హిందువుల పండగలే ప్రమాదకరమా?

182

ప్రతీ హిందూ పండగను, ఉత్సవాన్ని వెక్కిరించడం, ఆ పండుగ వల్ల అనర్ధాలు ఏమిటో ఏకరవు పెట్టడం, పుంఖాను పుంఖాలుగా దేశ, విదేశీ పత్రికల్లో వ్యాసాలు రాయడం, సోషల్ మీడియాలో సెలబ్రెటీలు ఈ విషయాలపై ట్వీట్స్ పోస్ట్స్ పెట్టడం,  కుదిరితే  విదేశీ నిధులు దిగమింగుతున్న NGO లను అడ్డం పెట్టుకొని కోర్టుల్లో , నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు కేసులు వెయ్యడం గత కొద్ది సంవత్సరాలుగా ఒక పద్ధతి ప్రకారం దేశంలో జరుగుతూ వస్తోంది.
ఒక్క సారి నిదానంగా ఆలోచించి చూడండి.. ఈ పండుగలు, ఆటలు, ఉత్సవాలపై దాడులు ఒక సం. కంటే మరో సం. ఏ విధంగా  పెరుగుతూ వస్తున్నాయో?
1. దీపావళి – వాయు కాలుష్యం, హానికర రసాయనాలు అరోగ్యకారకాలు
2. వినాయకచవితి – నీటి కాలుష్యం, ప్రకృతి ధ్వంసం(పత్రి మొ..)
3. హొలీ – ప్రమాదకరమైన రసాయన రంగులు వాడకం, నీటి వృధా(సెమెన్ బెలూన్స్ లో పెట్టి అడవారిపై విసురుతారు, మగవారు అసభ్యంగా ప్రవర్తిస్తారు)
4. సంక్రాంతి – కోడి పందాలు, జల్లి కట్టు, పశువుల, ఎడ్ల బళ్ల పోటీలు –  ప్రమాదకరం, జీవహింస
5. రక్షా బంధన్, భగిని పండుగ – రేప్ ల దేశంలో సోదరీమణులకు ప్రేమ,గౌరవం చూపించడమా?
6.  కార్వా చౌత్ – భర్త, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం స్త్రీలు చేసే ఉపవాసం – ఆడవారిని మగవారు అణగదొక్కే పండుగ
7. దసరా – ఆర్యులు ద్రావిడుల పై దాడి చేసినందుకు మూలవాసి  రావణాసురుడు ని చంపినందుకు అగ్రవర్ణాల వారు లేదా ఆర్యులు చేసుకుంటున్న పండుగ..
8. జన్మాష్టమి (దహి హాండి) – ఎత్తులో ఉన్న ఉట్టి కొట్టడం ప్రమాదకరమైన ఆట.
9. శివ రాత్రి – పాలాభిషేకాలు దండగ.
ఇలా వారు దాడి చెయ్యని హిందూ పండుగ ఒక్కటీ లేదు.
అసలు ఎందుకు జరుగుతోంది?
వీటి వెనకాల ఎవరు ఉన్నారు?
వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటి?

నిజంగా పర్యావరణం, ప్రజల ఆరోగ్యాలు ముఖ్యం అనుకుంటే మిగతా మతాల వారి పండుగల సమయంలో చెట్లు కొట్టనివ్వకుండా, బాణా సంచా కాల్చనివ్వకుండా, జంతు హింస జరగకుండా కూడా గొడవ చెయ్యాలి. అలాగే ధూమపానం, హుక్కాలు, మద్యపానంపై నిషేధం మొ.వాటి మీద అన్ని రోజుల్లో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నించాలి.. కానీ అవేమీ చెయ్యరు. ఒక వేళ ప్రభుత్వం ఇటువంటి వాటిని అరికట్టడానికి ఏమైనా చర్యలు తీసుకుంటే ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛపై హద్దులు విధించి హక్కులు కాలరాస్తున్నారు అని మళ్ళీ వీళ్ళే వ్యాసాలు రాస్తారు. కానీ హిందువుల పండుగలు, ఉత్సవాలు దగ్గరకు వచ్చేసరికి ఈ హక్కులు, మత స్వేచ్చ గుర్తుకు రావు.

ఈ దేశంలో పండగలు, సాంస్కృతిక ఆటలు, పాటలు, ఉత్సవాలు, వేషధారణ, అలంకరణ  ఇక్కడ అన్నీ దేవుడితో ముడిపడి ఉంటున్నాయి. ఇక్కడ సుమారు ప్రతీ నెలా ఎదో ఆధ్యాత్మిక సంరంభం తో ముడిపడి ఉన్నదే.ఇక్కడ సంస్కృతి లో దేవునితో ముడిపడని దైనిక కార్యక్రమం బహుశా ఉండదు అంటే అతిశయోక్తి కాదు.
ఈ ఉత్సవాలు, పండుగల కాలంలో ఎక్కువగా లాభపడే వర్గాలు ఆర్ధికంగా బలహీనంగా ఉన్నవారే.. ఏ పండుగ రోజు చూసినా ప్రతీ ఊర్లో కొన్ని వందల మంది అల్పాదాయా వర్గాల వారు (వారి మతం తో సంబంధం లేకుండా) జీవనభృతి పొందుతారు.. వారు ఇలా పండుగలు, ఉత్సవాల రోజులు వస్తున్నాయి అని వేల కళ్ళతో ఎదురుచూస్తూ వుంటారు.

మరి ఈ హిందూ పండగులను, ఉత్సవాలను తగ్గించాలి లేదా పూర్తిగా ఆపాలి అనే దుర్బుద్ధి ఎందుకు? వీటి వెనక ఏ ఎజెండా లేకుండానే ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేస్తున్నారా?
దీని వెనుక రెండు కారణాలు ఉన్నాయి.
1. మత, సాంస్కృతిక పరమైనవి
2  ఆర్ధిక కారణాలు.

1. మతపరమైనవి –  ఎడారుల్లో పుట్టిన విదేశీ మతాలు ఈ దేశంలో వేళ్లూనుకోవడానికి అన్ని శక్తులు ఉపయోగిస్తున్నా అనుకున్నంత ఫలితాలు రావడం లేదు. ప్రపంచంలో  ఈ మతాలు అడుగు పెట్టిన చాలా దేశాలలో అక్కడ ప్రాచీన మతాలను, ఆచార సంప్రదాయాలను మొ. వాటిని పూర్తిగా నిర్మూలించి తమ మత ఆధిక్యతను సాధించడానికి కొన్ని దశాబ్దాలు కాలం మాత్రమే పట్టింది.
కానీ ఈ పుణ్య భూమి లో ఇదేం మహత్యమో కానీ మొగలులు, బ్రిటిష్ వారు వెయ్యి సం.లకు పైగా పాలించినా ఇక్కడ స్థానిక ప్రాచీన ధర్మం అయిన సనాతన హిందూ ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించి తమ మత ఆధిక్యతను స్థాపించలేకపోయారు.  బహుశా వారి మతాల్లా ఒకే దేవుడు, ఒకే పుస్తకం అతి తక్కువ సంఖ్యలో పండుగలు, ఉత్సవాలు మొ. ఇక్కడ హిందూ ధర్మం లో ఉండకపోవడం ఒక ముఖ్య కారణం కావచ్చు. ఇక్కడ మతం ఆంటే పూర్తిగా ఒక జీవన విధానం. ఎదో ఒక అదివారమో, శుక్రవారమో ప్రార్ధనా మందిరానికి వెళ్లి వస్తే సరిపోదు. ఇక్కడ ప్రకృతిలో ప్రతీదీ దైవస్వరూపం లా కొలిచే విధంగా నిత్య దైనందినపు కార్యక్రమాల్లో  ప్రతీదానిలో దైవాంశ చొప్పించారు. అందుకే చెట్టు, పుట్ట ,రాయి, రప్ప, పాము ఎలుక, సింహం, ఆవు మొదలగునవే కాక , కాలువ తుడిచే వాని చీపురు దగ్గర నుండి పెద్ద ఫ్యాక్టరీలో మిషన్ వద్ద పనిచేసే వాడి వరకు తమ పనిముట్లను దేవుని ప్రతిరూపాలుగా భావించి కొలుస్తారు. అందుకే ఇక్కడ జీవన విధానం నుండి మతాన్ని వేరుచెయ్యడం అంత సులభం కాదు. ఆఖరుకు మంచినీరు తాగినా కూడా కృష్ణార్పణం అంటారు. ఉత్తర భారతంలో ఒకరినొకరు పలకరించుకుందుకు ‘రామ్ రామ్’ అంటారు. ఆంధ్రాలో ప్రతీ గ్రామంలో రామాలయం దానిలో రచ్చబండ సర్వసాధారణం.

అందుకే అష్టకష్టాలు పడి మిషనరీస్ మతం మారుస్తున్నా మతం మారిన వారి సనాతన ధర్మం మూలాలను తెంచలేక  ఈ మిషనరీష్ ఒక మెట్టు దిగి హిందూ సంప్రదాయాలను కూడా అనుకరిస్తూ మతం మారిన వాళ్ళను వెనక్కు పోకుండా అడ్డుకుంటూ కొత్త మతమర్పిడులకు పాల్పడుతున్నారు.
అందుకని అసలు మతం మార్చక ముందే ఇక్కడ హిందువుల మూలాలకు గల వేళ్ళు తెంచేస్తే మత మార్పిడి చెయ్యడం ఇంకా సులువు.  అంతేకాకుండా మారిన తరువాత కూడా మళ్లీ వెనక్కి తమ పాత మతంలోకి వెళ్లే ఆలోచన రాదు.  అలా జరగాలి అంటే ఇక్కడ ఉన్న హిందువులు తమ వేషధారణపై, తమ ఆచార వ్యవహారాలపై, పద్ధతులపై, పూజా విధానాలపై, పండుగలపై వారికి ఒక ద్వేష భావం కలిగించాలి. దానికి తమ చేతిలో ఉన్న దేశ విదేశీ మీడియా వారు, NGOs, హిందువులలోనే ఉదారవాద ముసుగు వేసుకునే వామపక్ష భావాలు కలవారు మొ. వారందరి చేత ఈ పైన చెప్పిన హిందూ సంబంధిత కార్యక్రమాల శాస్త్రీయతను ప్రశ్నించడం, పర్యావరణం మొ. అంశాలు లేవనెత్తడం, పండుగలలో దేవుళ్ళల్లో /రాక్షసుల్లో కుల విభజన చూపించి ఒకరిపై ఒకరిని రెచ్చగొట్టడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు.
దీనివల్ల హిందువులు తమ సంస్కృతి పై ద్వేషం పెంచుకొని దూరం జరిగితే వీళ్ళ ఎజెండా సగం సాధించినట్లే. ఇప్పటికే గమనిస్తే చాలా హిందూ కుటుంబాల్లో కొత్త తరం వారు కొంచం దూరం జరుగుతూ ఉండడం గమనించవచ్చు.

2. ఇక ఆర్ధిక కారణాలు – ప్రపంచంలో చవగ్గా శ్రామికులు, వనరులు దొరికే పెద్ద దేశాల్లో ముఖ్యమైనవి చైనా మరియు భారత్. చైనా కమ్యూనిస్ట్ నిరంకుశ పాలన కాబట్టి అక్కడ ఉత్పత్తి రంగానికి శ్రామిక, పర్యావరణ మొ. ఇబ్బందులు తక్కువ. అదే భారత్ ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఇక్కడ అన్ని రూల్స్ పాటించాలి. అందువల్ల ఇక్కడ పరిశ్రమలు చైనా ఉత్పత్తుల ధరలతో పోటీ పడడం కష్టం.
అయినా కూడా ఇంకా ఇప్పటికే మన దేశంలో ఉన్న పరిశ్రమలకు ఎదో విధంగా మీడియా ద్వారా, NGOs ద్వారా, వామపక్ష అనుబంధ సంఘాల ద్వారా ఇబ్బందులు సృష్టించి మూత పడేటట్లు చేస్తే అంతమేరా చైనాకు లాభం మన దేశానికి నష్టం.

ఉదాహరణకు ఇలాగే పర్యావరణ హాని అని అనవసరమైన ఆందోళనలు చేసి కోర్ట్ కేసులు వేసి తమిళనాడు లో స్టీరిలైట్ రాగి పరిశ్రమ మూయించారు. దాని వల్ల మన దేశం రాగి ఎగుమతి చేసే స్థాయి నుండి దిగుమతి చేసుకునే స్థాయికి పడిపోయింది. ఆ పరిశ్రమ అనుబంధ పరిశ్రమ ల మీద ఆధారపడ్డ 50 వేల మంది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డారు.  ఆ మేరకు వేల కొట్ల లో చైనా లాభపడ్డది. అలాగే గమనించి వుంటారు ఎక్కడ ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రం లేదా ఒక డాం లేదా ఒక పరిశ్రమ నిర్మిద్దాం అంటే ఈ ఈ ముఠా ఎన్ని రకాల అడ్డంకులు సృష్టిస్తుందో. ఈ ఆందోళన ల వెనుక సాధారణంగా వామపక్ష సంఘాలు, విదేశీ నిధులు పొందుతున్న NGO లు ఉంటాయి.

అలాగే తమిళనాడులో బాణసంచా పరిశ్రమకు శివకాశి పేరు. వెయ్యికి పైగా చిన్న తరహా పరిశ్రమలు సుమారు 80 వేల మంది వరకు కార్మికులకు ఉపాధి చూపిస్తున్నాయి. ఈ పరిశ్రమకు ప్రభుత్వ  ప్రోత్సాహం ఉంటే ఎగుమతులు చేయగల క్వాలిటీ బాణాసంచా తయారు చేయగలరు.  కానీ ఇక్కడ ఈ పరిశ్రమ బలపడితే ఎవరికి నష్టం. మళ్లీ చైనా దేశానికే. ఎందుకంటే అమెరికా వినియోగించే మందుగుండు సామగ్రిలో 90% పైగా చైనా నుండి దిగుమతి అవుతున్నాయి. మన దేశంలో గత సం.చైనా నుండి ఈ సామాను దిగుమతుల విలువ రు.40 వేల కోట్లు. అంటే ఇక్కడ శివకాశీ మందుగుండు పరిశ్రమ కు తరుచుగా ఇబ్బందులు సృస్తిస్తే ఇక్కడ పరిశ్రమలు మూతపడితే ఇంక వ్యాపార పెరుగుదల, ఎగుమతులు గురించి ఆలోచనే రాదు . అంతేకాదు అసలు మన దేశీయ వినియోగానికికూడా దిగుమతుల కోసం చైనా పై ఆధారపడే పరిస్థితి తయారు అవుతుంది.

అందుకని  హిందూ పండుగలకు, ఉత్సవాలకు వచ్చే వ్యతిరేక ప్రచారాన్ని తిప్పి కొట్టండి. అమాయకంగా అంతా మన మంచికే అన్న దృక్పథం నుండి బయట పడండి.
ఇవి వినడానికి నవ్వులాటగా అనిపించవచ్చు, లేదా ఊరికే ఊహించుకొని ఇటువంటి పోస్టుల అనవసర భయం సృష్టిస్తున్నారు అని అనిపించవచ్చు. కానీ ఇది వాస్తవం…

–   చాడా శాస్త్రి