వైసీపీ ప్రభుత్వంలో పూజారులకు  తీరని అవమానం

2721

పూజారుల పై వైసిపి నాయకులు దాడి చేయడం పాశవిక చర్య
  టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఆర్ బి ఎఫ్  జాతీయ అధ్యక్షుడు కాశీభట్ల సాయినాథ్ శర్మ ఆగ్రహం..

కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు ఓంకారేశ్వర ఆలయం లో పూజారుల పై  స్థానిక వైసీపీ నాయకుడు ఆలయ చైర్మన్ ప్రతాప్ రెడ్డి రౌడీలను తీసుకువచ్చిదేవాలయంలో పూజలు నిర్వహిస్తున్న పూజారుల పై  గర్భగుడిలోని  దాడి చేయడం పాశవిక చర్యఅని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు .

వైసీపీ ప్రభుత్వంలో పూజారులకు  తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన మండిపడ్డారు .ఆలయంలో ఉన్న  నిబంధనలకు వ్యతిరేకంగా దేవాలయంలో సాయంత్రం ఐదు గంటల తర్వాత టిక్కెట్ వసూలు చేస్తున్న విషయాన్ని భక్తులు పూజారులు దృష్టికి తీసుకురాగా పూజారులు వెళ్లి ఆలయంలోని క్లర్కు కు తెలపడం పూజారులు  చేసిన నేరమా అని ఆయన ప్రశ్నించారు .టికెట్ల వసూళ్లు సమయం అయిపోయిన తర్వాత కూడా ,భక్తుల నుంచి వైసిపి నాయకులు టిక్కెట్లు వసూలు చేయడం చూస్తే ఈ రాష్ట్రంలో దేవుళ్ల దగ్గర కూడా దౌర్జన్యంగా దండుకోవడానికి వైసిపి నాయకులు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఈ ప్రభుత్వానికిగాని  వీరి అనుచరులకు గాని కొంచమైనా మానవత దృక్పథం  లేనట్టుగా కనిపిస్తోందన్నారు పూజారులు ఆలయంలో తమపై దాడి జరిగిన విషయాన్ని ఆలయ సంబంధిత కార్యనిర్వహణ అధికారికి తెలపగా ఆయన తనకు సంబంధం లేదనట్టుగా మాట్లాడడం చాలా విచారకరమన్నారు .

దౌర్జన్య పరులకు  రౌడీలకు అధికారులు వత్తాసు పలుకుతున్న తీరు సిగ్గుచేటన్నారు  పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు సరైన చర్యలు తీసుకోకపోవడం చూస్తే వైసిపి వారు దౌర్జన్యకాండ అడ్డు  అదుపు లేదన్నట్టుగా కనిపిస్తోందన్నారు, పూజారుల పై దాడి చేసిన ప్రతాపరెడ్డి అతని అనుచరులు పై తక్షణమే నాన్ యిలబుల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే దాడి చేసిన వారందరితో పూజారులకు బహిరంగ క్షమాపణ చెప్పించాలని ఆయన కోరారు సమావేశంలో ఆర్ బి ఎఫ్ జాతీయ స్థాయి నాయకులు అప్పాజీ ప్రవీణ్, విజయ్, జనార్దన్ రావు ,సతీష్ చంద్ర విజయేంద్ర జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

8 COMMENTS

 1. I was very pleased to uncover this page. I need to to thank you for your time for this particularly wonderful
  read!! I definitely loved every little bit of it and i also have you saved to fav to look at new information on your web
  site.

 2. Hi there I am so thrilled I found your weblog, I really found you by mistake, while I was searching on Google for something else, Anyhow I am here now and would just like to say thanks a lot
  for a tremendous post and a all round thrilling blog
  (I also love the theme/design), I don’t have time to read it all at the minute but I have book-marked it and also added your RSS feeds, so when I have time I will be back to read
  a great deal more, Please do keep up the fantastic jo.