దయచేసి ఇకనైనా మారండి…  

486

ఎంతో ఘన కీర్తి కలిగిన ఆంధ్రులు…చరిత్రలో చూస్తే శాతవాహనులు…ఇక్ష్వాకులు…పల్లవులు…విష్ణుకుండినులు… చాళుఖ్యులు…రెడ్డి రాజులు…కాకతీయులు…ఢిల్లీ సుల్తానులు…నుండి బ్రిటిష్ పాలకుల వరకు ఎందరో పాలకుల ఏలుబడిలో స్వాతంత్రం వచ్చేవరకు  ఎన్ని రాజధానులో…
స్వాతంత్రం వచ్చాక మరెన్నో రాజధానులు…మద్రాస్… కర్నూల్… హైదరాబాద్… విజయవాడ… ఊహల్లో అమరావతి… కాబోయే విశాఖపట్నం… ఇంకెన్నో… మరెన్నో… ఆరంభసూరులైన ఆంధ్రుల సంచార జీవితాలకి ఇక అంతం అనేదే లేదా…?… ఈ వలస జీవనం ఆంధ్రులకు ఇంకెన్నాళ్లు…? ఎంతో తెలివైనవారు, మేధావులు అని చెప్పబడే ఆంధ్రుల దుస్థితి వాస్తవంగా ఇలావున్నది… మారక పొతే, ఇలాగే ఉండబోతున్నది… ఇది తథ్యం…ఇదే నిజం!!!
మన స్వార్ధపరులైన, అవకాశవాదులైన, నీచ-నికృష్ట రాజకీయనాయకుల వలెనే మనకు ఈ దుర్వ్యస్థ దాపురించింది… దయ చేసి ఇకనైనా మారండి… మీ తెలివికి, మేధస్సుకు కొంచం బూజు దులపండి… బుర్రకు మరికొంచెం పదును పెట్టండి… ఆంధ్రులకు ఈ అన్యాయం మరెంతకాలం… ఇంకెంత కాలం…?
మానవజాతి చరిత్రలో మరే జాతీ ఇంతగా దగా పడలేదు… ఇంతగా మోసగింప బడలేదు… ఇంతగా అవమానించబడలేదు… సెర్బులు , యూదులు కూడా కొంత కాలమే అవమానపడ్డారు… ఇప్పుడు వాళ్లంతా తల ఎత్తుకుని నిలబడ్డారు… మన మెప్పుడు ఒక్కటవుదాం…?… మన మెప్పుడు సంఘటితమవుదాం…?… మన మెప్పుడు మనకు జరిగిన అన్యాయాల్ని ప్రశ్నిద్దాం…?
దయచేసి ఇకనైనా మారండి… మనకెందుకులే మనదాకా రాలేదు కదా అనుకోవద్దు… అప్పటికి పుణ్యకాలం పూర్తై పోతుంది… అప్పటికి ఇంకేమి మిగలదు… ఆంధ్రులు అంతా ఒక్కటి కావాలి… కుల, మత, వర్గ విభేదాలు వీడి ఆంధ్రుల హక్కుల కోసం మనకు రావలసిన న్యాయమైన వాటా కోసం పోరాడాలి… ధర్మం కోసం పోరాడాలి…  మనకు ఎవ్వరి బిక్ష, దానం అవసరం లేదు… మనకు జరిగిన అన్యాయాన్ని ఇకనైనా ఎదురిద్దాం… పోరాటం చేద్దాం… సాధిద్దాం…
జై ఆంధ్ర … జై ఆంధ్ర ప్రదేశ్

                                                                  పెన్మెత్స రవి ప్రకాష్ అశోక వర్మ శృంగవృక్షం
                                                                                                                     Near భీమవరం
                                                                                                             పాలకోడేరు మండలం
                                                                                                                  పశ్చిమ గోదావరి జిల్లా
                                                                                                                               ఆంధ్ర ప్రదేశ్