‘పసుపు పాలు’…ఆరోగ్యం

రోజూ పాలు తాగే అలవాటు అందరికీ ఉంటుంది. అయితే, దానికి కాస్త మంచి పసుపు జోడిస్తే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం అని అంటున్నారు నిపుణులు. పాలలో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మెదడును ఎంతో చురుగ్గా ఉంచుతాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మెదడులోని కణాల ఆర్యోగానికి సహాయపడతాయి. రోజూ మూడు గ్లాసుల పాలు తాగేవారు వ్యాధులకు దూరంగా ఉంటారని పలు పరిశోధనల్లోనూ తేలింది. అలాంటి సుగుణాలున్న పాలకు పసుపు తోడైతే ఆరోగ్యానికి అదనపు ప్రయోజనాలు లభించినట్లే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది పురాతన కాలం నుంచి ఉన్నదే. మన పూర్వీకులు కూడా పసుపు పాలను తాగేవారు. అందుకే వారు ఆరోగ్యంగా ఉండేవారు. దగ్గు, జలుబుతో బాధపడేవారు ఈ పసుపు పాలను తాగితే ఇట్టే ఉపశమనం లభిస్తుంది. కఫం ఎక్కువగా ఉండి ఇబ్బందిపడేవారు వెచ్చని పసుపు పాలు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. పాలలో సెరటోనిన్‌ అనే బ్రెయిన్‌ కెమికల్‌, మెలటోనిన్‌ ఉంటాయి. ఇవి పసుపులో ఉండే వైటల్‌ న్యూట్రియంట్స్‌తో కలిసి ఒత్తిడిని తొలగిస్తాయి. దానివల్ల హాయిగా నిద్ర పడుతుంది.
రోగ నిరోధకశక్తిని పెంచుతాయి.పసుపు పాలు వైరల్‌ దాడి నుంచి కాలేయాన్ని రక్షిస్తాయి. కాబట్టి కాలేయ సంబంధ పచ్చ కామెర్ల లాంటి వ్యాధులు రావు.
కాలేయంలో చేరే విషకారకాలను హరిస్తుంది.ముక్కు దిబ్బడ, తలనొప్పి, ఇతర నొప్పులను తగ్గిస్తుంది.కీళ్ల వాపులు, నొప్పులు తగ్గాలంటే పసుపు పాలను క్రమం తప్పక తాగాలి.
పసుపు పాలలో ఉండే పోషకాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి లింఫోటిక్‌ సిస్టమ్‌ను కూడా శుద్ధిచేస్తాయి.కామెర్లు దరిచేరకుండా అరికడుతుంది.పసుపులో ఉండే కర్‌క్యుమిన్‌ శరీరంలో వైరస్‌ వృద్ధిని అరికడుతుంది.
నీటి ద్వారా శరీరంలోకి చేరుకున్న వైరస్‌ త్వరితగతిన రెట్టింపు అవకుండా పసుపు నియంత్రిస్తుంది.పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ వల్ల కీళ్లు బలపడతాయి.
రుతుక్రమం వల్ల కలిగే పొత్తి కడుపు, ఇతర ఒంటి నొప్పులను దూరం చేస్తుంది.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
Close Bitnami banner
Bitnami