వీసీ పదవుల పందేరంలో అటకెక్కిన సామాజిక న్యాయం

431

ఉపకులపతులు నియామకాలలోఎస్సీ ఎస్టీ బీసీలకు తీరని అన్యాయం
70 ఏళ్ల వయసు దాటిన వారికి కూడా ఉపకులపతి పదవి ఇవ్వడంపై ఆంధ్రప్రదేశ్ టీఎన్ఎస్ఎఫ్ విస్మయం.

– ఏపీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం వి ప్రణవ్ గోపాల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలకు ఇన్చార్జిల పాలన సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు 5 విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులు నియమించడంలో సామాజిక న్యాయం లోపించిందని ఉపకులపతులు నియామకాలలో ఎస్సీ ఎస్టీ బీసీలకు తీరని అన్యాయం తో పాటుగా మహిళలకు సముచిత స్థానం కల్పించకపోవడం మరియు ముఖ్యమంత్రి సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వారికి రాష్ట్రంలో ప్రాచీన యూనివర్సిటీలకు నియమించడం, బడుగు బలహీన వర్గాలకు చెందిన ఆచార్యులకు చిన్న యూనివర్సిటీలను కేటాయించడం వంటి చర్యల ద్వారా ముఖ్యమంత్రి గారికి బడుగు బలహీన వర్గాల పై ఉన్నటువంటి సవతి తల్లి ప్రేమ అర్థం అవుతుందని ఆంధ్రప్రదేశ్ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ప్రణవ్ గోపాల్ విమర్శించారు.
విశ్వవిద్యాలయాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి, దళిత బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఆచార్యులు పై వేధింపులకు గురి చేసేవారికి ఉపకులపతులు గా తిరిగి నియమించడం అనేది రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిర్మూలిస్తారని ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, కోర్టు విచారణ ఎదుర్కొంటున్న వారికి ఉప కులపతి పదవుల్లో నియమించడం అనేది సిగ్గుచేటని విమర్శించారు.

అవినీతి చరిత్ర కలిగినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో అధికారంలో ఉండటం వల్లనే ఈ విధమైనటువంటి నియామకాలు జరుగుతున్నాయి అని విమర్శించారు. గతంలో మాజీ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఉపకులపతులు పై ఆరోపణలు వచ్చిన వెంటనే వారిని దగ్గరకు కూడా రానిచ్చేటువంటి పరిస్థితి ఉండేదని , వారిపై వెంటనే విచారణ కమిటీని వేసి నిజాలు నిగ్గు తేల్చి వారిపై చర్యలకు ఉపక్రమించే వారని అటువంటిది అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారిని కూడా అందలం ఎక్కించడం వంటివి రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారుడుతనానికి నిదర్శనమని, జగన్ మోహన్ రెడ్డి గారు ఎదుర్కొనుచున్న అవినీతి కేసులు వలన వాటిలో ఎక్కడ దొరికిపోతానేమోనని  విజయసాయి రెడ్డి చేతిలో కీలుబొమ్మ అయ్యారని, ప్రతి రోజూ కోర్టు విచారణ ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ తన వద్ద ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు దొడ్డి దారిన  ఇతర పార్టీలకు వెళ్లిపోతారని వారు చెప్పినట్టు చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రికి పరిపాలన పై ఎటువంటి పట్టు లేకపోవడం వల్లే విశ్వవిద్యాలయాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేశారని అందుకు ఉదాహరణే ప్రస్తుతం ఉపకులపతుల నియామకాలని, ఉపకులపతులు నియామకాలలో  పదవుల్లో సగభాగం మహిళలకు కేటాయిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రికి మహిళలపై ఉన్నటువంటి గౌరవం ఏ పాటిదో ఈ నియామకాలు తేటతెల్లం చేశాయి అని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కొంతమంది మేధావులకు ఉపకులపతుల పదవులు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి మాట తప్పి మడమ తిప్పి వారికి అన్యాయం చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు అన్యాయమే జరుగుతుందని ఇది ప్రజలు గమనించి ఇకనైనా ఈ రాష్ట్రంలో దళిత బడుగు బలహీన వర్గాల పై జరుగుతున్నటువంటి అన్యాయాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో గొంతెత్తి ప్రశ్నించాలని వారికి ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపకులపతులను తక్షణమే భర్తరఫ్ చేసి వారి స్థానంలో నీతిమంతులు అయినటువంటి మేధావులను ఉపకులపతులుగా యుజిసి మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలని , ఈ రాష్ట్ర గవర్నర్ వాటిపై దృష్టిసారించి విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.విశ్వవిద్యాలయాలలో మితిమీరిన రాజకీయ జోక్యం పెరిగిపోయి వాటి స్వయంప్రతిపత్తి కి భంగంవాటిల్లి విశ్వవిద్యాలయాల్లో కులకుంపటిలను రాజేసి రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేటువంటి ప్రక్రియను వెంటనే నిలిపివేసి విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తిని కాపాడాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.