వాగులో బయటపడిన పురాతన శివలింగం

300

కృష్ణాజిల్లా÷ నందిగామ  పట్టణంలోని రాఘవాపురం డొంకరోడ్డులో వాగులో  బయటపడిన పురాతన ప్రాచీన శివలింగం. ఈ లింగహారాన్ని చూడటానికి తండోపతండాలుగా భక్తులు మునేటి వద్దకు చేరుకుంటున్నారు. కార్తీకమాసంలో పౌర్ణమికి ముందు రోజు ఒక వ్యక్తి ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉండగా శివలింగ హారం నందీశ్వరుడు బయటపడ్డాడని వాటిపై మట్టి చెత్తాచెదారం తొలగించి కొందరి సహాయంతో పక్కకు పెట్టి  పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.సుమారు 150 సంవత్సరాల క్రితం రాజులు,  జమీందార్లు పరిపాలించే వారని వారి వద్ద నుండి జయంతి కాకుళయ్య గారి వారసులు ఆ పొలాలను జమీందార్లు వద్ద కొన్నారని… పూర్వం ముందు నుండి ఆ పొలాల్లో  పురాతన శివాలయం నిర్మించబడి నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించే వారని… పూర్వం ఆలయం, లింగహరం చుట్టూ నాగేంద్రుడు కాపలాగా ఉండే వారని సమాచారం. ఆ పొలాల అంతా వాగులో కలిసిపోయి  రాతి బండలతో నిర్మాణం చేసినటువంటి గుడి శిధిలమైపోయి మునిగిపోయిందని… వాగులో నీరు లేకపోవడంతో ఆ ప్రాంతంలో తిరుగుతున్న కొంతమంది వ్యక్తులు లింగాకారం ఉందని గుర్తించారు.