మా పాడు చెరువుకు నీరు..

203
అధికారుల నిర్లక్ష్యం…ఆందోళనలో రైతాంగం
నాలుగు సంవత్సరాలుగా మరమ్మతులు లేక చెడిపోయిన తలుపులు
చెరువు నిండితే పరిస్థితి ఏమిటని భయాందోళనలు
కందుకూరు మండల పరిధిలోని మోపాడు చెరువుకు ఏడు సంవత్సరాల తదుపరి శరవేగంగా నీరు చేరుతున్న ఆనకట్టు పరిధిలోని రైతాంగం సమీప గ్రామాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఈ ఆందోళనకు అసలు కారణం ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం అనే ఆరోపణలు వస్తున్నాయి చెరువుకు నీరు చేరకపోవడంతో తలుపుల గురించి పట్టించుకోని అధికారులు తీరుపై రైతులు ధ్వజమెత్తుతున్నారు వ్యవస్థలో ఇలాంటి నిర్లక్ష్యం కారణంగా 13 తలుపులు పూర్తిగా మరమ్మతులకు గురై  మీరు విడుదల చేసేందుకు అనుకూలంగా లేవని తెలుస్తోంది మిగిలిన తలుపులు కూడా సకాలంలో పని చేస్తాయో లేదో తెలియని పరిస్థితి. ప్రయత్నించిన ఫలితం లేకపోతే పరిస్థితి ఏమిటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు  చెరువు పూర్తి సామర్థ్యం మూడున్నర అడుగులు కాగా ప్రస్తుతం ఒక అడుగు నీరు చేరింది ఎగువ ప్రాంతంలో వర్షాలు పడడంతో నీరు చెరువుకు చేరుతున్నాయి ఈ క్రమంలో చెరువు నిండితే పరిస్థితి ఏమిటని ప్రజలు రైతన్నలు గజగజ వణికిపోతున్నారు అధికారికంగా రెండు వేల ఐదు వందల ఎకరాలు అనధికారికంగా మొత్తం నాలుగు వేల ఎకరాలు సాగులో ఉంది చెరువుకు నీరు చేరిన అధికారుల నిర్లక్ష్యం కారణంగా జరగరానిది జరిగితే పంటల సాగు దేవుడెరుగు ప్రజల జీవితాలతో చెలగాటమాడే అవకాశం ఉంది అధికారులైనా ఆలోచించాల్సిన అవసరం లేదా ఏదైనా సమయంలోనే దప్పిక వేస్తే బావి తవ్విదాహం తీర్చు కుంటా మా అనే విధంగా చెరువుకు నీరు చేరితే మరమ్మతులు లులేకపోతే మౌనమా ఫలితం ఇప్పుడు రైతన్నలు ప్రజలు అనుభవించాల్సి రావటం దారుణం