సంక్షేమ పథకాలు అందించే మనసున్న కేసీఆర్

309
సికింద్రాబాద్:అన్ని వర్గాల ప్రజలకు సమానమైన సంక్షేమ పథకాలు అందించే మనసున్న ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ అన్నారు..  తెరాస పార్టీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా సికింద్రాబాద్ లోని ఆర్పీ రోడ్ లో బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు.. ఈ సందర్బంగా మీడియా తో మాట్లాడుతూ ఈ మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు  భరోసా ఇచ్చే విధంగా ఉన్నదని తలసాని సాయి కిరణ్ అన్నారు.. పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడ్తున్నదని హైదరాబాద్ మహా నగరంలో అన్ని వర్గాల అన్ని మతాల ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారని  కొన్ని పార్టీలు మతాల మధ్య చిచ్చు పెట్టె ప్రయత్నం చేస్తున్నాయని, ఈ ghmc ఎలెక్షన్లలో ప్రజలు ప్రతిపక్షాలకు గుణపాఠం చెప్పాలని తలసాని సాయి కిరణ్ యాదవ్ అన్నారు..రాంగోపాల్ పెట్ డివిజన్  ప్రజలు తెరాస అభ్యర్థిని అత్యధిక మెజారిటీ తో  గెలిపించాలని తలసాని సాయి పిలుపునిచ్చారు..