ఖాసిం రజ్వీ–మజ్లిస్౼హైదరాబాద్ చరిత్ర..

785

నిజాం ఉస్మాన్ అలీ ఖాన్.. అసిఫ్ ఝా VII.. ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడేందుకు.. ఇక్కడి ప్రజలను ఊచకోత కోసేందుకు లాతూర్ నుంచి వచ్చిన పరమ దుర్మార్గుడు ఖాసిం రజ్వీ. ఖాసిం రజ్వీ ఆధ్వర్యంలో ఉన్న మిలిటెంట్ గ్రూప్ (నిజాం అనఫిషియల్ సైన్యం) ‘రజాకార్ల’ పేరుతో చెలామణీ అయ్యేది..రజాకార్లు ఎంతటి రాక్షసులు అంటే.. (ఈ రోజుల్లో మన ఊహ కు కూడా అందనంత అక్రమంగా నిజాం నిర్దేశించిన పన్నులు ఉండేవి) పన్నులు చెల్లించని వారి గోర్ల కింది మాంసం కత్తి తో కోసి గోర్లు ఊడబెరికే వారు. భర్తల ముందే భార్య లను అత్యాచారం చేసే వారు.

భార్య ల ముందే భర్త లను నరికి చంపే వారు.. భర్తల ఆచూకి చెప్పక పోతే పిల్ల వాళ్ళను పైకి ఎగురేసి కత్తి కి గుచ్చి చంపే వారు. ఆ రోజుల్లో రజాకార్లను చూసిన వాళ్లెవరూ బతికిన దాఖలాలు.. లేవు.. రజాకార్ల సైన్యం.. గుర్రాల మీద ఊళ్ల వెంట పోతుంటే.. అంతా భయంభయంగా తలుపులేసుకుని చిన్న చిన్న సందుల్లోంచి చూసేవాళ్లు.. రజాకార్లు వెళ్తున్న సమయంలో ఎవరైనా రోడ్డుమీదకనిపిస్తే.. వాళ్లను గుర్రాలకు కట్టి ఈడ్చుకెళ్లి పాశవికంగా హత్య చేసేవాళ్లు.

రజాకార్ల అండతో.. ఆఖరి నిజాం.. హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్ లో కలిపేందుకు లేదా స్వతంత్ర రాజ్యంగా ఉండాలనే గట్టి ప్రయత్నం చేశాడు.. నిజాం తరుపున రాయభారానికి డిల్లీ వెళ్లిన ఖాసీం, “హైదరాబాద్ ను భారత్ లో కలుపాలి అని చూస్తే ఇక్కడ ఉన్న కోటి మంది ప్రజలను ఊచ కోత కోస్తాము” అని బెదిరించాడు. (నీకు ఇద్దరు భార్యలు & ఆరుగురు పిల్లలు మాత్రమే ఉన్నారు.. కానీ మీ నిజాం కు పదుల సంఖ్య లో భార్యలు వందల సంఖ్య లో పిల్లలు ఉన్నారు.. వారందరూ భద్రంగా ఉండాలి అని మా కోరిక.. అని రివర్స్ పంచ్ తో పటేల్, ఖాసీం ని హెచ్చరించాడు)
1948 సెప్టెంబర్ 13 వరకూ రజాకార్ల దుర్మార్గాన్ని హైదరాబాద్ సంస్థానం భరించక తప్పలేదు..భారత ప్రభుత్వానికి సహకరిస్తే.. నిట్టనిలువునా ప్రాణాలు తీస్తామని రజాకార్లు హైదరాబాద్ సంస్థానంలో ఉన్నప్రజల్ని బెదిరించారు. దాదాపుగా 32000 మంది స్థానికులు సికింద్రాబాద్ లోని మిలటరీ కంటోన్మెంట్ లో ప్రాణభయంతో తలదాచుకున్నారు..

ఆఖరి నిజాం.. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానాన్ని భారత ప్రభుత్వానికి స్వాధీనంచేసిన తర్వాత.. రజాకార్ల సైన్యంలో చాలామంది పాకిస్తాన్ కి పారిపోయారు.. ఇక్కడే మిగిలిపోయినవాళ్లు మాత్రం గెడ్డాలు తీసేసి.. మామూలు పౌరుల్లో కలిసిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు.. దొరికిన రజాకార్లను భారత సైన్యం చంపి వేసింది.
చివరి నిముషంలో ఖాసిం రజ్వీ విషయాన్ని అర్ధం చేసుకున్నాడు..
ఇక్కడే ఉంటే.. నిట్టనిలువునా జనం చీల్చి చంపుతారన్న విషయం తెలిసిపోయింది..
పాకిస్తాన్ కి పారిపోవాలి..అంటే.. నిజాం సరండర్ కావాలి..అప్పుడే ప్రాణాలు దక్కుతాయి..
అప్పటి ప్రధాని నెహ్రూ.. రజాకార్లు పాకిస్తాన్ కి వెళ్లిపోవడానికి అనుమతించారు..
వల్లభాయ్ పటేల్ భారత సైన్యానికి చెప్పిన మాట.. నిజాంని అరెస్ట్ చేసి, ఖాసీం రజ్వీని చంపేయమని.కానీ.. నెహ్రూ జోక్యం చేసుకుని నిజాంని ఏమీ చేయొద్దని, ఖాసిం రజ్వీని అరెస్ట్ చేయమని పటేల్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు..
1957 సెప్టెంబర్ 11న జైలునుంచి విడుదలయ్యాక ఖాసిం రజ్వీ పాకిస్తాన్ కి వెళ్లిపోయాడు..జైలునుంచి విడుదలైన తర్వాత.. సరిగ్గా హైదరాబాద్ సంస్థానానికి విమోచనం లభించిన రోజునే రజ్వీ పాకిస్తాన్ కి వెళ్లడం మరో విషయం..
పాకిస్తాన్ కి వెళ్లేముందు నిజాం కాలం నాటి MIM అనే రాజకీయ పార్టీకి జీవం పోసి దాన్ని సమర్ధుడైన నాయకుడి చేతుల్లో పెట్టి వెళ్లాలని రజ్వీ నిర్ణయించుకున్నాడు..
పార్టీ సభ్యులకు వర్తమానం పంపాడు..ఓ ముప్ఫై నలభైమంది మాత్రం సమావేశానికి హాజరయ్యారు..కానీ.. బాధ్యతల్ని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు..
పన్నెండేళ్లకు పైబడిని ఏ యువకుడికైనా పార్టీ పగ్గాలను అప్పజెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని రజ్వీ ఆ సమావేశంలో ప్రకటించాడు..అబ్దుల్ వహిద్ ఒవైసీ అనే ఓ పద్దెనిమిదేళ్ల కుర్రాడు.. ముందుకొచ్చాడు..
అప్పట్లో కనీసం అతనికి పార్టీతో కూడా సంబంధం లేదు..వహిద్ ఒవైసీ ధైర్యాన్ని చూసి అప్పటి నిజాం.. ఎంఐఎం పార్టీ అధినేతగా అతని పేరుని ప్రపోజ్ చేశాడు..ఖాసిం రజ్వీ మద్దతు తెలిపాడు.పార్టీ పగ్గాలు ఒవైసీ చేతుల్లోకి వచ్చాయి..బ్యాన్ చేసిన పార్టీ నాయకత్వాన్ని స్వీకరించిన నేరానికి అతనికి 11 నెలల జైలుశిక్ష విధించారు..
జైలు జీవితం ముగిశాక.. ఒవైసీకి కేంద్ర మంత్రి పదవిని ఇచ్చేందుకు నెహ్రూ ముందుకొచ్చారు..
కానీ.. వహిద్ ఒవైసీ అందుకు అంగీకరించలేదు..ఎంఐఎంకి నూతన ఉత్తేజాన్ని అందించేందుకు పూర్తి సమయాన్నివెచ్చించాడు..1975లో వహిద్ ఒవైసీ కొడుకు సలావుద్దీన్ ఒవైసీ.. తండ్రినుంచి పార్టీ పగ్గాల్ని తీసుకున్నాడు..ఆయన కొడకులు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీలు ప్రస్తుతం పార్టీ బాగోగులు చూస్తున్నారు.