మన లైఫ్ ఇప్పటిదాకా ఒక లెక్క..ఇప్పుడోలెక్క

కరోనా పూర్తిగా కనుమరుగైన తర్వాత కూడా ఇలాంటి వైరస్లు మరిన్ని పుట్టుకురావొచ్చు. అందుకే ఇప్పటిదాకా గడిపిన జీవితం వేరు.. ఇక నుంచి గడపాల్సిన జీవితం వేరు. పర్సనల్గానే కాదు ఫ్యామిలీ మెంబర్స్‌తో గడిపే లైఫ్ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, రిలేటివ్స్, కొలీగ్స్తో రిలేషన్ కూడా చేంజ్ చేసుకోవాలి.  వీటన్నింటితో పాటు.. మన అలవాట్లు కూడా మార్చుకోవాలి.

ఇంటి నుంచే మొదలవ్వాలి
లైఫ్స్టైల్ చేంజ్ అనేది ముందుగా ఇంటి నుంచే మొదలవ్వాలి. బయటి పరిస్థితులు ఎలా ఉన్నా… ఇంట్లో ఉండాల్సి వస్తే, ఆ ఇల్లు ఆరోగ్యాన్నిచ్చేదిలా ఉండాలి. అంటే.. అవసరమైనప్పుడే ఇంట్లోకి గాలి, వెలుతురు వచ్చేలా మార్పులు చేసుకోవాలి. ఎప్పుడూ మెడికల్ షాపులోని మందులపైనే ఆధారపడకుండా ఆయుర్వేదంలో ఉపయోగించే ఔషధ మొక్కలను ఇంట్లో పెంచాలి. ఇల్లు ఎప్పుడూ పొడిగా ఉండాలి. వాటర్ లీకేజీ లేకుండా రిపేర్ చేయించుకోవాలి. అలాగే స్థలం ఉంటే బాత్రూమ్, వాష్రూమ్ వంటివి ఆరుబయట ఏర్పాటుచేసుకోవాలి. బ్రష్ చేసుకునే సింక్ వంటివి కూడా ఇంట్లో కాకుండా బయటే ఉంటే బెటర్. ఇంట్లోని ఫ్లోర్ను ఈజీగా క్లీన్ చేసుకునేలా స్పేస్ ఫ్రీగా ఉంచుకోవాలి. అవసరంలేని వస్తువులన్నింటిని అటకెక్కించాలి.

కిరాణా లిస్ట్ మారాలి 
ఇప్పటిదాకా కిరాణా లిస్ట్ కేవలం వంటింటి సరుకులు, సబ్బులు, సర్ఫ్లకే పరిమితమయ్యేది. ఇకపై ఆ లిస్ట్లో హ్యాండ్వాష్, శానిటైజర్ వంటివి కూడా చేర్చాలి. ఇప్పుడు కరోనా కలకలం ఉంది కదా అని మాత్రమే చేతులు కడుక్కుంటే సరిపోదు. ఇకపై కూడా చేతులు శుభ్రంగా ఉంచుకోవడం అలవాటుగా మార్చుకోవాలి.అందుకే ఇంట్లో ఎప్పుడూ హ్యాండ్వాష్, బ్యాగ్లో ఎప్పుడూ శానిటైజర్ ఉంచుకోవాలి.

 ఫుడ్ హ్యాబిట్స్ మారాలి
కాలంతో సంబంధం లేకుండా వేడి వేడివి  మాత్రమే తినాలి. ఫ్రిజ్లో పెట్టి తినే అలవాటు మార్చుకోవాలి. కేవలం రుచికోసమే కాకుండా ఆరోగ్యం గురించి కూడా ఆలోచించి అన్నిరకాల ఆహారపదార్థాలు తినడం అలవాటు చేసుకోవాలి. జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ వంటివాటికి వీలైనంత దూరంగా ఉండాలి.  తాజా కూరగాయలు, పండ్లు, మొలకెత్తిన గింజలు, డ్రైఫ్రూట్స్ వంటివి రెగ్యులర్గా తినాలి. నిజానికి జంక్ఫుడ్తో పోలిస్తే వీటికి అయ్యే ఖర్చు చాలా తక్కువే. ఫ్రిజ్లో నీళ్లు తాగడం మానేసి వేడి నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. అంతగా చల్లటి నీళ్లు తాగాలనుకుంటే కుండలో నీళ్లు తాగాలి.

 వర్కవుట్స్ కంపల్సరీ
శరీరానికి తగినంత ఇమ్యూనిటీ ఉంటే వైరస్లు, బ్యాక్టీరియాల వల్ల వచ్చే వ్యాధులన్నింటినీ దాదాపు తరిమికొట్టొచ్చు. అదే లేకపోతే మనం ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా లాభం ఉండదు. మరి ఈ ఇమ్యూనిటీ కోసం మంచి ఫుడ్ మాత్రమే తీసుకుంటే సరిపోదు. శరీరంలోని ప్రతి వ్యవస్థ బలంగా మారేలా వర్కవుట్స్ కూడా చేయాలి. ఇప్పటిదాకా అలవాటు లేకపోయినాసరే.. ఇక నుంచి వర్కవుట్స్ హాబీగా మారాలి. యోగ, ధ్యానం, ప్రాణాయామం వంటివి కూడా ప్రాక్టీస్ చేయాలి. వీటిని ఏదో ఒక మతానికి సంబంధించినవిగా చూడొద్దు.

పర్సనల్  హైజీన్ 
వ్యక్తిగత పరిశుభ్రత అనేది ఎప్పుడూ అవసరమే. బిజీ షెడ్యూల్ ఉందని స్నానం చెయ్యకుండా ఉండొద్దు. తరచూ కాళ్లు, చేతులు కడుక్కోవడం అనేది ఎప్పుడూ కంటిన్యూ చేయాలి. ఇంట్లోకి అడుగుపెట్టకముందే కాళ్లు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. అంతేగానీ.. అలసిపోయి వచ్చామంటూ సోఫాలో అలాగే సాగిలపడొద్దు. వీలైతే ఆఫీస్ నుంచి వచ్చాక కూడా వేడివేడి నీళ్లతో స్నానం చేయాలి. అంతేకాకుండా తరచూ చేతులతో ముఖాన్ని, శరీర భాగాలను తాకే అలవాటు కూడా మార్చుకోవాలి.

శుభ్రత
ఇంటిని, పరిసరాలను మాత్రమే శుభ్రం  చేసుకుంటే సరిపోదు. వైరస్లు, బ్యాక్టీరియాలబారిన పడకుండా ఉండాలంటే ఇంటితోపాటు ఇంట్లో ఉండే వస్తువులను, పర్సనల్గా మనం వాడే వస్తువులను కూడా క్లీన్ చేసుకోవాలి. ల్యాప్టాప్, ఫోన్, వ్యాలెట్, హ్యాండ్ బ్యాగ్, కంప్యూటర్, కీబోర్డ్, టీవీ రిమోట్, రిస్ట్ వాచ్, బుక్స్ వంటివి క్లీన్ చేయడం గురించి ఆలోచించం. కానీ వీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి.ఎందుకంటే నిజానికి వీటివల్లే  వైరస్ స్ప్రెడ్ అవుతుంది.

పిల్లలు, పెద్దల పట్ల..
పిల్లలు, పెద్దల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా అస్సలు ఉండొద్దు. ‘జ్వరమేకదా.. జలుబే కదా.. దగ్గు కామనే’.. అంటూ నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎప్పుడూ ఇలాగే వస్తుంది కదా, అదే తగ్గిపోతుందిలే అనే వైఖరి ఇకపై మారాలి.  అలాగని మెడికల్ షాపు నుంచి ఏదిపడితే అది తెచ్చి వేయొద్దు. పిల్లలను శుభ్రంగా ఉంచడంతోపాటు వాళ్లకు బలమైనవి తినిపించాలి. ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిన వెంటనే డాక్టర్ను కలవాలి. ఎక్కువయ్యేదాకా ఆగడం మంచిదికాదు. పెద్దోళ్ల విషయంలో కూడా ఇలాగే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు, వృద్ధుల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి.

అవుట్డోర్ మీటింగ్స్.. 
టైంపాస్ కాకపోతే అలా బయటకి వెళ్లొస్తామంటూ వెళ్లిపోతారు. సెలవు దొరికితే షికార్లకు ప్లాన్చేస్తారు. కొన్నిసార్లు నేరుగా కలవాల్సిన అవసరం లేకపోయినా వెళ్లి కలిసి వస్తారు. బ్యాంకులు, బిల్లుల చెల్లింపు వంటివాటి కోసం గంటల తరబడి లైన్లలో నిలబడతారు. నిజానికి ఇవన్నీ ఇంటి నుంచే చేసుకోవచ్చు. అందుకే ఇకపై అవుట్డోర్ మీటింగ్స్ను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. వీలైనంత వరకు ఫోన్, ఆన్లైన్ చాటింగ్ ద్వారానే పూర్తయ్యేలా చేసుకోవాలి. తప్పనిసరి అయితే తప్ప బయటికి వెళ్లొద్దు.

సెల్ఫ్ డిసిప్లిన్..
సెల్ఫ్ డిసిప్లిన్ తప్పనిసరి. అది ఇంట్లో ఉన్నా సరే.. బయటకెళ్లినా సరే. ఎక్కడైనా ‘క్యూ’లో నిలబడాల్సి వస్తే మనిషికి, మనిషికి మధ్య స్పేస్ ఉండేలా నిలబడాలి. విదేశాల్లో ఈ కల్చర్ ఉన్నా.. మనదేశంలో మాత్రం మీదపడి తోసుకోవడమే. అంతేకాదు.. తుమ్మినా, దగ్గినా దస్తీ అడ్డంగా పెట్టుకోవాలి. మాట్లాడేటప్పుడు కూడా దూరంగా ఉండి మాట్లాడాలి. తుంపర్లు పడేలా మరీ దగ్గరగా ఉండొద్దు.
సామెత లో మార్పు… గుంపులో గోవిందా కాదు.గుంపైతే గోవిందా!

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner
Bitnami