స్వయంసేవకులకు సేవలోనే అపరిమిత ఆనందం

216

దేశం అంతా ఈ కొరొనా మహమ్మారి విజృంభణ సమయంలో సమాజం పట్ల అచంచల ప్రేమ కలిగిన కొంతమంది సంఘ స్వయంసేవకులు మధ్యప్రదేశ్ లోని మాండ్సౌర్ జిల్లాలో సేవా కార్యక్రమాలు నిత్యం చేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో డాక్టర్ విజయ్ అనే ఒక స్వయంసేవక్ ఒక సేవాబస్తీలో ఒక కుటుంబం బట్టలు కూడా లేని ఒక కడు పేద కుటుంబాన్ని చూడటం జరిగింది. కానీ ఆ సమయంలో విజయ్ నిస్సహాయంగా ఉండిపోయాడు. సాయంత్రం సేవా కార్యక్రమాలు అన్నీ ముగించుకొని ఇంటికి వెళ్ళే ముందు తన మిత్రులందరుతో తను చూసిన ఈ కడు పేద కుటుంబం గురించి వారందరికీ వివరించాడు. ఎలాగైనా వారందరికీ బట్టలు ఇవ్వాలని వారి ఇళ్ళలోని వారి బట్టలు తీసుకుని మరుసటి రోజు ఉదయం యదావిధిగా సమాజ సేవకు ఇంటినుండి ఆ యువకులంతా బయటకు వచ్చేశారు.

డాక్టర్ విజయ్ రాథోడ్ మాత్రం ఎప్పుడెప్పుడు వారింటికి వెళ్ళి బట్టలు ఇచ్చి వారిని ఆదుకోవాలా అనే ఆలోచనలో ఉన్నారు. మిత్రులందరూ విజయ్ చెప్పినట్లుగానే వారి దగ్గర ఉన్న బట్టలు, షూలు, ఆహార పొట్లాలు తీసుకుని ఆ పేద గుడిసె దగ్గరకు వెళ్ళి వారందరకీ ఆహార పొట్లాలతో పాటు బట్టలు‌ కూడా ఇచ్చాడు. వెంటనే అందరూ బట్టలు వేసుకున్నారు. చిన్న పిల్లలు కూడా ఉన్నారు మీరు చిత్రంలో చూడొచ్చు. అదే సమయంలో ఆ పేద ఇంట్లో ఉన్న ఓ అన్న స్వయంసేవకులు ఇచ్చిన బూట్లు వేసుకునే ప్రయత్నం చేశారు. కానీ అవి సరిపోలేదు. అందరు స్వయంసేవకులూ వెనుదిరిగారు కానీ డాక్టర్ విజయ్ మాత్రం అతనికి ఆ బూట్లు పట్టడం లేదన్న విషయం గ్రహించి తను వేసే ప్రయత్నంలో తను వేసుకు‌‌న్న షూ విప్పి ఆ అన్నకు షూ వేశాడు. ఇంతలో వెనక్కు చూసిన స్వయంసేవకులు అక్కడ జరిగిన సంఘటన గ్రహించి వెంటనే ఈ చిత్రం తీశారు. చిత్రంలో కూడా చూడవచ్చు క్రింద ఖాకి నిక్కర్ వేసుకు కూర్చున్న వ్యక్తికి బూట్లు లేవు. అతడే డాక్టర్ విజయ్.

చూశారా మిత్రులారా ఓసారి సమాజ సేవలో నిమగ్నమయ్యాక తనకున్న దానిని ఇతరులకు పంచడంలో ఎంత ఆనందం ఉంటుందో కదా‌‌‌? ఈ చిత్రం తీసిన విషయం విజయ్ కి కూడా తెలియదు‌. మిత్రులు విజయ్ కి ఈ చిత్రాన్ని చూపినపుడు ఆనంద భాష్పాలు రాలాయి‌‌‌. “సంఘం నాలో ఈ మార్పుకి కారణం” అంటూ అందరితో హాయిగా కలిసి మిగిలిన ఆహార పొట్లాలు పంచాడు‌‌‌‌‌.  సేవాహి పరమో ధర్మ:. ఇదండీ ఈ చిత్రం వెనుకున్న కథ.

సేకరణ : రాజశేఖర్ నన్నపనేని

(Vishwa Samvad Kendra Andhra Pradesh)