కుండలి-అరోగ్య ఫలితము

708

మానవుడు తన నిత్యకార్యకలపాలు సాధించాలంటే ఆరోగ్యంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అయితే మానవుని శరీరము యంత్రము లాంటిది. ఆ యంత్రానికి కొన్ని సమయాల్లో చిన్న చిన్న సమస్యలు ఏర్పడవచ్చు. అంటే ఆరోగ్య సంబంధ సమస్యలు ఎదురు అవుతాయి. అయితే వ్యాధి తొందరగా మెరుగుపడకుంటే చింత ఏర్పడుతుంది. నిత్య కార్యకలపాలకు ఆటంకం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ చింతను దూరము చేయుటకు  స్వాస్త లాభము ఎప్పుడు కలుగుననేది ప్రశ్న కుండలి ద్వారా లెక్కించడం సాధ్యపడుతుంది.
త్వరగానే రోగ నివారణ యోగము
లగ్నాదిపతి నుంచి రోగ నివారణ
లగ్నములో స్థితిలో ఉన్న బలమైన గ్రహములు తొందరగానే అరోగ్యం కుదుటపడును. యది లగ్నాదిపతి, దశమాదిపతి మిత్రులుగా సమన్వయం ఉంటే కూడా ఆరోగ్య స్థితిలో మంచి మార్పు ఏర్పడును. చతురాదిపతి, సప్తమాదిపతి మధ్య మిత్రుత్వం ఉంటే కూడా రోగికి త్వరగానే ఆరోగ్యం కుదుటపడును. లగ్నాదిపతి యొక్క చంద్రునితో సంబంధం ఉండి, చంద్రుడు శుభ గ్రహముల ప్రభావములో లేదా కేంద్రములో స్థితిలో దానివలన కూడా తొందరగానే అరోగ్యంలో మంచి మార్పు ఏర్పడుతుంది. అంతేకాదు శుభ గ్రహాల ప్రభావం వల్ల కేంద్రంలో లగ్నాదిపతి, చంద్రుని స్థితి శీఘ్ర లాభమును కలిగించును. ఈ యోగంలో సప్తమాదిపతి వక్రి కాకుండా ఉండాలి. సప్తమాదిపతి సూర్యుడు, అష్టమ భావములోని స్వామి వలన ప్రభావితం కాకుండా ఉండాలి.
చంద్రుని ద్వారా రోగ నివారణ
స్వరాశి లేదా ఉచ్చరాశిలో బలమైన చంద్రుడు ఏదో ఒక శుభ గ్రహంతో సంబంధాన్ని కలిగి ఉంటే, రోగి త్వరగానే కోలుకోగలుగుతాడు. చంద్రుడు యది చర లేదా ద్విస్వభావం రాశిలో ఉండి లగ్నం లేదా లగ్నాదిపతి ద్వారా దృష్టి కలిగి ఉంటే కూడా త్వరగా ఆరోగ్యం మెరుగు పడుతుంది. చంద్రుడు యది స్వరాశిలో లేదా దశమ భావ స్థితిలో ఉన్న కూడా పైన చెప్పిన లాభ ఫలితాలే కలుగుతాయి. శుభ గ్రహాల దృష్టి చంద్రుడు లేదా సూర్యునితో 1, 4 లేదా 7వ భావ స్థితిలో ఉంటే కూడా త్వరగానే ఆరోగ్య లాభం చేకూరుతుంది.
త్వరగా ఫలితాలు కలిగించే యోగాలు
జ్యోతిష్య ఆధారంగా యది లగ్నాదిపతి – దశమాదిపతి మధ్య లేదా, చతురాధిపతి – సప్తమాదిపతి మధ్య శత్రుత్వం ఉంటే రోగం అధిగమించును. కుండలిలో షష్టమాదిపతి ద్వారా వ్యాధిని అంచనా(లెక్కించెదరు) వేస్తారు. యది ప్రశ్న కుండలిలో షష్టమాదిపతి, అష్టమాదిపతి, దశమాదిపతి మధ్య సంబంధాలు కలిగి ఉంటే ఆరోగ్య లాభం కలుగడంలో అవకాశాలు తక్కువ ఉంటాయి. లగ్నంలో చంద్రుడు లేదా శుక్రుడు యొక్క ఉపస్థితి ఉండుట వల్ల త్వరగా రోగ నివారణకు అవకాశాలు ఉండవు. ప్రశ్న కుండలిలో లగ్నాధిపతి, కుజుడు యుతి కలిగి ఉండుట కూడా అరోగ్య లాభమునకు ఫలదాయకముగా వుండదు. ద్వాదశ బావములో లగ్నాదిపతి స్థితిలో ఉంటే గనక రోగి ఆలస్యంగా వ్యాధి నుంచి బయటపడగలడు. అంతేకాదు యది లగ్నాదిపతి షష్టమ, అష్టమ బావలలో స్థితిలో ఉన్నా.. అష్టమాదిపతి కేంద్ర స్థితిలో ఉన్నా.. రోగి త్వరగా కోలుకోలేడు.
12 బావములు, శారీరక భాగములు
కుండలిలో 12 బావములు శరీరంలో విభిన్న అంగాలను లెక్కించును. అన్ని భావాలు రోగాలలో ఏదైన ఒక స్థానమును సూచించును.
తొలి బావము          :     తల, మెదడు, నరాలు
ద్వితీయ బావము     :     ముఖం, కంఠం, పీక, కళ్ళు
తృతీయ బావము     :    భుజములు, రొమ్ము, జీర్ణాశము, శ్వాసము, నరాలు, చేయి
చతుర్ధ బావము       :    స్థనములు, పై అగ్న క్షేత్రము, పై పాచక తంత్రము
పంచమ బావము     :     హృదయం, రక్తం, వీపు, రక్త సంచార తంత్రం
షష్టమ బావము       :     నిమ్న ఉదరం, నిమ్న పాచక తంత్రం, నడుము, ఎముకలు, మూత్రాశయం
సప్తమ బావము       :     ఉదరీయ గుహిక, మూత్రపిండం
అష్టమ బావము       :     గుప్త అంగం, స్తవిక్రియ, జీర్ణ నాళికలు, మలాశయం, మూత్రాశయం, వెన్నుముక
నవమ బావము       :    తొడలు, తిత్తులు, ధమని ప్రక్రియ
దశమ బావము       :    మోకాళ్ళు, ఎముకలు, నరాలను చేర్చుచోటు
ఏకాదశ బావము     :    కాళ్ళు, పాదమును కాలితో చేర్చు ఎముక మరియు శ్వాసము
ద్వాదశ బావము     :    కాళ్ళు, రుచి సంబంధమైన ప్రక్రియ, కళ్ళు.

                                                                                                       – చింతా గోపీ శర్మ సిద్ధాంతి
                                                          లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం (భువనేశ్వరిపీఠం)
                                                                                                 పెద్దాపురం, సెల్:- 9866193557