మధుమేహాన్ని నివారించవచ్చు…

515

మధుమేహం అనేది.. జన్యు సంబంధిత, పరిసరాల అంశాలపైవూ ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహార నియమాలు, క్రియాశీలమైన జీవనశైలితో రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు.చక్కెర ఉన్న ఆహారాలు, పానీయాలను తీసుకోకపోవటం.. పండ్లు, కూరగాయలు, బీన్స్, సంపూర్ణ తృణధాన్యాల వంటి ఆహారాన్ని తీసుకోవటం అందులో తొలి అడుగు.
ఆరోగ్యకరమైన నూనెలు, పప్పులు, సార్డిన్లు, సాల్మన్ల వంటి ఒమెగా-3 పుష్కలంగా ఉండే చేపలు కూడా ఆరోగ్యవంతమైన ఆహారంలో భాగమే.రోజూ క్రమం తప్పని విరామాల్లో ఆహారం తీసుకోవటం.. కడుపు నిండగానే తినటం ఆపేయటం ముఖ్యం.
రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించటానికి శారీరక వ్యాయామం కూడా దోహదపడుతుంది. వారం రోజుల్లో కనీసం రెండున్నర గంటల పాటు.. వేగంగా నడవటం, మెట్లు ఎక్కటం వంటి వ్యాయామం ఉండాలని బ్రిటన్ నేషనల్ హెల్త్ సిస్టమ్ సిఫారసు చేస్తోంది.కదలకుండా కూర్చునే జీవనశైలిని వదిలిపెట్టటం.. వారంలో కనీసం రెండున్నర గంటలు వ్యాయామం చేయటం ముఖ్యం.

 ఆరోగ్యవంతమైన బరువు కూడా.. శరీరంలో చక్కెర శాతాన్ని తగ్గించటానికి సాయపడుతుంది. ఒకవేళ బరువు తగ్గాల్సి ఉంటే.. నెమ్మదిగా తగ్గటానికి.. వారానికి అర కేజీ నుంచి కేజీ చొప్పున తగ్గటానికి ప్రయత్నించండి.హృద్రోగాల ముప్పును తగ్గించుకోవటానికి కొవ్వు (కొలెస్టరాల్) స్థాయి కూడా పరిమితుల్లో ఉండేలా చూసుకోవటం, ధూమపానానానికి దూరంగా ఉండటం కూడా ముఖ్యమే.