు సిద్దంగా ఉన్నారు. రైతు బీమా దగ్గర నుంచి రైతు భరోసా  వరకు అన్నదాతకు అండగా ఉంటుంది వైఎస్ఆర్‌ సీపీప్రభుత్వం. 2014 రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి 12వేల కోట్లు కూడా రుణమాఫీ చేయలేని చంద్రబాబుకు రైతు సంక్షేమం గురించి మాట్లాడే అర్హత ఉందా..?. రైతుల చేతులకు సంకెళ్లు వేసి, వారి సామాన్లను ఇంటి నుంచిబయట పడేయించిన చంద్రబాబుకు రైతులపై  మాట్లాడే హక్కు ఉందా?. ఇంతకు ముందు చెప్పినట్లు చంద్రబాబు ఇంకా ముతక  రాజకీయ బాటలోనే ఉన్నారు. ఇది డిజిటల్ యుగం, సోషల్ మీడియా కాలం అనే విషయాలు  చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలి. ఎవరి పాలన బాగుంది ?14 ఏళ్లలో  చంద్రబాబు ఏం చేశారు? 18 నెలల్లో వైఎస్‌ఆర్‌ తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి  ఎంత చేశారు అనేది ప్రజలు చూస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 18 నెలలకే చంద్రబాబును పోడియం కింద కూర్చునేలా చేశారు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి. ఇదంతా చూస్తుంటే”ఇప్పుడేముంది ముందుముందు సినిమా చూపిస్తా”అన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి మాటలు ఎల్లో బ్యాచ్‌కు కచ్చితంగా  నిద్రపట్టించవు.

-వై.వి. రెడ్డి, పొలిటికల్ అనలిస్ట్