ఏ రోజు ఏం పూజ చేస్తే జీవితం అద్భుతంగా మారుతుంది?

495

నిత్యం దేవారాధ‌న శుభ‌క‌రం. అయితే ఏ రోజు ఏ పూజ చేయాలో చాలా మందికి తెలియ‌దు. నిజానికి ఏ రోజు ఏ పూజ చేస్తే సంపూర్ణ ఫ‌లాన్ని , అభిష్ట‌సిద్ధిని పొంద‌గ‌ల‌గుతారో  తెలుసుకుందాం.
ఆదివారం చేయాల్సిన పూజలు
ఆదివారం ఆదిత్యుడిని, ఇతర దేవతలను, వేద పండితులను పూజించాలి. ఆదిత్య పూజ వల్ల నేత్ర వ్యాధులు, శిరోరోగం, కుష్ఠువ్యాధి తగ్గుతాయి. ఆదిత్యుడిని పూజించి పేద‌ల‌కు అన్న‌దానం చేస్తే శుభ‌క‌రం. ఇలా ఒక రోజు నుంచి ఒక మాసం, ఒక సంవత్సరం లేక 3 సంవత్సరాల పాటు రోగ తీవ్రతనను బట్టి పూజ చేయాలి. దీనివల్ల సూర్యానుగ్రహప్రాప్తి కలుగుతుంది.
సోమవారం చేయాల్సిన పూజలు
సంపద కోరుకోనేవారు సోమవారం లక్ష్మీదేవిని ఆరాధించాలి. అదే విధంగా ప‌ర‌మ‌శివుడిని అభిషేకించి ఆరాధ‌న చేయ‌లి. ఆ రోజున పూజ తర్వాత నెయ్యితో వండిన ప‌దార్థాల‌ను అతిథుల‌కు, బంధువుల‌కు పెట్టి, తాము కూడా స్వీక‌రించాలి.
మంగళవారం చేయాల్సిన పూజలు
ఆరోగ్య సమస్యలు తగ్గేందుకు మంగళవారం కాళీ దేవతను పూజించాలి. శ‌త్రువుల నుంచి న‌ర‌దృష్టి నుంచి విముక్తిపొందుట‌కు శ్రీ‌సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామిని ఆరాధించి ఆరోజు మినుము, కంది, పెసరపప్పులతో చేసిన పదార్థాలతో అన్న‌దానం చేయాలి.
బుధవారం చేయాల్సిన పూజలు
మంచి ఆలోచ‌న‌తో కార్య‌సిద్ధిపొందుట‌కు విద్యార్థుల‌కు మేధాశ‌క్తి పెరిగి ప‌రీక్ష‌ల‌యందు విజ‌యాన్ని సాధించుట‌కుగాను బుధవారం రోజున క‌లియుగం దైవం శ్రీ‌వెంక‌టేశ్వ‌ర‌స్వామిని మ‌రియు జ్ఞాన స‌ర‌స్వ‌తిని ఆర్చించి ఆరాధించి పెరగ‌న్నంను నివేదించాలి. ఈ పూజ, నివేదనల వల్ల పూజ చేసిన వారి కుమారులు, మిత్రులు, భార్య తదితరులకు చక్కటి ఆరోగ్యంతో పాటు మంచి ఆలోచ‌న శ‌క్తి పెరిగి అన్నింట విజ‌యం సాధించ‌గ‌ల‌రు.
గురువారం చేయాల్సిన పూజలు
ఆయుష్షును, ఆరోగ్యాన్ని కోరేవారు తమ ఇష్టదైవంతో పాటు శివునికి అర్చ‌న అభిషేకం చేసి పాలు-నెయ్యితో చేసిన పాయ‌సంతో పాటు ఇత‌ర  పదార్థాలను నివేదించాలి. వస్త్రాలను దేవ‌త‌ల‌కు స‌మ‌ర్పిస్తే కూడా శుభకరం.
శుక్రవారం చేయాల్సిన పూజలు
శుక్రవారం రోజు ల‌క్ష్మి ప్రాప్తికై శ్రీ‌ల‌లితాంబ, అష్ట‌ల‌క్ష్ముల‌తో పాటు ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించాలి. ఈ రోజు పూజానంతరం ముత్తైదువుల‌కు తాంబూలంతో పాటు ఫ‌లాలు స‌మ‌ర్పించి తృప్తి కోసం షడ్రుచులతో కూడిన భోజనాన్ని పెట్టాలి. స్త్రీల తృప్తి కోసం మంచి మంచి వస్త్రాలను బహూకరించడం మంచిది.
శనివారం చేయాల్సిన పూజలు
శనివారం రుద్రాది దేవతలతో పాటు విష్ణు, శ‌ని, ఆంజ‌నేయ‌స్వామిస్వామి వారి ఆరాధన మంచిది. అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు ఆనాడు నువ్వులతో హోమం చేసి నువ్వులను దానం ఇచ్చి నువ్వులు కలిపిన అన్నంతో అన్న‌దానం చేస్తే, పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. అదేవిధంగా శని దోష నివార‌ణ క‌లిగి శుభం చేకూరుతుంది..

                                                                                                   – చింతా గోపీ శర్మ సిద్ధాంతి
                                                                  లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం (భువనేశ్వరిపీఠం)
                                                                                              పెద్దాపురం, సెల్:- 9866193557