పవన్ కల్యాణ్‌ని బీజేపీ ఎందుకు అవమానిస్తుంది…?

419

నా అంచనా !

పొత్తులో భాగంగా సీట్లు ఇవ్వటం అటుంచి అసలు మీ అవసరమే మాకు లేదని బీజేపీ నాయుకులు ఎందుకు పదేపదే ప్రకటనలు చేస్తుంది . మొదటిరోజు నుండీ మనం గమనిస్తే  మాకు ఎవ్వరితో పొత్తులేదు నేను ఎవ్వరితో మాట్లాడటం లేదని బండి సంజయ్ ప్రకటిస్తే  ( అంతకుముందు సంజయ్ పవన్ దగ్గరకి వచ్చి చర్చలు జరుపుతాడని హరిప్రసాద్ జనసేన తరుపున అప్పటికే ప్రకటన విడుదల చేసాడు ) నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్‌ ఆయనంతటే ఆయనే మద్దతు ప్రకటించాడు ..అసలు అతని పాత్ర నామమాత్రం అని ఎంపీ అరవింద్ మరీ ఘోరంగా అవమానకరంగా మాట్లాడాడు . దానికి వెంటనే స్పదించిన జనసేన అరవింద్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది . అయినా బీజేపీ ఎలాంటి క్షమాపణలు చెప్పకుండా అస్సలు జనసేన / పవన్ ఉనికినే గుర్తించటానికి ఇష్టపడలేదు .

బీజేపీ ఎందుకు ఇలా అవమానిస్తుంది ? ఏమైనా వ్యూహం ఉందా ! నా అంచనా ప్రకారం బీజేపీ సీమాంధ్ర ఓట్లు లెక్కల కోసమే కావాలని పవన్కల్యాణుని అవమానిస్తుంది .ఇప్పుడు హైద్రాబాదులో జరుగుతున్న ఎన్నికలలో వైసీపీ పోటీ చేయటం లేదు . టీడీపీ నామమాత్రంగా పోటీ చేస్తుంది . వైసీపీ , టీడీపీ రెండు పార్టీల సానుభూతి పరుల ఓట్ల కోసమే బీజేపీ ఈ పంధా ఎంచుకుంది . జనసేన ఓట్లతో పోల్చుకొంటే వైసీపీ , టీడీపీ ఓట్లు చాలా అధికం . ప్రతి డివిజన్లో జనసేన ఓట్లు పదులు వందల్లో ఉంటే వైసీపీ టీడీపీ ఓట్లు వేలల్లో ఉంటాయి .అవే ఫలితాలని తారుమారు చేస్తాయి . వైసీపీ టీడీపీలు పోటీ చేయటం లేదు కాబట్టి వాళ్ళు తెరాసకి బీజేపీకి రెండు మూడు శాతం అటుఇటుగా సగం సగం వేస్తారు .

అదే పవన్ కల్యాణ్‌ని బీజేపీ తరుపున ప్రచారంలోకి దింపితే వైసీపీ ఓట్లు బీజేపీకి పడే అవకాశమే లేదు, ఎందుకంటే వైసీపీ క్యాడరు పవన్ కల్యాణ్‌ని బద్ద వ్యతిరేకిగా చూస్తుంది  . టీడీపీ వాళ్ళు కూడా పవన్ చూసి బీజేపీకి వేసేవాళ్ళు కూడా వేయరు . పవన్ కల్యాను టీడీపీకి మద్దతిచ్చినంతవరకే వాళ్ళు గుర్తిస్తారు , అది కేవలం టీడీపీ  అవసరం కాబట్టి . నిజానికి పవన్ అంటే టీడీపీ క్యాడర్లో కూడా ఎవ్వరికీ నచ్చదు . సినిమాల పరంగా ఎప్పటినుండో ఉన్న వైరం కారణంగా పవన్ కల్యాణుని వాళ్ళు అస్సలు సహించలేరు . ఏదో చంద్రబాబుకి మద్దతిచ్చి వాళ్లకి ఉపయోగపడుతుంటే అంతవరకూ హర్షిస్తారు ( అది కూడా చాటుగా భయంకరంగా తిడుతారు ) . ఎలా చూసుకున్నా బీజేపీ తరుపున పవన్ ప్రచారం చేస్తే జరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువ .

ఈ లెక్కలన్నీ దృష్టిలో పెట్టుకొనే పవన్ కల్యాణ్‌ని తీవ్రంగా అవమానించి వైసీపీ , టీడీపీ క్యాడర్ ని సంతోషపెడుతున్నారు . తద్వారా సీమాంధ్ర ఓట్లు తెరాస కంటే బీజేపీకే ఎక్కువ పడేటట్లు చేసే ప్లాన్లో భాగంగానే ఇదంతా చేస్తున్నారని నాకున్న అంచనా .

ఇదే పవన్ కల్యాణ్‌తో బీజేపీ తిరుపతిలో ఎలా వ్యవహరించబోతుంది ?
హైద్రాబాదుకి పూర్తి బిన్నంగా తిరుపతిలో బీజేపీ వ్యవహరించే  అవకాశం ఉంది . పవన్ కల్యాను గ్లామరుని తిరుపతిలో బీజేపీ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోబోతుంది . ఎందుకంటే తిరుపతిలో వైసీపీ , టీడీపీ రెండూ ప్రధానపార్టీలుగా రంగంలో ఉంటాయి . కాబట్టి ఆ రెండు పార్టీల ఓట్లు ఎలాగూ ఆయా పార్టీలకే వెళ్తాయి . కాబట్టి పవన్ కల్యాణ్‌ వలన అదనంగా జరిగే నష్టం లేదు( అదే హైదరాబాద్లో  పవన్ వలన వచ్చే ఓట్లు కంటే పవన్ని అవమానిస్తే వచ్చే ఓట్లే అధికం )  ..కానీ తిరుపతిలో కొద్దోగొప్పో ఇంకా లాభమే జరిగే అవకాశం ఉంది . తిరుపతిలో పవన్ సామాజిక వర్గం ఓట్లు కొద్దిగానైనా  బీజేపీకి పడే అవకాశం ఉంది . సాధారణంగా రాయలసీమలో కొన్ని ప్రాంతాలలో పవన్ సామాజికవర్గం ఎక్కువుగా టీడీపీకి సాంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉంది . పవన్ బీజేపీ తరుపున ప్రచారం చేస్తే ఆ మేరకు టీడీపీకి గండిపడే అవకాశం మెండుగా ఉంది .

దీనిని బట్టి చూస్తే మనకి అర్థమయ్యేదేమిటంటే ..ఆరోజు చంద్రబాబు కానీ , ఈరోజు బీజేపీ కానీ పవన్ కల్యాణ్‌ని తమ అవసరాలకి అనుగుణంగా మాత్రమే వాడుకొంటున్నారు . బహుశా పవన్ కూడా దానికి తగ్గ లాభం ఏమైనా పొందుతున్నాడేమో నాకు తెలియదు . పరువు పోగొట్టుకుంటూ , అవమానాలని భరిస్తూ వాళ్ళు చెప్పినట్లే చేస్తున్నాడంటే లాభం లేకుండా ఎవ్వరూ చేయరు కదా !
నోట్ :- 2014 లో పవన్ పోటీలో లేకుండా తనతో ఉంటే లాభమని చంద్రబాబు లెక్కలు వేసుకొని అదే విధంగా పవన్ , మోడీల సహాయంతో గట్టెక్కాడు . అదే 2019 లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వైసీపీకి వెళ్లకుండా  పవన్ చీల్చగలిగితే మళ్ళీ అధికారంలోకి రావొచ్చనే అంచనాతో పవన్ కల్యాణ్‌తో విడిగా పోటీ చేయించాడు చంద్రబాబు . ఇలా ఆనాడు చంద్రబాబుకి ఎలా కావాలంటే అలా ..ఈరోజు బీజేపీకి ఎలా కావాలంటే అలా పవన్ కల్యాణ్‌ తనకున్న ఆ కొద్దిపాటి వోట్లని తాకట్టు పెడుతున్నాడు .

 – Mani Annapureddy