తంత్ర రహస్య గ్రంధాలు  

ప్రస్తుతం సమీక్షించబడుతున్న రెండు తంత్రశాస్త్ర గ్రంథాలూ, కౌళాచారానికి చెందినవి. యోనితంత్రము, యక్షిణీతంత్రరహస్యమూ, ఉడ్డీశతంత్రమూ,  తగుసాధనల ద్వారా సంతృప్తిపఱిస్తే వారు సాధకుడికి ప్రత్యక్షమై కోరిన కోరికలు తీఱుస్తారనీ ఈ తంత్రరహస్య గ్రంధాలు తెలియబరచుచున్నాయి.  యక్షిణీతంత్రరహస్యములో విద్య, సంతానం, కార్యసిద్ధి, వాక్సిద్ధి, రాజ్యాధికారం, రాజోద్యోగం, ఇతరుల్ని తనకు వశవర్తులుగా చేసుకోవడం వశీకరణ ఇది యోని తంత్రములో వశీకరణం వశీకరణం, స్తంభనం, విద్వేషణం, ఉచ్చాటనం, మారణం ఇత్యాదులు ఉంటాయి ఇక  ఉడ్డీశతంత్రంలో 7 పటలాలు (అధ్యాయాలు) ఉన్నాయి. ఇందులో మంత్రాలతో పాటు సిద్ధౌషధి ప్రక్రియలూ, ప్రయోగాలూ కూడా విస్తారంగా చెప్పబడ్డాయి. లోక కళ్యాణం కొరకు  మారణప్రయోగాల విషయం నాశనం చేయబడినది. అడి రహస్యముగానే ఉంచబడ్డది. ఇవి ఇప్పుడు చేసేవారు చాలా తక్కువ. ఇటు వంటివాటిని దూరముగా ఉంచుట శుభము. వామాచారంలో కొన్ని విఫల తంత్రాలు కూడా ఉన్నాయని, అవి పైకి అసలైన తంత్రాల్లాగే కనిపిస్తూ, ఆచరించినప్పుడు మాత్రం ఏ విధమైన ఫలితాన్నీ ఇవ్వవనీ తంత్రమార్గీయులు చెబుతారు, చెప్పే గురువులు కూడా ఇప్పుడు అరుదు. ఏ విద్య అయ్యినా లోక కళ్యాణమునకు ఉపయోగ పడాలి.

                                                                                             – చింతా గోపీ శర్మ సిద్ధాంతి
                                                              లక్ష్మిలలితా వాస్తు జ్యోతిష నిలయం (భువనేశ్వరి పీఠం)
                                                                                        పెద్దాపురం, సెల్ :- 9866193557

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
Close Bitnami banner
Bitnami