‘గరళ’మైన గతాన్ని గుర్తు చేసే ‘గాయాలు’

633

అధికారమే పరమావధి గా తెలుగు ప్రజలతో నిస్సిగ్గుగా “కేంద్ర” ప్రభుత్వాల ‘వంచన’కాండ’  

‘అమరావతి కి కేంద్రం ఏమిచ్చింది?’… “లొట్టెడు నీళ్ళు… తట్టెడు మట్టి తప్ప”…ఈ మాటన్నది ఆంధ్రాప్రాంత నాయకులో, ఆంధ్రా మేధావులో, ఆంధ్రా సంఘాలో, ఇంకెవరో కాదు… తెలంగాణ ప్రభుత్వ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు, యువ నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి ‘కేటీఆర్’… గతం లో ఎంతో ఆర్భాటం గా ‘అవశేష ఆంధ్రప్రదేశ్’ కు రాజధాని గా అప్పట్లో ‘అమరావతి’ లో జరిగిన శంకుస్థాపన కార్యక్రమం లో అప్పటి+ఇప్పటి ప్రధాన మంత్రి మోడీ గారు ఎంతో ప్రేమతో, కానుకగా తెచ్చిన లొట్టెడు గంగా ‘కీ’ నీళ్లు + తట్టెడు యమునా ‘కీ’ మట్టి గురించే కేటీఆర్ గారి ఉవాచ… ఇది అక్షర సత్యం… తెలంగాణా వాడైనా ఆంధ్రా గురించి, పొరుగు తెలుగు రాష్ట్రం ప్రజల గురించి,  ఒక నిజాన్ని నిర్భయం గా, వాస్తవాన్ని విపులీకరించినందుకు కేటీఆర్ కు ఆంధ్రా ప్రజానీకం కృతజ్ఞతలు తెలుపుకోవాలి…

ఇక్కడ రాజకీయాలు, సమయం, సంధర్భం, ఇంకా లేనిపోని, పనికిమాలిన చర్చలు వదిలేస్తే … కేటీఆర్ ఒక పచ్చి నిజాన్ని, ఎప్పటికి మానని ఒక గరళమైన గతాన్ని గుర్తుచేశారు… అది కూడా మన సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమైన మన పవిత్ర భారత దేశానికి ప్రాణాధారమైన అతి పవిత్ర భారత రాజ్యాంగం ఆమోదం పొంది 71 సంవత్సరాలు పూర్తిఅయిన అతి పవిత్ర సందర్భం లో… ‘కాన్స్టిట్యూషన్ డే’ లేదా నేషనల్ ‘లా’ డే అనబడే జాతీయ ‘న్యాయ’ దినోత్సవం మన దేశమంతా సంతోషం గా రాజ్యాంగం+న్యాయం మనకు అండగా, దన్ను గా, రక్షణగా ఉందని మన దేశ ప్రజలు నమ్ముకుంటూ  జరుపుకుంటున్నఈ పవిత్ర వారం లోనే… మన పార్లమెంటు తలుపులు మూసేసి మరీ, అసలే కళ్ళు కట్టబడిన న్యాయ దేవత కళ్ళు ఇంకా బిగించి కట్టి, దాంతోబాటే చెవులు, చేతులు కూడా కలిపి మరీ కట్టేసి, సమ న్యాయం – సమ ధర్మం అనే మన ‘అతి’ పవిత్ర రాజ్యాంగాన్ని కూడా ఏమార్చి, కొంచం మార్చి, పరిహసించి, అనుకూలం గా, అన్యాయం గా, అధర్మం గా, అనుకున్నట్టు మార్చేసి మరీ విభజించిన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి కనీసం తెలంగాణ వాడైనా కేటీఆర్ గారు కొంచం బాధ పడుతున్నారు…

అప్పట్లో మీడియా లో కూడా వచ్చింది… పాపం కేసీఆర్ కూడా చాలా సందర్భాల్లో బాధ పడ్డారట…!!!… నేను కోరుకొన్నది ప్రత్యేక తెలంగాణ… కానీ ఆంధ్రా కూడా మంచిగా ఉండాలి… తెలుగు ప్రజలందరికి సమ న్యాయం- సమ ధర్మం జరగాలి అని అభిలషించారట…!!! కానీ అప్పట్లో కేంద్రం లో కొందరు పెద్దల వల్ల, కొందరి నీచ రాజకీయాల వాళ్ళ, కొందరు పనికి మాలిన ఆంధ్ర రాజకీయ నాయకుల వాళ్ళ ఆంధ్రా చాల నష్టపోయింది అని పలు సందర్భాల్లో కేసీఆర్ గారే చెప్పినట్టు చాల మంది చెప్పుకున్నారు… ఇందులో నిజమెంతో దేవుడికే తెలియాలి కానీ… అప్పట్లో ఆంధ్రా ప్రజలకు కేంద్రం హామీ ఇచ్చినవేమీ ఇప్పటివరకు నెరవేరలేదు అని కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఉన్న బాధ, ఆవేదన, ఆందోళన మన ఘనత వహించిన ఆంధ్రా ప్రాంత నీచ రాజకీయ నాయకులకు ఎవరికీ లేకపోవడం దురదృష్టకరం, బాధాకరం, అవమానకరం…

తెలుగు తల్లిని నిలువుగా కోసేశారు, మేమైతే అడ్డం గా కోసేవాళ్ళం… తల్లిని చంపి బిడ్డను తీశారు… మేమైతే తల్లినీ బిడ్డనూ ఎదో చేసేవాళ్ళం… ఆంధ్రా కు అన్యాయం జరిగింది… న్యాయం చేస్తాం… అధర్మం జరిగింది… ధర్మం గా చేయవలసినవన్నీచేస్తాం… ఆంధ్రా కొత్త రాజధాని కేంద్రం బాధ్యత,  ఆంధ్రా మొదటి లోటు బడ్జెట్ మొత్తం కేంద్రం పూడుస్తుంది, పోలవరం పూర్తి గా కేంద్రం స్వంత బాధ్యత, స్పెషల్ స్టేటస్, ప్రత్యేకం… అంటూ ఎన్నో హామీలిచ్చి ఇప్పుడు మట్టీ-మశానం తప్ప ఏమీ విదిలించట్లేదు అనే లోకోత్తర సత్యాన్ని కేటీఆర్ గారు గుర్తుచేశారు.

అప్పట్లో అనుకుని, తర్వాత తీసేసిన ‘అమరావతి –  ఆంధ్రా రాజధాని’ ప్రారంభోత్సవానికి వచ్చిన కేసీఆర్ గారు కూడా  వట్టిచేతులతో రాకూడదని ఒక పెద్ద మొత్తాన్ని గిఫ్ట్ గా కొత్తగా కడుతున్న రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇద్దామని తెచ్చారట…!!!… కానీ ముందు ప్రధాని కూడా ఏదైనా పెద్ద మొత్తం తప్పక ఇస్తాడు కదా, దాని తర్వాత ఇద్దామని ఎదురుచూస్తుంటే… మన ప్రధాని మోడీ గారి గంగాకి పానీ + యమునాకీ మిట్టీ అనే మట్టి మశానం బంపర్ బొనాంజా గిఫ్ట్ ప్రకటన చూసి కేసీఆర్ కు జీవితం లోనే పెద్ద షాక్, కళ్ళు తిరిగాయి… ప్రధానే ఏమీ ఇవ్వనప్పుడు ఇప్పుడు నేనిస్తే ఇంకేం ఇబ్బందులు వస్తాయో అని కేసీఆర్ గారు గిఫ్ట్ ఏమీ ఇవ్వకుండానే  వచ్చిన దారినే వెళ్లిపోయారు అని కొందరు తెరాస నాయకులు చెప్పినట్టు అప్పట్లో అంతా చెప్పుకున్నారు… ఇలా ఉంటాయి ‘గుజ్జు’ కేంద్ర నీచ వంచక రాజకీయాలు…

పెన్మెత్స రవి ప్రకాష్ అశోక వర్మ,
  శృంగవృక్షం, Near భీమవరం,
పాలకోడేరు మండలం,పశ్చిమ గోదావరి జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్