డాక్టర్ వైఎస్‌ఆర్ పోలవరం ప్రాజెక్ట్..!!!.

704

వ్యవసాయం దండగ కాదు, పండుగ అని నినదించిన మహానీయుడు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మనసారా నమ్మిన నేత. పల్లెలు బాగుంటేనే పట్నాలు బాగుంటాయని చెప్పిన దూరదృష్టి ఉన్న నాయకుడు. రైతు కంట కన్నీరు దేశానికి అరిష్టమని అన్నదాత కోసం ఎన్నో పథకాలు చేపట్టిన పాలకుడు డాక్టర్ వైఎస్‌ఆర్‌. డాక్టర్‌గా నాడి ఎలా పట్టుకోవాలో నేర్చుకున్న వైఎస్ఆర్‌, రాజకీయాల్లోకి వచ్చాక సమాజం నాడి పట్టుకోవడం నేర్చుకున్నారు. పుట్టుకతోనే వైఎస్ఆర్‌కు నాయకత్వ లక్షణాలు వచ్చాయి. ఆయన ఆలొచనలు ఎప్పుడూ రైతుల గురించే. ప్రకాశం బ్యారేజీ మీద నిలబడి ఆలొచించినా, కోనసీమ కాల్వల దగ్గర నుంచోని మాట్లాడినా ఆయన రాష్ట్రం మొత్తాన్ని సస్యశ్యామలం చేయాలని కలలు కనేవారు . డాక్టర్‌గా కొంత మందికే సహాయపడగలనని గమనించారు.

రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు ఎంతో మేలు చేయవచ్చని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. వైఎస్‌ఆర్‌ రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి చనిపోయేవరకు రైతన్న గురించే కలలు కన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, గోదావరి లాంటి ప్రధాన నదులతోపాటు ఎన్నో నదులు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడంలేదని వైఎస్ఆర్‌ మదనపడేవారు. కృష్ణా, గోదావరి నుంచి వేల టీఎంసీల నీరు సముద్రంపాలు కావడంపై సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసేవారు. మనం అధికారంలోకి వచ్చాక చుక్క నీరు కూడా వృధా పోనివ్వకూడదయ్యా అని అనుచరులు దగ్గర వైఎస్ఆర్‌ తరచుగా అంటుండేవారు. రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలోనే రాయలసీమకు నీటి ప్రాజెక్టుల కోసం పాదయాత్ర చేపట్టారు. రాయలసీమలాంటి కరువు ప్రాంతాన్ని కోనసీమలా చూడాలనేది వైఎస్‌ఆర్‌ కలగా ఉండేది. రాయలసీమలో జలసిరులు పరుగెడుతుంటే జనాలు కూడా పొలం పనుల్లో పడి ఫ్యాక్షన్‌ రాజకీయాల జోలికి వెళ్లరనేది వైఎస్‌ఆర్‌ ఆలోచన. మూడు దశాబ్దాలు పాటు రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మే14, 2004లో వైఎస్ఆర్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే తన కలల ప్రాజెక్ట్‌ను పట్టాలు ఎక్కించడం ప్రారంభించారు.

28 ప్రాజెక్టులతో జలయజ్ఞం చేపట్టారు. జలయజ్ఞం కింద 28 ప్రాజెక్టులను వైఎస్‌ఆర్‌ ఒకేసారి చేపట్టడంతో అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయని అధికారులు గుసగుసలాడుకునేవారు. అధికారుల సందేహాలను గుర్తించిన వైఎస్ఆర్‌ మీ పని మీరు చేసుకెళ్లండి పనులు ఆగకుండా చూస్కునే బాధ్యత నాది అంటూ అధికారులకు భరోసా ఇచ్చారు. ఎవరూ ఊహించని పులిచింతల ప్రాజెక్ట్‌ చేపట్టి కృష్ణా డెల్టాను స్థిరీకరించారు. తెలంగాణ వాదుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా తన విజన్ నుంచి వైఎస్ఆర్‌ తప్పుకోలేదు. మనం ప్రాజెక్టులు ప్రారంభిస్తే మనం ఉన్న లేకపో యినా తరువాత వచ్చిన వారుచేపడుతారని చుట్టున్నవారితో వైఎస్‌ఆర్‌ తరుచుగా అనేవారు. నీటి ప్రాజెక్ట్‌ల విషయంలో వైఎస్ఆర్‌ తీసుకున్న అత్యంత సాహసోపేత నిర్ణయం పోలవరం ప్రాజెక్ట్.

1946 నుంచి పోలవరం ప్రాజెక్ట్ కాగితాలకే పరిమితమైంది. కాగితాలు దాటి పోలవరం ప్రాజెక్ట్ బయటకు పోలేని స్థితి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, పోయారు. సముద్రం పాలవుతున్న నదీ జలాలను చూసి అందరూ అయ్యో అ న్నవారే. కానీ..ఎవరూ కూడా పోలవరం ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లలేకపోయారు. కానీ..వైఎస్‌ఆర్‌ అలా కాదు. తాను సీఎం అయితే రాష్ట్రానికి ఏం చేయాలని తన మనసులో బ్లూ ప్రింట్ రచించుకుని వచ్చారు. 2004లో సీఎంగా బాధ్యతలు చేపట్టగానే పోలవరం ప్రాజెక్ట్‌పై వైఎస్ఆర్‌ దృష్టి పెట్టారు. ఎందుకంటే..పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తు దారి అని నమ్మిన మహానేత వైఎస్ఆర్‌. పోలవరం ప్రాజెక్ట్ వలన ఎన్నో ప్రయోజనాలను గుర్తించిన మహా నాయకుడు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే అధికారులను సమావేశపరిచి పోలవరంపై పరుగులు పెట్టించారు.

అంతకు ముందు ముఖ్యమంత్రులు కలలో కూడా ఊహించడానికి సాహసం చేయని పోలవరం ప్రాజెక్ట్‌ను తన భుజాలకు ఎత్తుకున్నారు వైఎస్ఆర్‌. భూ సేకరణ ఆరంభించారు. ప్రాజెక్టుతో భూములు కోల్పోతున్నవారికి ప్రభుత్వం నుంచి ఊహించిన దాని కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్‌కు భూములిచ్చే వారిలో అసంతృప్తి లేకుండా చూశారు. అందరూ చూస్తుండగానే భూ సేకరణ ప్రారంభమైంది. చాలా వరకు భూమి సేకరించారు. రైట్ కెనాలు, లెఫ్ట్ కెనాలు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. పర్యావరణ అనుమతులు వచ్చాయి. పోలవరానికి అన్ని అనుమతులు తెచ్చిన తరువాత వైఎస్‌ఆర్‌ను దేవుడు తీసుకెళ్లాడు. అంతే…అప్పటి వరకు శరవేగంగా పరుగులు పెట్టిన పోలవరం పనులు షడన్‌ బ్రేక్‌ వేసినట్లు ఆగిపోయాయి. వైఎస్ఆర్‌ తరువాత వచ్చిన కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు పోలవరం ప్రాజెక్ట్‌పై సవతి తల్లి ప్రేమ చూపించారు. 2014లో సీఎంగా మూడోసారి బాధ్యతులు చేపట్టిన చంద్రబాబు పోలవరం పేరుతో దోపిడీకి పాల్పడ్డాడు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీ ఎంలా వాడుకున్నాడని ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ విమర్శలు సంధించారు. నచ్చినవారికి, అయినవారికి కాంట్రాక్ట్‌లు ఇచ్చి కాసులు వాన కురిపించుకున్నారు చంద్రబాబు.

పోలవరం డబ్బులతో హైదారాబాద్‌లో ఇంద్రభవనం లాంటి ఇళ్లు కట్టుకున్నాడు. పోలవరం పనులు సరిగా నడవక పోయినా తనకున్న మీడియా బలంతో పోలవరం ప్రాజెక్ట్ అయిపోతుందని ప్రజల్లో భ్రమలు కల్పించారు. పోలవరం యాత్రల పేరుతో రూ.500 కోట్లకు పైగా నీళ్లపాలుజేశారు. పోలవరం పూర్తైతే వైఎస్ఆర్‌కు పేరు వస్తుందనే అక్కసుతో ప్రాజెక్ట్ పూర్తి పనులు వేగంగా చేపట్టకుండా నాటకాలు ఆడాడు చంద్రబాబు. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్రమే నిర్మించి ఇవ్వాలి. కానీ..పోలవరం ప్రాజెక్ట్ కేంద్రం చేతిలో ఉంటే తన ఖజానా నిండదని గుర్తించిన చంద్రబాబు తన పరిధిలోకి తెచ్చుకున్నాడు. చంద్రబాబు ధనదాహం, రాజకీయాలు పోలవరాన్ని ఐదేళ్లు వెనక్కి తీసుకెళ్లాయి. పోలవరం ప్రాజెక్ట్ కోసం వైఎస్‌ఆర్‌ రైట్ కెనాల్ తవ్వించారు.
పోలవరం పూర్తి కాకుండా అడ్డుకుంటూనే పట్టిసీమ ఎత్తిపోతల పథకం చేపట్టాడు చంద్రబాబు. పట్టిసీమ నుంచి వైఎస్ఆర్‌ తవ్వించిన రైట్ కెనాల్‌లో నీళ్లు ఎత్తిపోసి నదుల అనుసంధానం అంటూ ఎల్లో మీడియా చేత భజన చేయించుకున్నాడు. నదుల అనుసంధానానికి తానే ఆధ్యుడునని పోజులిచ్చాడు. అందుకే..2019 ఎన్నికల్లో ఓటర్లు కర్రు కాల్చి చంద్రబాబుకు వాత పెట్టారు.

పోలవరం ప్రాజెక్ట్ అంటే వైఎస్ఆర్‌..వైఎస్ఆర్‌ అంటే పోలవరం ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్ట్ అవసరాన్ని గుర్తించి ముందుకు తీసుకెళ్లిన మహానుభావుడు డాక్టర్‌ వైఎస్ఆర్. పోలవరం ప్రాజెక్ట్ దగ్గర 100 అడుగుల వైఎస్ఆర్ విగ్రహం పెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం తెలుగు ప్రజలు వైఎస్ఆర్‌కు ఇచ్చే గౌరవం. వైఎస్‌ఆర్‌కు గౌరవం ఇవ్వడమంటే తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు గౌరవం ఇవ్వడం. తెలుగు నేల మీద ప్రవహించే నీటి బొట్టులో వైఎస్ఆర్‌ నవ్వు కనిపిస్తోంది. ప్రతి మాగాణిలో వరి కంకై ఆశీర్వదిస్తుంటాడు వైఎస్‌ఆర్‌. మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత పోలవరం ప్రాజెక్ట్ పనులు మళ్లీ వేగం పుంజుకున్నాయి. మేగా ఆధ్వర్యంలో కార్మికులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. కరోనా సమయంలోనూ పోలవరం ప్రాజెక్ట్ పనులు ఆగలేదు. వరదల సమయంలోనూ బ్రేక్‌ లేకుండా పోలవరం పనులు సాగాయి. ఒక్క మాటలో చెప్పాలంటే గోదారమ్మ పరవళ్లుతోపాటు పోటీపడి పోలవరం ప్రాజెక్ట్ పనులు సాగుతున్నాయి. తెలుగు ప్రజలు వైఎస్ఆర్‌కు ఇచ్చే గౌరవం ఏమైనా ఉందంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి, ఆ ప్రాజెక్ట్‌కు డాక్టర్‌ వైఎస్‌ఆర్ పోలవరం ప్రాజెక్ట్ అని పేరు పెట్టడమే. పోలవరం ప్రాజెక్ట్‌ లెఫ్ట్ కెనాల్‌తో విశాఖ నీటి అవసరాలు తీర్చడానికి అప్పుడే సిటీకి 28 టీఎంసీలు కేటాయించారు వైఎస్‌ఆర్‌. అంటే..విశాఖ అభివృద్ధిని, భవిష్యత్తును ఆనాడే వైఎస్‌ఆర్‌ అంచనా వేశారు. పోలవరంతో ఉత్తరాంధ్ర సుభిక్షంగా ఉంటుందని తలిచారు వైఎస్‌ఆర్‌. రైట్ కెనాల్ ద్వారాచిత్తూరు జిల్లా వరకు నీళ్లు తీసుకెళ్లాలి అనేది వైఎస్ఆర్‌ సంకల్పం. 2022 -23 నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీదనే ఉంది.

పోలవరం ప్రాజెక్ట్‌తో దేశానికి ఆహార భద్రత ఏర్పడుతుంది. లక్షల ఎకరాల మెట్టభూమి సాగులోకి వచ్చి లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. పోలవరం ప్రాజెక్ట్‌తో నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులపై ఒత్తిడి తగ్గి ఆ నీటిని మరో విధంగా వాడుకోవచ్చు. రాష్ట్రంలో వందల రిజర్వాయర్లు, చెరువులు నిర్మించుకుని ప్రతి వాన బొట్టును ఒడిచి పట్టుకోవచ్చు. వైఎస్‌ఆర్‌ ఆలోచనే ఓ విజన్‌. విజన్‌ లేకుండా వైఎస్ఆర్‌ అడుగు ముందుకు వేసే వారు కాదు. ఆ విజన్‌లో సంక్షేమంతోపాటు అభివృద్ధి కూడా ఉండేది. మహానేత వైఎస్ఆర్‌ నిఖార్సైన రైతు నాయకుడు. ఆయన మరణం రైతులకు తీరని లోటు. ఆ లోటును పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి చేయడం ద్వారానే తీర్చుకోగలం.

పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. వైఎస్ఆర్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకుని పూజించినట్లే ఆయన తనయుడు జగన్‌ను కూడా గుండెల్లో పెట్టుకుని పూజిస్తారు. అంతేకాదు..పోలవరం ప్రాజెక్ట్‌ను వైఎస్‌ జగన్ 2024లోపు పూర్తి చేసి ప్రారంభిస్తే రాష్ట్రంలో టీడీపీకి నూకలు చెల్లినట్లే. పోలవరం ప్రాజెక్ట్ పూర్తైతే రాష్ట్ర ప్రజల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై అపార నమ్మకం ఏర్పుడుతుంది. ఆయన నాయకత్వాన్ని బలపర్చేందుకు 2024 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌కు మరోమారు పట్టం కడతారు. రాష్ట్రంలోని రైతుల ఓట్లు గంపగుత్తుగా వైఎస్ఆర్‌ సీపీకి పడతాయి. రైతులే కాదు రైతు కూలీలు, వ్యవసాయ ఉత్పత్తుల అనుబంధ శ్రామికులు అందరూ వైఎస్ఆర్‌ సీపీకి ఓటేసి వైఎస్‌ జగన్‌కు 2024లో పట్టం కట్టి, గుండెల్లో పెట్టుకుని దేవుడిలా పూజిస్తారు. పోలవరం ప్రాజెక్ట్ వైఎస్‌ జగన్‌ చేతులు మీదుగా పూర్తి కావాలి అనేది కోట్ల మంది వైఎస్ఆర్‌ అభిమానుల కోరిక.

-వై.వి. రెడ్డి, పొలిటికల్ అనలిస్ట్‌