ఏ రోజు ఏ అభరణాలు ధరిస్తే శుభం..?

మహిళలు నిత్యం అభరణాలు ధరిస్తారు. సందర్భాన్ని బట్టి అవి మారుతూ ఉంటాయి. అయితే గ్రహాలను అనుసరించి ఆభరణాలు ధరించాల్సి ఉంటుంది. ఏ రోజు ఏ రకమైన నగలు ధరిస్తే మంచిదో తెలుసుకోవడం ముఖ్యం.
వారంలో రోజుకో గ్రహాధిపతి ఉంటాడు. ఆదివారానికి సూర్యుడు అధిపతి అయితే, శుక్రవారానికి శుక్రుడు అన్నట్టు.. ఆయా వారాలన్ని బట్టి ఆ రోజుకి ఉండే గ్రహాదిపతిని అనుసరించి ఏ నగలు ధరించాలో తెలుసుకోవాలి. నిత్యం నవగ్రహాలను అనుసరించి ఆభరణాలు ధరించడం ద్వారా శుభఫలితాలుంటాయి.
అయితే బంగారంతో పొదిగించిన ఆభరణాలు లేకపోయినా.. తమ తమ స్థోమతకు తగినట్లు ఇప్పుడు దుకాణాల్లో అమ్మబడే ఆభరణాలతో ప్రతిరోజూ అలంకరణ చేసుకోవడం మంచిది.
ఇక ఏ వారంలో ఎలాంటి ఆభరణాలు ధరించాలో తెలుసుకుందాం.
ఆదివారం (సూర్యగ్రహానికి ప్రీతికరమైన రోజు) కెంపులతో చేసిన నగలు.. చెవిపోగులు, హారాలు మొదలగునవి ధరించడం శుభప్రదం. దీనిద్వారా నేత్ర సంబంధిత వ్యాధులు, శరీర తేజస్సు, ప్రకాశవంతం పొందవచ్చును.
సోమవారం (చంద్రగ్రహానికి ప్రీతికరమైన రోజు) ముత్యాలతో తయారు చేసిన ఆభరణాలు.. హారాలు, గాజులను వేసుకోవడం మంచిది. ముత్యాలతో తయారయ్యే గాజులను, చెవిపోగులను వాడటం ద్వారా మనశ్శాంతి, అనుకున్న కార్యములో విజయం చేకూరుతుంది.
మంగళవారం (కుజ గ్రహానికి ప్రీతికరమైన రోజు) పగడాలతో చేసిన ఆభరణాలు.. దండలు, ఉంగరాలను వాడటం మంచిది. పగడాలతో తయారైన ఉంగరాలను, దండలను వాడటం ద్వారా కుటుంబ సంక్షేమం చేకూరటం, ఈతిబాధలు తొలగిపోవడం వంటి ఫలితాలుంటాయి.
బుధవారం (బుధ హానికి ప్రీతికరమైన రోజు) పచ్చల పతకాలు, గాజులు మొదలగునవి వాడటం మంచిది. విద్యాకారకుడైన బుధునికి ప్రీతికరమైన ఈ రోజున విద్యార్థులు పచ్చని రంగుతో కూడిన ఉంగరాలు, స్త్రీలతే హారాలు వినియోగించడం మంచిది. దీంతో బుద్ధికుశలతలు పెరగడం, ధనలాభం, కార్యసిద్ధి చేకూరుతుంది.
గురువారం బృహస్పతి (గురుభగవానుడు) కోసం పుష్యరాగముతో తయారైన చెవిపోగులు, ఉంగరాలు వంటి ఆభరణాలు ధరించడం మంచిది. దీంతో గురుగ్రహ ప్రభావంతో అవివాహితులకు కళ్యాణం జరగడం, వ్యాపారాభివృద్ధి, కార్యసిద్ధివంటి ఫలితాలుంటాయి.
శుక్రవారం శుక్రుని (శుక్రగ్రహం) కోసం వజ్రాల హారాలు, ముక్కుపుడక వాడటం ద్వారా స్త్రీలకు సౌభాగ్యం, ఆర్థిక సమస్యలు తొలగిపోవడం, పదోన్నతులు, అనుకున్న కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి. లక్ష్మిదేవి అనుగ్రహం కూడా పొందినవారవుతారు.
శనివారం (శనిగ్రహం) శనికోసం నీలమణి, మణిహారాలు వంటి ఆభరణాలు ధరించడం మంచిది. దీనిద్వారా శనిగ్రహ ప్రభావంతో తలెత్తే సమస్యలు కొంతవరకు సమసిపోతాయి. నీలమణితో తయారైన హారాలు చెవిపోగులు, ఉంగరాలు ధరించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

  చింతా గోపీ శర్మ సిద్ధాంతి
లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం (భువనేశ్వరిపీఠం)
పెద్దాపురం, సెల్:- 9866193557

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
Close Bitnami banner
Bitnami