హిందువులు మైనారిటీలు అవుతున్న ప్రతి చోట ఏం జరుగుతుందో తెలుసా?

786

సనాతన వైదిక ధర్మానికి కొలువైన దేశం భారతం. ఈ భూభాగాన్ని హిందుస్థాన్ అనే వాళ్ళు అంటే మనదేశంలో హిందువుల స్థానం ఎటువంటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కాని ఇప్పుడు తురుష్కులు, బ్రిటిషర్లు, డచ్, పోర్చుగీసువారు పాలనా ప్రభావంతో కొన్ని మతాలు ఈ దేశంలో ఆశ్రయం పొందాయి. ప్రపంచంలో ఎక్కడాలేని శాంతి, సుఖాలను ఈ నేలపై వారు పొందుతున్నారు. కానీ విదేశీ శక్తుల కుయుక్తుల వలన హిందువుల సంఖ్య రోజు రోజుకీ తగ్గుముఖం పడుతుంది. పాకిస్తాన్ వంటి మత ప్రభావ దేశాలలో హిందువులకు కష్టాలు వున్నాయి అంటే అది పెద్ద విషయం కాదు. అక్కడ వారి హక్కులను కాలరాయడం పరిపాటి. కానీ మన దేశంలో కూడా హిందువులకు గడ్డుకాలం ఎదురవుతోంది. ముఖ్యంగా వారి సంఖ్య తక్కువగా ఉన్న చోట అంటే వారు మైనారిటీలుగా పరిగణించబడుతున్న చోట అణచివేత కనిపిస్తున్నాయి. హిందువులు తక్కువగా వున్న రాష్ట్రాలలో మిజోరాం, పశ్చిమ బెంగాల్ వంటి చోట్ల నిత్యం దాడులు జరుగుతూనే వుంటాయన్నది తరచుగా వినిపిస్తున్న వార్త.

ఇక మన పక్కరాష్ట్రాలలో ఒకటైన కేరళలో కూడా ఇదే పరిస్థితిని చూస్తే హిందువులు మైనారిటీలుగా మారుతున్న ప్రతి చోట వారి హక్కులు, సాంప్రదాయిలు కాలరాస్తున్న చర్యలే కన్పిస్తున్నాయి. శబరిమలై విషయంలో గత కొద్ది నెలలుగా తలెత్తున్న వివాదం ఇప్పుడు ఉదృత పోరాట దిశగా నడుస్తోంది. అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వమే స్వయంగా మా ఆత్మాభిమానం దెబ్బతీసేందుకు బాహాటంగా సిద్ధమవుతుండడం చాలా విచారకరమని భావిస్తున్నారు ఇక్కడి హిందువులు. అయితే ఈ ఉదంతాలను గమనిస్తుంటే హిందువులు జాగృతమవ్వాల్సిన అవసరం వుందని పెద్దలు చెబుతున్నారు.
-vskandhra