పలనాటి ఉత్సవాలకు శ్రీకారం 

685

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని పల్నాటి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ అయ్యగారు వంశపార్యంపరంగా వస్తున్నా ఆచారంలో భాగంగా ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి నాడు వీరాచారవంతులతో కలిసి వీర్ల దేవాలయంలోని పోతురాజు స్వామి వారికి  101 కోళ్లతో  పాడిగాం కట్టి వీరులను పిఠాదిపతి మరియు ఆచారవంతులు స్మరించుకుంటూ ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది. కార్తీక పౌర్ణమి నుండి పలనాటి ఉత్సవాలకు శ్రీకారం చుట్టి కార్తీక అమావాస్య రోజున కారంపూడి వీర్లదేవాలయం లో ఉత్సవాలను ప్రారంభిస్తారు ఈ ఉత్సవాలు 5 రోజుల పాటు జరుగుతాయి మొదిటిరోజు రచగావు, తరువాత రాయబారం, మందపోరు, కోడిపోరు, కల్లిపాడు పేర్లతో ఈ ఉత్సవాలను ఎంతో ఘనంగా చేపడతారు అలనాడు పలనాటి యుద్ధ సమయంలో యుద్దానికి నండి పలికిన కార్తీక పౌర్ణమి గా చరిత్ర చెపుతుంది కార్తీక అమావాస్య రోజునే పలనాడులోని కారంపూడి  వీరాచారా ఉత్సవాలు ఎందుకు ప్రారంభిస్తారు అంతే పల్నాటి యుద్ధం కార్తీక అమావాస్య నుండి 5 రోజుల పాటు జరిగింది అని చరిత్ర చెపుతుంది అందుకే వీరులను స్మరించుకుంటూ చేసే ఉత్సవాలు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లో గల గుంటూరు జిల్లా ఒకప్పటి కార్యమపూడి నేటి కారంపూడి లో ఈ ఉత్సవాలు జరుగుతాయి మచర్ల, గురజాల రాజ్యాలలో మాచర్ల రాజ్యానికి మంత్రిగా బ్రహ్మనాయుడు, గురజాల రాజ్యానికి మంత్రిగా నాయకురాలు నాగమ్మలు వ్యవరించారని చరిత్ర చెపుతుంది రెండు రాజ్యాలలో దాయాదుల మధ్య పోరే ఈ పలనాటి యుద్ధం ఒక విధంగా చెప్పాలి అంతే మహాభారతన్ని తలపించేదే పలనాటి యుద్ధంగా చెప్పవచ్చు ఈ యుద్ధం పౌరుషాల పురిటిగడ్డ పల్నాటి సీమ నాటి కార్యమపూడి నేటి కారంపూడి లో నాగులేరు వడ్డున కురుక్షేత్రం జరిగింది అని ఈ పలనాటి చరిత్ర ను ఆంధ్ర కురుక్షేత్రంగా ప్రసిద్ధి కెక్కిన పలనాటి యుద్ధం తెలుగు చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం ఈ ప్రాంతంలో పల్లవులు నివసించేవారు అందువలనే ఒకప్పటి పలవనాడు ని నేడు పలనాడు గా పిలువబడుతుంది పోతురాజు కు పాడిగాం కట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని ముందుగా ఆచారవంతులు వీరుల కొణతాలతో  వీర్ల దేవాలయం వద్ద నుండి ఆచారవంతులు గ్రామంలో గ్రామఉత్సవం జరిపారు ఈ సందర్బంగా నరసింహస్వామి ని కూడా గ్రామంలో ఊరేగింపు నిర్వహిస్తూ మొదటగా చెన్నకేశవ దేవాలయానికి వెళ్లి పూజలు నిర్వహించి అక్కడినుండి గ్రామ దేవత అయినా అంకాలమ్మ తల్లి దేవాలయానికి చేరుకొని మేళతాళాలతో పీఠాధిపతి నివాసానికి చేరుకొని అక్కడ నుండి అయ్యగారిని వెంట పెట్టుకొని వీరుల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్బంగా దేవాలయ ప్రాంగణం కార్తీక దీపాలతో అలంకరణగా మారింది అనంతరం ఆచారవంతులు పూజారులు అయ్యవారితో కలిసి పోతురాజు కు పాడిగాం కట్టారు ఈ కార్యక్రమం అర్ధరాత్రి అయినప్పటికీ ఎంతో ఘనంగా జరిగింది. ఇదిఇలా ఉండగా కార్తీక పౌర్ణమి నుండి మొదలై కార్తీక అమావాస్య రోజు గుంటూరు జిల్లా కారంపూడి వీరాచారా ఉత్సవాలు ప్రారంభమవుతాయి అని పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ అయ్యగారు తెలిపారు కరోనా నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటించి ఈ ఉత్సవాలను జరపటం జరుగుతుంది అని అయన ఈ సందర్బంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ఆచారవంతులు, గుడి పూజారులు, పీఠాధిపతి కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

                                                                        – షేక్. ముగ్బుల్ జానీ భాషా