జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించిన సీఎం వైయస్‌.జగన్‌

525

ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడిన వైయస్‌.జగన్‌.

శ్యామల, కలంకారీ నిపుణురాలు, కాళహస్తి, చిత్తూరు జిల్లా
ఈ  కరోనా కష్ట కాలంలో ఎక్కడైనా రుణం తీసుకోవాలంటే… రూ.10 వడ్డీ లేనిదే ఎవరూ ఇచ్చేవారు కాదు.
మాకు వ్యాపారం జరిగినా, జరగకపోయినా వాళ్లకి వడ్డీ డబ్బులు ఇచ్చేయాలి.
అలాంటి సమయంలో మీరు జగనన్న తోడు పథకం ప్రవేశపెట్టి మాకు వడ్డీ లేని డబ్బులిచ్చి చాలా సహాయం చేస్తున్నారు.

15 సంవత్సరాలుగా కలంకారీ వృత్తి చేస్తున్నాను.
జగనన్న తోడు ప్రారంభించి చాలా మేలు చేశారు.
పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలకు వరకు కలంకారీ పనిచేస్తాను. జగనన్న తోడు పథకం ప్రారంభించి చాలా మేలు చేశారు. ఈ కష్ట కాలంలో,  కరోనా కాలంలో ఎక్కడైనా రుణం తీసుకోవాలంటే… రూ.10 వడ్డీ లేనిదే ఎవరూ ఇచ్చేవారు కాదు. అది కూడా మాకు వ్యాపారం జరిగినా, జరగకపోయినా వాళ్లకి వడ్డీ డబ్బులు ఇచ్చేయాలి. అప్పటి దాకా వదలరు. అలాంటి సమయంలో మీరు జగనన్న తోడు అనే పథకం ప్రవేశపెట్టి మాకు వడ్డీ లేని డబ్బులిచ్చి చాలా సహాయం చేస్తున్నారు .ఇదే కాకుండా మా మాయయ్య గారికి పించన్‌ అందుతోంది. మా పిల్లలకు అమ్మఒడి అందుతోంది. మాకు చాలా ప్రోత్సాహం ఇస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వం మరలా, మరలా రావాలి. చాలా ధన్యవాదములు. మహిళలు పైకి వచ్చేందుకు సహాయపడుతున్నందుకు ధన్యవాదములు. మీరే సీఎంగా రావాలి.

స్వాతి, పద్మనాభం, విశాఖపట్నం
నేను అద్దింట్లో ఉంటున్నాను.
నా చెల్లెలు అద్దింట్లో ఉండడమేంటని… నాకు ఇళ్ల స్ధలం ఇచ్చావు. ఇళ్ల స్ధలం ఇస్తే సరిపోతుందా… ఇళ్లు కట్టుకోవడానికి స్దోమత ఉందో లేదో అని నా తరపునుంచి మీరే ఆలోచించి ఇళ్లు కూడా నిర్మించి ఇస్తారని వాలంటీర్లతో చెప్పించారు.
మీరు నిజంగా దేవుడు. మీలాంటి దేవుడిని వదులుకోవడం ఎవరి తరం కూడా కాదు.

నేను కూరగాయలు వ్యాపారం చేసుకుంటున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీతో మాట్లాడటానికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను రోడ్డు పక్కన గంపల్లో కూరగాయలు పెట్టుకుని వ్యాపారం చేస్తాను.
చిన్న బడ్డీలాంటిది తయారు చేసుకుని సాయంత్రం వరకు కూరగాయలు ఆ తర్వాత ఆ బరువును ఇంటికి తీసుకెళ్లకుండా ఆ బడ్డీలోనే ఉంచి మరలా తీసుకుని అమ్ముకోవాలన్నది నా కల.
నాకు కావాల్సిన డబ్బులు లేకపోవడం వల్ల బ్యాంకు వారిని సంప్రదిస్తే నీకు ఏం హామీ ఉందన్నారు. నాకు నేను తప్పే మరే హామీ లేదన్నాను. లోన్‌ ఇవ్వడం జరగదన్నారు. దీంతో ఫైనాన్స్‌ వాళ్ల
దగ్గర రూ.10 వేలు రుణం తీసుకున్నాను. వాళ్లు ముందుగానే నా దగ్గర రూ.1500 వడ్డీ తీసుకుని కేవలం రూ.8500 మాత్రమే నా చేతికి ఇచ్చారు. రోజుకు రూ.100 చొప్పున వంద రోజులు కట్టమన్నారు. నా ఆరోగ్య పరిస్ధితి బాగాలేకపోయిన ఆ రోజు వర్షం పడి వ్యాపారం జరగకపోయినా నేను రూ.100 కట్టాల్సి వచ్చేది. ఒకవేళ నేను ఆరోజు రూ.100 కట్టకలేకపోతే మరుసటి రూ రూ.10 ఫైన్‌తో కలిసి రూ.110 కట్టాలి. వడ్డీలు మీద వడ్డీలు కట్టాల్సి వచ్చేది. సొంత ఇళ్లు లేక ఇందులోనుంచే ఇంటి అద్దె కట్టేదానిని. అలాంటి సమయంలో వాలంటీరు నా దగ్గరకు వచ్చి మీ లాంటి తట్టల్లో  కూరగాయలు అమ్ముకునేవారు, చిరు వ్యాపారాలకు రూ.10 వేలు రుణం వడ్డీ లేకుండా ఇస్తున్నారని చెప్పారు. జగనన్న తోడుగా ఉన్నారంటూ నన్ను జగనన్న తోడు పథకానికి లబ్ధిదారుని చేశారు. నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు నా కల నెరవేరింది. నా సొంతంగా ఈ పదివేల రూపాయలతో బడ్డీ కొట్టు పెట్టుకుంటాను.
బ్యాంకు వాళ్ల కాదన్నారు. మీరు వాళ్లకు ఏం చెప్పారే వాళ్లే నాకు ఫోన్‌ చేసి జగనన్న తోడు కింద రూ.10 వేలు ఇస్తామన్నాను. అన్నయ్య మీ మేలును ఎప్పటికీ మర్చిపోలేను.
ఇన్ని సంక్షేమ పథకాలు మాలాంటి వాళ్లను గుర్తించుకుని పెట్టడం గొప్ప విషయం. మాట చెప్పి మర్చిపోయే వాళ్లు ఎక్కువ.. అలాంటిది మాకోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు. మా పాపకు అమ్మఒడి వచ్చింది. ప్రభుత్వ స్కూళ్లో చదువిస్తున్నాను.
మా అమ్మగారికి పెద్దకొడుకులా నిల్చి… చేయూత అందించారు.
నా భర్తకు వైయస్సార్‌ వాహనమిత్ర కూడా వచ్చింది. మీరే మాకు ఎప్పటికీ సీఎంగా రావాలి. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. నేను అద్దింట్లో ఉంటున్నాను. నా చెల్లెలు అద్దింట్లో ఉండడమేంటని… నాకు ఇళ్ల స్ధలం ఇచ్చావు. ఇళ్ల స్ధలం ఇస్తే సరిపోతుందా… ఇళ్లు కట్టుకోవడానికి స్దోమత ఉందో లేదో అని నా తరపునుంచి మీరే ఆలోచించి ఇళ్లును కూడా నిర్మించి ఇస్తారని వాలంటీర్లతో చెప్పించారు. మీరు నిజంగా దేవుడు. మీలాంటి దేవుడిని వదులుకోవడం ఎవరి తరం కూడా కాదు.
మీరిచ్చిన సంక్షేమ పథకాల వల్ల…. మా ఒక్క కుటుంబమే 1 లక్షా 68 వేల 800 రూపాయలు లబ్ధి పొందింది. నా లాంటి కుటుంబాలు ఎన్ని వేలకుటుంబాలు ఇలా సాయం పొందుతున్నాయో. మేనిఫెస్టోలో 9 పథకాలు అని చెప్పారు. ఎటు చూసినా అవి 90 పథకాల్లా కనిపిస్తున్నాయి.

జి. సత్య, వలసపాకుల గ్రామం, కాకినాడ రూరల్‌ మండలం, తూర్పుగోదావరి
ఎన్నో పథకాల ద్వారా వచ్చిన డబ్బుని ఇటు నా పిల్లలను చదివించుకుంటూ అటు నా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ నా కుటుంబం ముందుకు వెళ్లడంలో నా భర్తకి నా వంతు సాయం చేస్తున్నానంటే దానికి కారణం మీరే.
ప్రతిరోజు నా భర్తతో నా అన్నే వచ్చి నా పుట్టింటి నుంచి నన్ను ముందుకు నడిపిస్తున్నాడని మీ గురించి చాలా గర్వంగా చెప్పుకుంటాను అన్నా.
కడుపులో కన్ను కూడా తెరవని బిడ్డ మొదలు.. వృద్ధ్యాప్యంలో ఉన్న అవ్వా తాతలు వరకు అందని పథకం లేదు, అందుకోని గడపా లేదు. ఎక్కడున్నాడన్నా ఇలాంటి ముఖ్యమంత్రి.
మా రాష్ట్రానికి దక్కినందుకు మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది, మళ్లీ మళ్లీ మీరే రావాలి.

నేను మసాల దినుసుల వ్యాపారం చేస్తూ ఉంటాను. ప్రతి నిమిషం ప్రజల మంచి కోసం ఆలోచిస్తూ… ఆ ప్రజల వెన్నంటే ఉంటూ  ముందుకు తీసుకెళ్లే ఏ నాయుకుడికైనా  ఆ ప్రజల అండదండలు, దీవెనలు ఎప్పుడూ తోడుగా ఉంటాయి అన్నా. అలాంటి ఒక గొప్ప నాయకుడుని ఎన్నుకుని ఈ రోజు మేం ప్రతిరోజు ఒక పండగ వాతావరణంలో ముందుకు వెళ్తున్నామంటే దానికి కారణం మీ పరిపాలనే. ఇలాగే మీరు ఎప్పుడూ బాగోవాలి, బాగుంటారని కోరుకుంటున్నాను. మీరు నవరత్నాల్లో చాలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అందులో ఇచ్చిన మాటతో పాటు ఇవ్వని మాటను కూడా నూటికి నూరు శాతం అది అమలు జరిగేలా చూడ్డంతో పాటు ప్రతిఒక్క అర్హునికి అది చెందాలి అని చెప్పి ప్రతి కుటుంబానికి  మేనమామగా, అన్నగా, తమ్ముడిగా పెద్ద దిక్కుగా నిల్చారు. మా మహిళల కోసం మీరు మా మీద నమ్మకంతో ప్రవేశపెట్టిన పథకాలని మీ నాయకత్వంలో మేం విజయవంతంగా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ప్రవేశపెట్టిన జగనన్న తోడు పథకం కొండంత అండగా ఎలా నిలబడిందంటే నాకు…  ఏ డబ్బైతే నేను వడ్డీకి అని పక్కనపెడుతున్నానో అదే డబ్బుని నా వ్యాపార అభివృద్ధికి పెట్టుకునే విధంగా బ్యాంకు ద్వారా మీరిచ్చిన సున్నావడ్డీ పథకాన్ని నాకే తెలియకుండా ఆ అప్పు తీరిపోయే విధంగా ఈ పథకాన్ని ముందుకు తీసుకొచ్చినందుకు నా తరపు నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా తూర్పుగోదావరి జిల్లాలో 90 వేల మంది నాలాంటి అర్హులను గుర్తించారు. మా చిరు వ్యాపాలకు కూడా కష్టాలు ఉన్నాయని వాటిని గుర్తించి మాకోసం సాయం చేసిన ఈ నాయకుడ్ని ఎలా పొగడాలో కూడా తెలియడం లేదు. ఎండా, వాననక వచ్చిన డబ్బులు వడ్డీలు కట్టడానికే సరిపోయేవి. మళ్లా పెట్టుబడులు పెట్టాలంటే  డబ్బులు సరిపోక మరలా అప్పులు చేయాలి.  కరోనా టైంలో వ్యాపారం లేక అప్పులు కట్టలేక చాలా కృంగిపోయాం. ఈ సయంలో మీరు గొప్ప ఆలోచన చేసి మాకు కొండంత అండగా నిల్చినందుకు మా జిల్లా ప్రజల తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
నా వ్యక్తిగతంగా నాకు అమ్మఒడి రూ.15వేలు పొందాను. మా పిల్లలకు స్కూల్లో యూనిఫారమ్‌లు, బూట్లు, పుస్తకాలు అందజేశారు.  మా అత్తయ్యకు కాపునేస్తం వచ్చింది. టైలరింగ్‌లో కూడా రూ.10 వేలు పొందాను. ఇలా ఎన్నో పథకాల ద్వారా వచ్చిన డబ్బుని ఇటు నా పిల్లలను చదివించుకుంటూ అటు నా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ నా కుటుంబం ముందుకు వెళ్లడంలో నా భర్తకి నా వంతు సాయం చేస్తున్నానంటే దానికి కారణం మీరే.
ప్రతిరోజు నా భర్తతో నా అన్నే వచ్చి నా పుట్టింటి నుంచి నన్ను ముందుకు నడిపిస్తున్నాడని మీ గురించి చాలా గర్వంగా చెప్పుకుంటాను అన్నా.
కడుపులో కన్ను కూడా తెరవని బిడ్డ మొదలు.. వృద్ధ్యాప్యంలో ఉన్న అవ్వా తాతలు వరకు అందని పథకం లేదు, అందుకోని గడపా లేదు. ఎక్కడున్నాడన్నా ఇలాంటి ముఖ్యమంత్రి. మీరు మా రాష్ట్రానికి దక్కినందుకు మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది.  మళ్లీ మళ్లీ మీరే రావాలి. పెద్ద దిక్కై నిలబడాలి. అన్నపూర్ణగానే కాదు, సిరిసంపదలతో తులతూగే రాష్ట్రంగా మీరే తీర్చిదిద్దుతున్నారు. మరికొద్ది రోజుల్లో పేదవాడి ఇంటి కల నెరవేరుస్తారని ఎంతో నమ్మకంతో ఉన్నాను.

మా తాతయ్య మీకో మాట చెప్పమన్నాడు అన్నా.. ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్‌ జరిగింది. ఈ రోజు క్షేమంగా మా ముందు తిరుగుతున్నాడంటే మీరే కారణం. ఆయన ఒక్కటే చెప్పమన్నాడు. నా మనవడికి నా ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుంది.  ఆయన ఏ బాటలో వెళ్లినా కూడా విజయం సాధించి వెనక్కి వస్తాడు అని చెప్పమన్నాడు. మీరు వెళ్లే ప్రతి అడుగులోనూ మీ వెన్నంటే మా ప్రజలంతా ఉంటాం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా విజయం సాధించాలి. మీ చిరునవ్వే మాకు కొండంత బలం.

మధులత, అనంతసాగర్‌ కాలనీ, అనంతపురము
మీరు కరోనా టైంలో ఇచ్చిన రేషన్‌ మమ్మల్ని ఆదుకుంది.
మీరు ముందుకు సాగండి నా అక్కచెల్లమ్మల్లారా.. నేను వెనుకున్నానని మా అన్నదమ్ములు కూడా మాకు చెప్పలేదు.
బ్యాంకులో మీరు ఆ రోజు ష్యూరిటీ అడిగినారు ఈ రోజు నా అన్న ఏ ష్యూరిటీ లేకుండా లోన్‌ ఇచ్చారని గుర్తింపు కార్డు చూపించి ఈ  డబ్బులు డ్రా చేసుకుని వస్తాను.
మీరే మమ్నల్ని నడిపిస్తున్నారు.
మరో ముఫ్పైయేళ్లే కాదు మేమున్నంతవరకు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి.

బుక్కరాయసముద్రం మండలం అనంతసాగరం కాలనీలో ఉంటున్నాను. 25 సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నాను. రెండు సంవత్సరాలుగా అగరుబత్తీలు తయారు చేస్తున్నాను. గతంలో బ్యాంకుకు పోతే లోన్‌ కావాలని, ఎవరైనా ష్యూరిటీ ఉంటేనే రుణం ఇస్తామన్నారు. ఎవరూ ఇవ్వలేదు. ఈ రోజు నేను ఇంటిదగ్గర పనిచేసుకుంటుంటే వాలంటీరు వచ్చి నీకు జగనన్న తోడు వచ్చింది అన్నారు. మీరిచ్చిన గుర్తింపు కార్డు తీసుకుని పోయి… బ్యాంకులో మీరు ఆ రోజు ష్యూరిటీ అడిగినారు ఈరోజు నా అన్న ఏ ష్యూరిటీ లేకుండా లోన్‌ ఇచ్చారని గుర్తింపు కార్డు చూపించి ఈ  డబ్బులు డ్రా చేసుకుని వస్తాను. ఆ పదివేల రూపాయలు గతంలో బ్యాంకు వాళ్లు ఇవ్వకపోతే నేను ఫైనాన్స్‌ తీసుకున్నాను. దానికి రోజుకి వందరూపాయలు కట్టమన్నాడు.  రోజుకి రెండువందలు వస్తే.. దాంట్లో ఆయనకి వంద రూపాయలు పక్కనబెట్టి, పెట్టుబడి తీసేస్తే నాకు రోజుకి రూ.25 వచ్చేది. మీ పాలనలో నవరత్నాల్లో నేను కూడా అర్హురాలినయ్యాను. వాహనమిత్ర మాకు వచ్చింది. నా కొడుకు బీటెక్‌ ఫైనల్‌ఇయర్‌. విద్యా దీవెన వచ్చింది. నాకు కూతురు ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఇద్దరినీ చదివించుకున్నాను. మీరు కరోనా టైంలో ఇచ్చిన రేషన్‌ మమ్మల్ని ఆదుకుంది. మీరు ముందుకు సాగండి నా అక్కచెల్లమ్మల్లారా.. నేను వెనుకున్నానని మా అన్నదమ్ములు కూడా  మీలా మాకు చెప్పలేదు. మరో ముఫ్పైయేళ్లే కాదు మేమున్నంతవరకు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి.