తెలంగాణ పాలిట అనకొండగా మారిన కేసీఆర్…

478
  • గ్రేటర్ ఎన్నికలని బూటకంగా మార్చిన టీఆర్ఎస్
  • ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిన సీఎం కేసీఆర్
  • ఓట్ల కోసం టీఆర్ఎస్ చిల్లర రాజకీయం  
  • తమాషా చూస్తున్న రాష్ట్ర ఎన్నికల కమీషన్
  • కేసీఆర్ కి బానిసలుగా మారిన ఎన్నికల కమీషన్, పోలీసు వ్యవస్థ
  • ఓటర్లు ప్రజాస్వామ్యంని పరిరక్షించి.. అనకొండ కేసీఆర్ ని తరిమికొట్టాలి  
  •   కాంగ్రెస్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్

 
”తెలంగాణ ప్రజలు కేసీఆర్ ని తాడని మెడలో వేసుకుంటే పాముగా మారి చివరికి అనకొండగా రూపాంతరం చెంది తెలంగాణ సమాజానికి పీడగా మారారు” అని ధ్వజమెత్తారు కాంగ్రెస్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. గ్రేటర్ లో జరుగుతున్న ఎన్నికలని అధికార టీఆర్ఎస్ పార్టీ బూటకంగా మార్చిందని మండిపడ్డారు దాసోజు. అడ్డదారుల్లో సంపాధించిన డబ్బులని వీధుల్లోకి తీసుకొచ్చి ఓట్లు కొనుక్కునే చిల్లర రాజకీయానికి తెరతీసిందని, ఎన్నికల పక్రియపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లేలా వ్యవహరిస్తుందని ఆయన వివరించారు. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్ తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఓట్లకు డబ్బులు పంచుతున్న దృశ్యాలను ఆయన మీడియాకు చూపించారు. టీఆర్ఎస్ నాయకులు గాదెకింద పందికొక్కుల్లా డబ్బులు మింగి, ఆ డబ్బులతో ఇప్పుడు ఓట్లు కొనుక్కునే చిల్లర రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
టీఆర్ఎస్ కార్యకర్తలు గ్రేటర్ పరిధిలో ఒక మిడతల దండు మాదిరిగా పోలీసులతో కుమ్మక్కై ప్రతి ఇంటికి వెళ్లి ఓటు వెయ్యి, రెండు వేల చొప్పున ఇచ్చి ఒక ఆర్గనైజ్డ్  క్రైమ్ కి తెరలేపారని ఆరోపించారు దాసోదు. టీఆర్ఎస్ పార్టీ ఓట్ల కోసం చిల్లర రాజకీయం చేస్తుంటే అటు ఎన్నికల కమీషన్ కూడా చూస్తూ చూడనట్లు వ్యవహరిస్తుంది. ఈ మాత్రం దానికి అసలు ఎన్నికలనే డ్రామా ఎందుకు? టీఆర్ఎస్ పార్టీనే అన్ని సీట్లు గెలిచిందని ఎన్నికల కమీషన్ కి రాసి ఇచ్చేయొచ్చు కదా ? అసలు ప్రస్తుత టీఆర్ఎస్ వైఖరి చూస్తుంటే అసలు ప్రజాస్వామ్యం ఉందా ? రాజ్యాంగం అమలు అవుతుందా ? అనే అనుమానాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు దాసోజు.

గత రెండు వారాలుగా తాము ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ ప్రజలకు ఏం చేయాలనుకుంటుదో వివరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య మార్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించింది. కానీ టీఆర్ఎస్ మాత్రం ఓ దొంగల పార్టీగా మారి డబ్బులు పంచి ఓట్లు దండుకోవాలనే చిల్లర రాజకీయం చేసింది. గతంలో గోడలపై ”బూటకపు ఎన్నికలని బహిష్కరించండి”అనే నక్సలైట్ నినాదాలు చదివి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వారు ఇలా రాస్తారని అనుకునే వాళ్ళం. కానీ ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న దొంగ విధానాలు చూస్తుంటే నక్సలైట్ వాదమే నిజమేమో అన్న అభిప్రాయం ఒక్క క్షణం కలిగిందని పేర్కొన్నారు దాసోజు.
రాష్ట్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్ కు బానిసగా మారింది. ఎంగిలి మెతుకుల కోసం ఫ్రాడ్ గా మారింది. ఎంగిలి మోతుకుల కోసం ఆశ పడితే తప్పులేదు కానీ ప్రజాస్వామ్యంను ఖూనీ చేసే విధంగా రాష్ట్ర ఎన్నికల కమీషన్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత హేయమని మండిపడ్డారు దాసోజు. ప్రస్తుతం జరుగుతున్న గ్రేటర్ ఎన్నికలంత ఫ్రాడ్ బహుసా దేశంలోనే ఎప్పుడూ జరిగుండవు.  ఎన్నికలని ప్రజాస్వామ్య తీరిలో కాకుండా కల్వకుంట్ల రాజ్యాంగం ప్రకారం జరుపుతున్నారు. కమీషనర్ పార్థసారధి ఒక ఐఏఎస్ అధికారనే సంగతి మర్చిపోయి కేసీఆర్ కి ఊడిగం చేస్తున్నారు. భారత రాజ్యాంగంని పరిరక్షించే భాద్యత గల అధికారి ఇలా ప్రజాస్వామ్యంని ఖూనీ చేయడం అత్యంత విచారకరం. కేసీఆర్, కేటీఆర్లు విసురుతున్న డబ్బులకు లొంగిపోయే ఇలాంటి అధికారులు కమీషన్ లో వుండటం వ్యవస్థకే అవమానకరం” అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు దాసోజు.
పోలీసులు కేసీఆర్ ,కేటీఆర్ పాలెగాళ్ళుగా మారిపోయారు. 48వేలమంది పోలీసులని పెట్టామని గొప్పగా చెప్పుకుంతున్నారు. ఒక్క పోలీసులు కూడా ఎన్నికల బందోబస్తు నిర్వహించినట్లు కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డబ్బులు పంచే టీఆర్ఎస్ వాళ్ళని పట్టుకున్నారు తప్పితే ఒక్క చోట కూడా పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం లేదు. పోలీసులంతా కేసీఆర్, కేటీఆర్ బగ్గీల ముందు వురుకుతున్నారు. పోలీసులు, ఎన్నికల సంఘం ఈ వ్యవస్థలన్నీ లోపాయకారిగా  కుమ్మక్కయి టీఆర్ఎస్ గెలుపుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సిగ్గు చేటు” అని ఆరోపించారు శ్రవణ్.
దుబ్బాక ఎన్నికల్లో అక్రమమైన డబ్బులు పట్టుకున్నామని పోలీసు కమీషనర్ అంజన్ కుమార్  ప్రెస్ మీట్ పెట్టిమరీ చూపించారు. మరి గ్రేటర్ విషయానికి వస్తే ఏమైయింది?  ఒక్క రూపాయి కూడా పట్టుకున్న దాఖలాలు లేవు. కాంగ్రెస్ పార్టీగా మేము కొంతమంది డబ్బులు పంచేవాళ్ళని పట్టుకున్నాం. స్టేషన్ లో అప్పగించాం. అయితే వాళ్ళని కూడా ఎలాంటి కేసు లేకుండా వదిలేశారు. ఇంత అన్యాయం ? ” అని ప్రశ్నించారు దాసోజు.
”ప్రజలని ఈ సందర్భంగా చేతులు జోడించి మనవి చేసుకుంటున్నాం. టీఆర్ఎస్ పార్టీ దుర్మార్గాన్ని నయవంచనను మీ ఓటుతో తిప్పికొట్టాలి. నోటుతో ఓటుకు కొనుక్కొవాలని చూస్తున్న విధానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరుకుంటున్నాం. ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాలుపంచుకొని ప్రజాస్వామ్యంను పరిరక్షించే విధంగా మీ ఓటుతో తీర్పు చెప్పాలని కోరుకుంటున్నాం” అని పేర్కొన్నారు దాసోజు.
”తెలంగాణ సమాజానికి మరో విజ్ఞప్తి. తాడని మెడలో వేసుకుంటే పాముగా మారి చివరికి అనకొండగా రూపాంతరం చెంది తెలంగాణ సమాజానికి పీడగా మారారు కేసీఆర్. ప్రజాస్వామ్యంని అడుగడుగునా ఖూనీ చేస్తూ దొరగా వ్యవహరిస్తున్నారు. మన ఇంట్లోకి వచ్చిన పాముని ఏ విధంగా అయితే మరో ఆలోచన లేకుండా కొట్టి చంపుతామో అదే విధంగా కేసీఆర్ అనే అనకొండ పీడని వదిలించుకునే శక్తి మీ ఓటుకు వుంది. మీ ఓటుతో అనకొండ కేసీఆర్ పీడ వదిలించాలి” అని ఈ సందర్భంగా ప్రజలకు మనవి చేశారు దాసోజు.
అదే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. గ్రేటర్ ప్రచారంలో కార్యకర్తలు మంచి ఉత్సాహం చూపించారు. కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ లో అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామో ప్రజలు వివరించగలిగాం. ఇదే ఉత్సాహంతో కేసిఆర్ లాంటి అనకొండ పీడని తొలగించి, ప్రజాస్వామ్యంను రక్షించి, సరికొత్త తెలంగాణ రూపకల్పన   దిశగా కలసి కట్టుగా ముందుకు సాగుదాం” అని పిలుపునిచ్చారు శ్రవణ్.

కార్యకర్తలని ఉద్దేశించి మాట్లాడుతూ.. మన ఇంట్లో చొరబడిన పాముని ఎలా అయితే పోటీ చేసే అభ్యర్థి సహాయం లేదా మరొకరి సాయం కోసం ఎదురు చూడకుండా చేతికందిన కర్రతో కొడుతామో , అదే విధంగా కేసీఆర్ అనే అనకొండనిని మన బ్యాలట్ ద్వారా పారద్రోలాల్సిన  బాద్యత మనదేనని విజ్ఞప్తి చేశారు.