ఆంధ్రమాత మెడలో ‘సాగర్ మాల’…!!

151

ప్రజలకు మేలు చేయాలనే తపన ఉండాలి కానీ ఆలోచనలు వాటంతట అవే పుట్టుకొస్తాయి. ఆ ఆలోచనలు కొత్త పథకాలకు ప్రాణం పోస్తాయి. తన సుదీర్ఘ పాదయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి రైతుల సమస్యలే కాదు, అనేక వర్గాల కష్టాలు చూశారు, నష్టాలు విన్నారు.  ప్రతి ఒక్కరికీ భరోసాగా ఉంటానని వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్రలో హామీ ఇచ్చారు.

పాదయాత్రలో ఇచ్చిన హామీలను మరిచిపోకుండా ఒక్కోక్కొటి అమలు చేస్తూ వెళ్తున్నారు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. పాదయాత్రలో  వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిని ఎక్కువ ఆలొచింప చేసింది మత్స్యకారుల కష్టాలు. ఆంధ్రప్రదేశ్‌కు 972 కి.మీ సుదీర్ఘ తీర రేఖ ఉంది. గుజరాత్ తరువాత ఎక్కువుగా తీర రేఖ కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. గుజరాత్‌కు 1600 కి.మీ తీర రేఖ ఉంది. గుజరాత్ తరువాత అతి పెద్ద తీర రేఖ కలిగిన ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా ఎగుమతుల్లో మాత్రం వెనుకబడి ఉంది. కారణం..తీర రేఖ ఉన్నా దానిని సద్వినియోగం చేసుకోకపోవడం. మత్స్యకారులకు ఉపాధి కల్పించక పోవడం. మత్స్యకారులను ఓటు బ్యాంక్‌ రాజకీయాల్లో భాగం చేయడం. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్రలో అనేక మంది మత్స్యకారులు ఆయనను కలిసి వినతి పత్రాలు ఇచ్చారు.

తమకు న్యాయం చేయమని అర్ధించారు. ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు వలస పోవాల్సి వస్తుందని వాపోయారు. తమ కుటుంబాలను వదిలి నెలల పాటు వేటకు వెళ్లే సమయంలో కలిగే ఆవేదనను వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డికి చెప్పుకున్నారు. మత్స్యకారుల ఆవేదన వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ఆలోచనలను సుడులు తిరిగేలా చేసింది. మత్స్యకారులకు న్యాయం చేయాలని పాదయాత్ర సమయంలోనే ఓ నిశ్చితాభిప్రాయానికి వచ్చారు వైఎస్‌ జగన్‌. పాదయత్రలో, ఎన్నికల ప్రచారంలో మత్స్యకారులపై వరాల జల్లులు కురిపించారు. వేట బోట్లకు డీజిల్‌పై సబ్సిడీ, వేట విరామ సమయంలో ఆర్ధికంగా ఆదుకోవడం, పక్క రాష్ట్రాలకు వలస పోకుండా ఫిషింగ్ హార్బర్లు నిర్మించడం హామీలు మత్స్యకారులకు ఇచ్చారు జగన్‌.

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం జిల్లాలు 13. ఈ 13 జిల్లాల్లో 9 జిల్లాలు కోస్తా ప్రాంతంలోనే ఉన్నాయి.  9 జిల్లాల్లో తీర రేఖ 972 కి. మీ పొడవుంది. కోస్తా తీరంలోని  ప్రతి పల్లెల్లో లక్షలాది మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు.  వారి జీవనం సముద్రం మీదనే ఆధార పడి ఉంటుంది వారి కుటుంబాలు గడవాలంటే గంగమ్మ తల్లి కరుణించాల్సిందే. సముద్రమే వారి జీవితం. సముద్రంలో వేటకు పోకపోతే వారి డొక్కాడదు. మత్స్యకారుల కష్టాలు, ఏపీకి ప్రకృతి ప్రసాదించిన తీర రేఖ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆలొచనలకు చిగురులు తొడిగాయి.

ఆంధ్ర ప్రదేశ్‌కు సీ పోర్టులే కాదు, ఫిషింగ్ హార్బర్లు కూడా ఉండాలని  సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఫిషింగ్ హార్బర్లతో మత్స్యకారుల కష్టాలు తీరడమే కాదు,ఏపీకి  వ్యాపార ప్రయోజనాలు కూడా ముడిపడి ఉన్నాయి. ఫిషింగ్ హార్బర్లతో మత్స్యకారులకు ఉపాధి తోపాటు, రాష్ట్ర ఖజానాకు కూడా మంచి ఆదాయం  వస్తుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మందికి ఉపాధి లభిస్తుంది. అందుకే ..మొదటి విడతగా 4 జిల్లాల్లో ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయించుకుని ముందుకు కదిలారు. తొలి దశలో రూ.1510 కోట్లతో నాలుగు ఫిషింగ్ మార్బర్ల నిర్మాణం చేపట్టనున్నారు.


అంతేకాదు..తొలి దశలో 25  ఆక్వా హబ్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.  ప్రపంచ మత్స్యకార దినోత్సవం నాడు ఈ  కార్యక్రమం చేపట్టడం మత్స్యకారులకు  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన గౌరవం.  తొలి దశలో 4, రెండో దశలో మరో 4 ఫిషింగ్ హార్బర్లను నిర్మించాలని ఏపీ ప్రభుత్వం కృత నిశ్చియతంతో ఉంది. ఫిషింగ్ హార్బర్లను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశించారు.  మొదటి దశలో భాగంటా  నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంల్లో ఫిషింగ్ హార్బర్లు నిర్మించనున్నారు.

వచ్చే రెండేళ్లలో ఈ ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం పూర్తి కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  కృత నిశ్చియతంతో ఉన్నారు. ఇప్పటికే టెండర్లను ఆహ్వానించారు. డిసెంబర్‌ రెండో వారంలో టెండర్లు ఖరారు అయ్యే అవకాశముంది. టెండర్లు ఖరారు కావడంతోనే పనులు ప్రారంభించనున్నారు. ఇక రెండో దశలో భాగంగా శ్రీకాకుళం  జిల్లా బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లా కొత్తపట్నంల్లో ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేయనున్నారు.

మొత్తం రూ.3వేల కోట్లు ఫిషింగ్‌ హర్బర్ల మీద ఖర్చు చేయాలని వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక..ఫిషింగ్ హార్బర్లతోపాటు ప్రతి నియోజకవర్గంలో ఆక్వా హబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. తొలి దశలో ఆక్వా హబ్‌లకు ఏపీ  ప్రభుత్వం రూ.225 కోట్లు కేటాయించింది. ఆక్వా హబ్‌లు తాజా చేపలు, డ్రై చేపలు, ప్రాసెస్‌ చేసిన చేపలు, రొయ్యలు, పీతలు మిగతా సీ ఫుడ్ బిజినెస్‌ చూడనున్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తాయి.  మత్స్యకారులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ఆక్వా హబ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. వీటికి జనతా బజార్లను అనుసంధానం చేయడం ఏపీ ప్రభుత్వం ముందు చూపుకు నిదర్శనం.

ఫిషింగ్ హర్బర్లు నిర్మాణం ఏపీ  తీర రేఖ జాతాకాన్నే మార్చేయనున్నాయి. కోస్తాలో ఒక్క విజయనగరం  జిల్లాలో మినహా మిగతా  8  జిల్లాల్లో ఫిషింగ్ హార్బర్లు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీని వలన మత్స్యకారుల వలసలు  తగ్గుతాయి.  వారి బతుకులకు భరోసా ఏర్పడుతుంది. వారి కుటుంబాలకు దగ్గరగా ఉండటం వలన ఆనందంగా ఉంటారు. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో బోటు పరిశ్రమ వృద్ది చెందుతుంది. కోస్తా తీరం అభివృద్ధిలో పరుగు పెడుతుంది.

 ఒక రకంగా నీలి విప్లవానికి వైఎస్‌ జగన్‌మోహణ్ రెడ్డి శంకుస్థాపన చేశారని చెప్పాలి. ఫిషింగ్ హార్బర్లను, ఆక్వా హాబ్‌లకు అనుసంధానించడం వలన మార్కెట్‌ కోసం మత్స్యకారులు ఇబ్బంది పడాల్సిన పని లేకుండా పోతుంది. గిట్టుబాటు ధర వచ్చి మత్స్యకారులకు ఆర్ధిక కష్టాలు తీరుతాయి. అంతేకాదు…ఏపీ కోస్తా తీరం తూర్పు ఆసియా దేశాలకు ముఖ ద్వారం లాంటిది. ఇక్కడ నుంచి తూర్పు దేశాలకు సీ ఫుడ్స్‌ భారీగా ఎగుమతి చేసి విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించవచ్చు. దీని వలన అనేక మందికి వ్యాపార ప్రయోజనాలు చేకూరుతాయి. తూర్పు దేశాలకే కాదు మథ్య ఆసియా,ఆఫ్రికా, ఐరోపా దేశాలకు కూడా సీ ఫుడ్స్‌ ఎగుమతి చేసుకునే అవకాశముంది. దీని వలన ఏపీలో భారీ ఉద్యోగ అవకాశాలు ఏర్పడటమే కాకుండా, పెద్ద స్థాయిలో ఆర్ధిక వెసలుబాటు ఏర్పడుతుంది.

సీ ఫోర్ట్‌లు, ఫిషింగ్ హార్బర్లను రోడ్లు, రైల్వేలు ద్వారా అనుసంధానించాలి. తీరంలోనే సీ ఫుడ్స్‌ కోసం భారీ గొడాంలు నిర్మించాలి. రోడ్లు అనుసంధానం ద్వారా సీ పుడ్స్‌ను మార్కెట్‌కు తరలించే వేగం పెరిగి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. అంతేకాదు.. కోస్తా తీరంలో ఆధునిక మార్కెట్ల నిర్మాణం చేపట్టి తూర్పు దేశాలతో భారీగా ఆర్ధిక లావాదేవీలు ఏర్పాటు చేసుకోవచ్చు.   ఆసియా దేశాలతో సముద్రపు ఆర్ధిక రోడ్డును ఏర్పాటు చేసుకుని ఆసియా దేశాలతో భారీ ఎత్తున వ్యాపారం చేసుకుని విదేశీ మారకద్రవ్యం ఆర్జించవచ్చు.

ఏపీకి ఇప్పుడు సమర్ధవంతమైన నాయకత్వం ఉంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి దూరదృష్టి కలిగిన పాలకుడు. ఆయన పాలనలో ఏపీకి మహర్ధశ పట్టనుంది అని చెప్పడానికి భారీ ఎత్తున ఫిషింగ్ హార్బర్ల నిర్మాణమే నిదర్శనం. పిషింగ్ హార్బర్లు, ఆక్వా హబ్‌లతోపాటు సీ ఫుడ్ పరిశోధన కేంద్రాలను కూడా ఆంధ్రా యూనివర్శిటీ, నాగార్జున యూనివర్శిటీల్లో ఏర్పాటు చేయాలి. సీ ఫుడ్ పై ప్రత్యేక కోర్సులు ప్రవేశ పెట్టి దీర్ఘ కాలంలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి.

సీ ఫోర్టులనే కాకుండా భారీ ఎత్తున ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేపడుతుంటే చంద్రబాబు ఆయన మద్దతు మీడియా గగ్గోలు పెడుతుంది.  పాలనలో ఏమాత్రం అనుభవంలేని  వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతున్నారు. ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు, 14 ఏళ్లు సీఎంగా ఉన్న నారావారు ఎందుకు ఫిషింగ్ హార్బర్లు నిర్మించలేకపోయారు. ఇప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి మత్స్యకారులను ఆర్ధికంగా బలోపేతం చేయడానికి నిర్ణయాలు తీసుకుంటుంటే  ఈ ఏడుపుగొట్టు రాజకీయాలు ఎందుకు?. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఆంధ్ర లోగిళ్లలో ఆనంద పుష్నాలు పూసేలా చేస్తున్నాయి.వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆలొచనలు భవిష్యత్తులో ఏపీని ఆర్ధికంగా బలోపేతం చేసేలా కదులుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవడం – దాచుకోవడమే లక్ష్యంగా పాలన చేసిన బాబు ఇప్పుడు వైఎస్‌ జగన్‌ పాలన చూసి నిద్ర పోకుండా ఏడుస్తున్నాడు.

ఇప్పటికైనా చంద్రబాబు కుల నాయకుడిగా కాకుండా ప్రజా నాయకుడిగా ఆలొచించాలి.   వయసులో చిన్నవాడైనా  ప్రజల కోసం కష్టపడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలి. పాలనలో లోపాలు ఉంటే పెద్ద మనిషిగా సహేతుకంగా ఎత్తి చూపాలి. అంతేకాని..వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి  ప్రవేశ పెట్టే పథకాల మీద బురద జల్లితే ప్రజలు బాబు భవిష్యత్తు మీద బురద జల్లుతారు.  మత్స్యకారుల మీద వైఎస్‌ జగన్‌కు మొదటి నుంచి ఎంతో  ప్రేమ. దేశంలోనే ఒక మత్స్యకారుడ్ని (మోపిదేవి వెంకటరమణ)ను రాజ్యసభకు పంపిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డికే దక్కుతుంది. మోపిదేవి వెంకటరమణ వైఎస్ఆర్‌ సీపీ నుంచి రాజ్యసభకు ఎంపిక అయినప్పటికీ ఆయన పెద్దల సభలో దేశంలోని మత్స్యకారులందరికీ ప్రతినిధి. ఈ ఘనత కచ్చితంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డికే దక్కుతుంది.

– వెంకటేశ్వర్ (వై.వి.రెడ్డి),
పొలిటికల్ అనలిస్ట్