ఖబడ్డార్ మజ్లిస్…రెండు గంటల్లోనే దారుస్సలాంను ధ్వంసం చేస్తాం

335

• హిందువుల ఓట్లను చీల్చేందుకే మజ్లిస్ తో టీఆర్ఎస్ డ్రామాలాడిస్తోంది
• పీవీ, ఎన్టీఆర్ ఘాట్లకు వెళ్లి నివాళులు అర్పించి ఆ విగ్రహాలకు అండగా నేనుంటా
• ఇండియా మ్యాచ్ ఓడిపోతే సంబురాలు చేసుకునే వాళ్లను బరాబర్ తరిమికొడతాం
• బీజేపీకి ఒక్క అవకాశమిస్తే హైదరాబాద్ ను మరో ఇండోర్, అహ్మదాబాద్ లా అభివ్రుద్ది చేస్తాం
• కారు, సారు, పదహారు కథ ముగిసినట్లే….కారు, సారు ఇక రారు
• జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు  సంజయ్

భాగ్య నగర్ లో  హిందువులంతా సంఘటితమవుతుంటే చూసి ఓర్వలేని టీఆర్ఎస్ పార్టీ మజ్లిస్ తో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తూ హిందువులను నిట్ట నిలువునా చీల్చాలని కుట్ర చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ మండిపడ్డారు. అందులో భాగంగా ఈరోజు మజ్లిస్ నాయకుల చేత మాజీ ప్రధాని పీవీ నర్సిహారావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాలను కూల్చివేయాలంటూ డ్రామా లాడిస్తున్నారని అన్నారు. ఖబడ్డార్ మజ్లిస్ నాయకులారా…. పీవీ, ఎన్టీఆర్ విగ్రహాలను కూల్చే దమ్ముందా మీకు? మీరు ఆ విగ్రహాలను కూల్చితే ఆ తరువాత రెండే రెండు గంటల్లో మీ దారుస్సలాం కోటను కూల్చివేస్తాం’’అని హెచ్చరించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా బుధవారం నగరంలోని అమీర్ పేట, సనత్ నగర్, ఫతే నగర్, బాలానగర్, చింతల్ డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో జరిగిన సభల్లో బండి సంజయ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల తీరును తీవ్రంగా ఎండగట్టారు. ‘‘హిందువులంతా సంఘటితమవుతుంటే చూసి ఓర్వలేని టీఆర్ఎస్ పార్టీ మజ్లిస్ తో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తూ హిందువులను చీల్చాలని కుట్ర చేస్తోంది. అందుకే ఈరోజు మజ్లిస్ నాయకులు మాజీ ప్రధాని పీవీ నర్సిహారావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాలను కూల్చివేయాలని చెబుతుండ్రు. ఖబడ్డార్ మజ్లిస్ నాయకులారా…. పీవీ, ఎన్టీఆర్ విగ్రహాలను కూల్చిన రెండే రెండు గంటల్లో దారుస్సలాం ను కూల్చివేస్తాం. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే ఎవ్వరికీ భయపడే ప్రసక్తే లేదు.  రేపు ఉదయమే పీవీ, ఎన్టీఆర్ ఘాట్ లకు వెళతా. వాళ్లకు నివాళి అర్పిస్తా. వారి విగ్రహాలకు నేను అండగా ఉంటా. ఆ ఘాట్ల సాక్షిగా మాట ఇస్తా. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే టీఆర్ఎస్ ప్రగతి భవన్ గడీలు బద్దలు కొడతాం. దారుస్సలాంను ధ్వంసం చేస్తాం’’అని  బండి సంజయ్ ఉద్ఘాటించారు.

బరాబర్ పాతబస్తీలో సర్జికల్ స్ట్రయిట్స్ చేసి తీరుతాం
పాతబస్తీలో సర్జికల్ స్ట్రయిక్స్ చేసి పాకిస్తాన్ వలస వాదులను, రోహింగ్యాలను తరిమికొడతామంటూ చేసిన వ్యాఖ్యలను శ్రీ బండి సంజయ్ పునురుద్ఘాటించారు. పాతబస్తీలో సర్జికల్ స్ట్రయిక్స్ చేసి పాకిస్తాన్ లుచ్చా నా కొడుకులను, ఆఫ్ఘనిస్తాన్ రోహింగ్యాలను తరిమికొడతామని నేను అనంగనే టీఆర్ఎస్, మజ్లిస్ నాయకులు తప్పు పడుతున్నారు. ‘నేనొక్కటే అడుగుతున్నా….. ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగితే మనమందరం ఎవరు గెలవాలని మనం కోరుకుంటాం ? ( ఇండియా ..అంటూ జనం నుండి నినాదాలిచ్చారు) ఇండియానే కదా… మరి ఇండియా గెలిస్తే నల్ల జెండాలతో నిరసన తెలిపే పాతబస్తీలోని పాకిస్తాన్ లుచ్చాలను, పాకిస్తాన్ గెలిస్తే సంబురాలు చేసుకునే పిచ్చి వాళ్లను ఏం చేయాలి? సర్జికల్ స్ట్రయిక్స్ చేసి తరిమి కొట్టాలా? వద్దా? (తరిమికొట్టాల్సిందేనంటూ జనం నుండి చప్పట్లు) మరి నేను అదే చెబుతున్నా. బరాబర్ తరిమికొడతాం’’అని పునరుద్ఘాటించారు. ‘‘ హైదరాబాద్ ఏమైనా వాళ్ల జాగీరా? ఎవడుపడితే వాడొచ్చి కబ్జా చేసుకోవడానికి ? రోహింగ్యాలు, పాకిస్తాన్ వాళ్లకు పాస్ పోర్టులు, స్థలాలు, ఆధార్ కార్డులిస్తున్నరు. వాళ్ల ఓట్లతో గెలవాలని టీఆర్ఎస్, మజ్లిస్ చూస్తోంది. మరి అడ్డుకోవాలా? వద్దా? వాళ్లతో గెలవాలనే పార్టీ కూడా ఒక పార్టీనా? సిగ్గుతో తలదించుకోవాలి? కేవలం 12 శాతం మైనారిటీ ఓట్లతో బీహార్ లో ఐదు ఎమ్మెల్యే సీట్లు మజ్లిస్ గెలిస్తే…80 శాతం హిందువులన్నీ హైదరాబాద్ లో అన్ని సీట్లు బీజేపీ గెలవాలా? లేదా? కులాలకు అతీతంగా హిందువులంతా సంఘటితమై బీజేపీని గెలిపించాలి’’అని కోరారు.

సారు, కారు ఇక రారు…అందుకే ఓట్లేస్తేనే ఇండ్లిస్తామని బెదిరిస్తుండ్రు
దుబ్బాక ప్రజల స్పూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ మైండ్ బ్లాంక్ అయ్యేలా తీర్పు ఇవ్వాలని ఈ సందర్భంగా  బండి సంజయ్ భాగ్యనగర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘టీఆర్ఎస్ కు ఓటేస్తేనే ఇండ్లు ఇస్తానని ఆ పార్టీ నాయకులు ఓటర్లను భయపెడుతుండ్రు. మాట్లాడితే  సారు, కారు, పదహారని చెబుతుండ్రు. వాళ్లకు తెల్వదేమో… సార్ పనైపోయింది. ఫాంహౌజ్ లో పడుకుండు. కారు అల్రెడీ పంక్చరై షెడ్డుకు పోయింది. ఆ కారు స్టీరింగ్ ఇప్పుడు మజ్లిస్ చేతిలో ఉంది. ఒవైసీ స్టీరింగ్ తిప్పినప్పుడల్లా ఆ సారు షేక్ అయితుండు. కారు, సారు ఇక రానే రారు. భాగ్య నగర్ ఎన్నికల్లోనే కాదు, 2023 సాధారణ ఎన్నికల్లోనూ అధికారంలోకి వచ్చేది బీజేపీయే’’అని ధీమా వ్యక్తం చేశారు.

మెడమీద తలకాయ లేని సీఎం మనకు అవసరమా?
వరదలొచ్చి చస్తున్నా కనీసం భరోసా ఇవ్వలేని దౌర్భాగ్యపు సీఎం కేసీఆర్ అని బండి సంజయ్ విమర్శించారు. ‘‘ఈ మధ్య కేసీఆర్ మాట్లాడితే మేడమీద తలకాయ ఉండగా నేను అబద్దాలాడనని అంటుండు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగమిస్తానన్నడు. నిరుద్యోగ భ్రుతి ఇస్తానని ఇచ్చిండా? (ఇవ్వలేదని జనం జవాబిచ్చారు) మరి మేడమీద తలకాయలేని సీఎం మనకు అవసరమా?  బ్యాలెట్ తో మేడమీద తలకాయ లేని సీఎంకు బుద్ది చెప్పాల్సిందే కదా’’అని వ్యాఖ్యానించారు.

ఓట్లేస్తే డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని బెదిరించే టీఆర్ఎస్ ను ఓడించండి
లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని శ్రీ బండి సంజయ్ విమర్శించారు. పైగా మళ్లీ ఎన్నికలొచ్చే సరికి టీఆర్ఎస్ కు ఓట్లేస్తేనే డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. దుబ్బాక దెబ్బతో కారు పంక్చరై షెడ్డుకే పరిమితైన టీఆర్ఎస్ ను భాగ్య నగర్ ప్రజలకు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో వరద బాధితుల కుటుంబాలకు రూ.10 వేల ఇస్తానని మాయ మాటలు చెప్పిన కేసీఆర్ తన పేరిట దొంగ లేఖ రాసి పేదలకు డబ్బలు రాకుండా కుట్ర చేశాడంటూ మండిపడ్డారు. ‘‘ బీజేపీకి ఓట్లేసి జీహెచ్ఎంసీ మేయర్ పీఠం అప్పగిస్తే వరద బాధితుల అకౌంట్లోకి నేరుగా రూ.25 వేలు జమ చేస్తాం. మీరే ఆలోచించండి. వరదల వల్ల ఇల్లు, ఫర్నీచర్, కారు, వాహనాలు, పప్పు, ఉప్పు అంతా నష్టపోతే కనీసం అంచనా వేయలేని దగుల్బాజీ సీఎం కేసీఆర్. మేం అధికారంలోకొస్తే అవన్నీ అంచనా వేస్తాం. పరిహారం కట్టిస్తాం.’’అని హామీ ఇచ్చారు.

2 లక్షల ఇండ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన రూ.3,500 కోట్లు ఏం చేసినావ్ కేసీఆర్
హైదరాబాద్ అభివ్రుద్దికి కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి పచ్చి అబద్దాలు చెబుతున్నాడని దుయ్యబట్టారు. ‘కేసీఆర్… ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 2,03,87 ఇండ్ల నిర్మాణానికి రూ.3,500 కోట్లను నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్రం మంజూరు చేసింది. అందులో ఒక్క హైదరాబాద్ లోనే 1.4 లక్షల ఇండ్లు కట్టాలని డబ్బులిచ్చింది.  కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు అయినా ఇచ్చిందా? పేదలకు ఉచిత బియ్యం కోసం కిలోకు రూ.29 ల 85 పైసల చొప్పున కేంద్రం రాష్ట్రానికి డబ్బులు చెల్లిస్తుంది నిజం కాదా? ఆ డబ్బుతో తన ఫొటో పెట్టకుని రూపాయికే కిలో బియ్యం నేనే ఇస్తున్నానని దౌర్భాగ్య పరిస్థితికి దిగజార్చిన కేసీఆర్. హైదరాబాద్ లో రోడ్ల నిర్మాణానికి, లైట్లు, డ్రేనేజీ నిర్మాణానికి ఖర్చు చేస్తున్న నిధులన్నీ కేంద్రం మంజూరు చేసినవే.  కమ్యూనిటీ హాళ్లు, మహిళా సంఘాలతోపాటు చివరకు స్మశాన వాటికల నిర్మణానికి ఇచ్చిన పైసలు కేంద్రానివే. అయినా ఇవన్నీ నావేనంటూ ఫొటోలు మార్చుకుని హైదరాబాద్ లో లక్షలాది హోర్డింగులు, ఫ్లెక్సీలు పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకునే దౌర్భాగ్య సీఎం కేసీఆర్. చివరకు కేంద్రం నిర్మించిన బాత్రూం(మరుగుదొడ్లు)లనూ ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి వదలకుండా ఫొటోలు పెట్టుకుండు. చివరకు మేం ఫిర్యాదు చేస్తే తీసేస్తుండ్రు’’అని మండిపడ్డారు.

లింగు, లింగడి పార్టీ టీఆర్ఎస్ దే – ప్రభుత్వ ఆస్తులమ్ముకుని దోచుకునేది వాళ్లే
బీజేపీలో లీడర్లే లేరని చెబుతున్న టీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలపై  బండి సంజయ్ స్పందిస్తూ ‘బీజేపీలో పెద్ద లీడర్లు లేరా? మస్తు మంది ఉన్నరు. మా కిషన్ రెడ్డి లేరా? మా లక్మణ్ లేరా?  మరి నీ పార్టీలో ఎవరుండ్రు.  లింగు, లింగడి మాదిరిగా తండ్రీ కొడుకులే కదా ఉంది. మీ ఇద్దరి ఫొటోలో పెట్టుకుని ఓట్లు దండుకోవాలని చూస్తుండ్రు కదా. మీరా మమ్ముల్ని విమర్శించేది?’’అని పేర్కొన్నారు. కేంద్రం బీజేపీ ఆస్తులను అమ్ముకుంటోందని టీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘‘ హైదరాబాద్ లో ఏటా రూ.10 వేల కోట్ల ఆస్తులను అమ్ముకుతింటున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? ఆర్టీసీని చంపేసి ప్రైవేటు పరం చేస్తోందెవరు ఈ కేసీఆర్ కాదా? మీరు బీజేపీని విమర్శించేది.’’అని మండిపడ్డారు.

బరాబర్ హిందువుల కోసం పోరాడుతూనే ఉంటాం
భాగ్యలక్ష్మీ ఆలయానికి ఎందుకు పోవాలని వ్యాఖ్యానిస్తున్న టీఆర్ఎస్ నేతల తీరును  బండి సంజయ్ తూర్పారపట్టారు. ‘‘ఏం భాగ్యలక్ష్మీ హైదరాబాద్ లో లేదా? పాకిస్తాన్ లో ఉందా? ఎందుకు పోకూడదు. బరాబర్ పోతం. 12 శాతం మంది ఓట్ల కోసం కొట్లాడే మీరు మాత్రం సెక్యులర్ పార్టీలా? 80 శాతం మంది హిందువుల కోసం కొట్లాడే బీజేపీ మతతత్వ పార్టీయా? సిగ్గుతో తలదించుకోండి. బరాబర్ హిందు ధర్మాన్ని కాపాడతాం. అసలు సిసలైన దేశద్రోహుల పార్టీ మజ్లిస్, ఉగ్రవాదులు చస్తే సంతాప సభలు పెట్టిన పార్టీ మజ్లిస్. ఆ పార్టీతో చెట్టాపట్టాలేసుకునే టీఆర్ఎస్ కు సిగ్గు లేదా?’’అని ప్రశ్నించారు.

అభివ్రుద్ది, ఆత్మగౌరవం మాకు బీజేపీకి రెండు కళ్లు
భాగ్యనగర్ ప్రజలకు అభివ్రుద్ది ముఖ్యమే. ఆత్మగౌరవం ముఖ్యమే. బీజేపీకి ఈ రెండు కళ్లు. మేయర్ పీఠం అప్పగిస్తే భాగ్య నగర్ ను అన్ని విధాలా అభివ్రుద్ది చేసే బాధ్యత మాది. ఆత్మ విశ్వాసంతో హిందువులు సంక్షేమానికి, మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తాం.

మేయర్ పీఠం అప్పగిస్తే భాగ్యనగర్ ను మరో సూరత్, ఇండోర్ లా అభివ్రుద్డి చేస్తాం
హైదరాబాద్ డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తానన్నడు. చేసిండు. లేదే. హైదరాబాద్ ను ఖల్లాస్ చేసిండు. హైదరాబాద్ అభివ్రుద్దికి కేంద్రం రూ. వేల కోట్ల నిధులిస్తోంది. రాష్ట్రంలో బీజేపీకి అధికారం లేకపోయినా భాగ్యనగర్ కోసం నిధులు తీసుకొస్తున్నాం. ఇప్పటి వరకు టీడీపీ, కాంగ్రెస్, మజ్లిస్, టీఆర్ఎస్ పార్టీలకు మేయర్ అయ్యే అవకాశం ఇచ్చారు. ఈసారి బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి.  ఈసారి బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకొచ్చి భాగ్య నగర్ రూపురేఖలు మారుస్తాం. మరో సూరత్, ఇండోర్, అహ్మదాబాద్ నగరాల మాదిరిగా అన్ని విధాలా అభివ్రుద్ది చేస్తాం.

దుబ్బాక దెబ్బకు కేసీఆర్ మైండ్ బ్లాంక్ అయ్యింది
దుబ్బాకలో కొట్టిన దెబ్బకు సీఎం మైండ్ బ్లాం.క్ అయ్యింది. స్క్రిప్ట్ రాసి మజ్లిస్ తో రెచ్చగొట్టే మాటలు మాట్లాడిస్తుండు. 12 శాతం  ముస్లిం ఓట్లతో గెలిచే ప్రయత్నం చేస్తుండు.  వాళ్లు 12 శాతం ఓట్ల కోసం పాకులాడే వాళ్లేమో మాత్రం సెక్యూలర్లట. 80 శాతం హిందువుల మనోభావాలు, సంక్షేమం కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ మాత్రం మతతత్వ పార్టీ అట. ఎస్ బీజేపీ హిందూ ధర్మం కోసం, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేసినా, గోమాతను వధించే వాళ్లను ఎక్కడికక్కడ అడ్డుకునే పార్టీ బీజేపీ. పింక్, పచ్చ జెండాలతో టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలొస్తున్నాయి. కాషాయా జెండా కమలం పువ్వుతో బీజేపీ మీ ముందుకొస్తున్నది. సీఎం నాపై ఆరోపణ చేస్తుండు. పేదలకిచ్చే రూ.10 వేలు ఎందుకు ఆపినవో ప్రమాణం చేద్దువ్ రా…తోక ముడిచిండు.

భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం పాకిస్తాన్ లో ఉందా?
బీజేపీ అల్లకల్లోలం చేసేందుకు భాగ్యలక్షీ ఆలయానికి నేను పోయినాని ఓ మంత్రి చెప్తుండు. నేనొక్కటే అడుగుతున్నా…‘భాగ్య లక్ష్మీ అమ్మవారి ఆలయం పాకిస్తాన్ లో ఉందా? నువ్వే పాకిస్తాన్ అనుకుంటున్నావా? భాగ్య నగర్ ప్రజలారా….పాకిస్తాన్ భాగ్యనగర్ కావాలా?..హిందూస్తాన్ భాగ్య నగర్ కావాలా? మీరే తేల్చుకోండి. అరాచకాలు, అక్రమాలతో అడ్డదారిలో మజ్లిస్, టీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామాలకు గుణ పాఠం చెప్పాలంటే బీజేపీకి ఓటేయాలి’’అని పిలుపునిచ్చారు.