నా నగర గౌరవం చార్మినార్ అంత ఎత్తు…

554

దేశంలో అత్యంత మానవీయమైన పాలన ఇచ్చిన వాళ్లు ఆరు ఏడో నిజాంలు .చివరి యాభై అరవై ఏళ్ల  స్థానిక జాగీర్దార్ల  క్రూరత్వం మినహాయిస్తే. సొంత టంకశాల, రోడ్ , రైలు , నీరు ఉపాధి సమృద్ధిగా ఉన్న తెలంగాణ కుక్కలు చించిన విస్తరి అయ్యింది.ఆంధ్రా నుండి మెరుగైన జీవితం కోసం వ్యవసాయ విస్తరణ చేసిన పెత్తందార్లకు కూలీల సమష్య మొదలైనది.సీమాంధ్ర నాయకత్వం ఎర్రజెండా ముసుగులో ఇక్కడి శ్రామికులు స్థానిక పెత్తందార్ల కింద వ్యవసాయ కూలీల కోసం సంగం పెట్టి వెట్టివిముక్తి  చేసినా కేవలం రైతు మార్పిడి తప్ప కూలీల స్థితి మారలేదు. ఇప్పుడు వెట్టి పోయింది అంటే నేను నమ్మను.స్వయంపాలన పేరుతో ఆర్యసమాజీకుల మొదలు ఎర్రజెండా అవలంబీకుల దాకా విముక్తిని మతదాస్టీకం అనే అద్దాల నుండే చూసారు తప్ప పాలక పక్షం అంటే అయిష్టత మాత్రం కాదు.

అందుకే శ్రీ శ్రీ మొదలు వీర విప్లవ  దాశరధి దాకా కాంగ్రెస్ సంకనెక్కారు. డాంగే నుండి తమ్మినేని దాకా పాలక పార్టీ ల పక్కలు ఎక్కారు. అందుకే వంటి మీద చొక్కా మార్చినంత తేలికగా టోపీలు మార్చారు.వెయ్యేళ్ళ ఇస్లామిక్ పాలన తరవాతనే  పందొమ్మిది వందల ఇరవైల లో ఏర్పాటైన మజ్లీస్  ఇస్లామిక్ రాజ్యం ఆలోచన అనే  సంఘటన మినహాయిస్తే  కూతుబ్షాహీ, ఆసఫ్ జాహీ పాలనలో మెజారిటీ హిందువులను ఒక మైనారిటీ రాజు పరిపాలించారు.

మెజారిటీ ముస్లిం ప్రజలు ఉన్న కశ్మీర్ ను ఒక మైనారిటీ పాలకుడు పరిపాలించాడు.  వందల ఏళ్ల రాజరిక కాలంలో  హిందూ అయినా ముస్లిం అయినా కలిసే బ్రతికారు.వెయ్యేళ్ళ నవాబుల పాలనలో ముస్లిం కానివాడు కబరస్థాన్ కె పోవాలి అనే నీచమైన ఆలోచనకు తావే లేని ఒక పరంపర దక్కన్ నేల మీద ఫరిడ విల్లింది.ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న  ప్రజాస్వామ్య దేశం లో ఉంటే హిందూస్థాన్ లేకుంటే కబరస్థాన్ లాంటి వికృత భావన మూలాలు ఎక్కడ ? అవి కూకటి వేళ్ళతో  పెలిగించాలి అంటే నగర ఓటర్లు మరింత తెలివిగా వుండాలి. దేశ రెండో రాజధాని ఆలోచనలో రాబందుల కన్ను ఇప్పుడు నగరం మీద ఉంది.

జాగ్రత్త..నా నగర గౌరవం చార్మినార్ అంత ఎత్తు.చౌమల్లా అంత రాజసం. ఆర్ట్స్ కాలేజ్ అంత దీరత్వం.జామా మసీదు అంత అందంగోల్కొండ అంత పటిష్టం, ప్రేమగళ్ల పొదరిల్లు…
వంచితే వంగేది కాదు..

                                                          – Gurram Seetha Ramulu