ఏమిటో..లోకం….?

డ్రమ్ముల మోతను సంగీతమంటున్నారు
పీలికబట్టల్ని వస్త్ర ధారణ అంటున్నారు
భౌతిక అకర్షణను ప్రేమని పిలుస్తున్నారు
సహజీవనాన్ని సంసారమంటున్నారు
గ్రాఫిక్ గిమ్మిక్కులను సినిమా అంటున్నారు
డూప్ ల పోరాటాన్నిహీరోయిజం అంటున్నారు
పదవుల పోరాటాన్నిప్రజాస్వామ్యమంటున్నారు
అధికార ఆరాటాన్ని రాజకీయమంటున్నారు
ఆస్తుల పంపకాన్ని కుటుంబం అంటున్నారు
సరదాలను సంస్కృతి అంటున్నారు
భుక్తి మార్గాన్ని చదువు అంటున్నారు
కోరిన కోర్కెలు తీరిస్తేనే.. దేవుడంటున్నారు
ఆస్తి ఉంటేనే.. గొప్పవాడు అంటున్నారు
మందు పోయిస్తేనే..మిత్రుడు అంటున్నారు
కట్నం తెస్తేనే..భార్య అంటున్నారు
సొమ్ములు తెస్తేనే..సంసారం అంటున్నారు
కాసులు తెస్తేనే..కాపురం అంటున్నారు
అవినీతి చేయకపోతే.. అసమర్ధుడంటున్నారు
అక్రమాలు చేయకపోతే.. అమాయకుడంటున్నారు
అసత్యాలు మాట్లాడితే.. బ్రతక నేర్చినవాడంటున్నారు
నిజం పలికితే.. బ్రతక నేర్వని వాడంటున్నారు
న్యాయబద్ధంగా ఉంటే.. ఎలా బ్రతుకుతాడో అంటున్నారు
అన్యాయంగా బ్రతికితే..ఎంచక్కా ఉన్నాడంటున్నారు
అన్యాయాన్ని ఎదిరిస్తే..అతనికెందుకు అంటున్నారు
నిజాయితీగా బ్రతికితే ..కూడుపెడుతుందా అంటున్నారు
మాయకమ్మిన జీవితాన్నిశాశ్వతమనుకుంటున్నారు
మరణమనే మహా సత్యాన్ని విస్మరిస్తున్నారు
పరిస్థితులకనుగుణంగా..పాత అర్ధం చెరిగిపోయి
ప్రయోజనాలకు అండగా..పరమార్ధం ఆవిర్భవిస్తోంది!
స్వార్ధకాంక్షాణుగుణంగా విపరీతార్ధం ఆవిష్కృతమవుతోంది!

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
Close Bitnami banner
Bitnami