– ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్.
వై సి పి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అర్చకులు, పురోహితులపై దాడులు పెరిగిపోయాయి.అర్చకుడిలో ఏమైనా పొరపాట్లు ఉంటే ఆ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ దేవాదయశాఖ ఉన్నతాధికారులు కానీ చర్య తీసుకోవాలి.
కర్నూలులో అర్చకుడిని కొరడాతో పాశవికంగా కొట్టడానికి ఆలయ చైర్మన్ ఎవరు అని అడుగుతున్నాం. ఇది ప్రజాస్వామ్యమా లేక రాజరికమా? దేవాదాయ శాఖ దాడులు వేధింపులతో అర్చక వ్యవస్థ అంతరించి పోయ్యే ప్రమాదంలో ఉంటే రాజకీయ దాడులు కూడా అర్చకులపై జరుగుతుంటే ఈ రాష్ట్రములో అర్చకులు బ్రతకాగలరా అని అడుగుతున్నాం. అసలే అర్చక వ్యవస్థ మీద సమాజంలో చిన్నతం ఏర్పడి అర్చకవృత్తిలోకి రావడానికి సంకోచిస్తున్న పరిస్థితులలో ఇలాంటి దాడులు వ్యవస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది.
జగన్ ప్రతిపక్షములో వున్నప్పుడు నేను అధికారంలోకి వస్తే అర్చకుల సమస్యలు పరిష్కరిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి ఇప్పుడు అర్చకులపై వై సి పి నాయకులు భౌతిక దాడులు చేస్తుంటే చర్యలు తీసుకోకపోవడం జగన్ బ్రాహ్మణ వ్యతిరేక విధానానికి నిదర్శనం. అర్చకుడిపై పాశవికంగా దాడిచేసిన వై సి పి నాయకుడు ప్రతాపరెడ్డి మీద హత్యాయత్నం కేసు పెట్టి అరెస్ట్ చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని తెలియచేస్తూ అర్చకుడిపై న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలియచేస్తున్నాము.