తెలంగాణా రాష్ట్రంలో కమ్మవారి రాజకీయ పయనం ఎటువైపు..?

301

గడచిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా పరాజయం అయిన తరువాత అప్పటివరకు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా వెన్నుదన్నుగా నిలిచిన తెలంగాణాలోని అత్యధికశాతం కమ్మకులస్తులు మరియు ఇతర కులాలకు వర్గాలకు చెందిన ఆంధ్రాప్రాంత నివాసితులు ఇక భవిష్యత్తులో తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ పునరుద్ధరణ అసంభవమని, తమకు భవిష్యత్తు రక్షణకు మరో బలమైన రాజకీయప్రత్యామ్నాయం అబసరమని గుర్తెరిగి, తమకు బలమైన రాజకీయ ప్రత్యామ్నాయ పార్టీ కోసం ఎదురుచూస్తున్నారు.

మేము కూడా తెలంగాణా సమాజంలోనూ తెలంగాణా అభివృద్ధిలోనూ భాగమైనా కూడా, మేము కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరితో సోదరభావంతో ఉంటే, గత పదిహేనేళ్లుగా హైదరాబాదు మహానగరంలో  కేవలం మా కమ్మ కులాన్నే లక్ష్యంగా చేసుకుంటూ మమ్మల్నే టార్గెట్ చేస్తూ ఆంధ్రావాళ్ళు అనే పేరుతో మమ్మల్ని అసభ్హ్యమైన పదజాలంతో తిట్టినతిట్లు బూతులు, బెదిరింపులు బలవంతపు వసూళ్లు, అడ్డమైన ఎందరితోనో పడిన/పడుతున్న ఎన్నెన్నో అవమానాలను అవహేళనలను దిగమింగుకుంటూ ఇంకెంత కాలం ఇలా రెండోశ్రేణి పౌరులుగా బ్రతకాలి ? మనకు సమర్ధవంతమైన ధీరులైన నాయకత్వం వద్దా? మనది కూడా తెలంగాణా రాష్ట్రమే, గత వంద ఏళ్లుగా, అత్యధికులు ఏభై నుండీ పాతికముప్ఫై ఏళ్లుగా తెలంగాణా ప్రాంతంలోనే స్థిరపడిపోయి ఇక్కడ అభివృద్ధిలో భాగస్వామ్యులమైపోయి తెలంగాణా ప్రజల్లో మనం.కూడా ఒకరిగా ఉంటూ కూడా కొంతమంది చూపిస్తున్న వివక్షత, విభజించి పాలించడం, కొందరు తమ రాజకీయ స్వార్ధానికి ప్రతిసారి కమ్మకులాన్ని టార్గెట్ చేస్తూ దానికి ఆంధ్రా అనే పదం జోడించి చేస్తున్న అనాగరిక రాజకీయాన్ని వివక్షతను అవమానాలను ఇంకెంతకాలం సహించాలి? భరించాలి? అనే ఆక్రోశం కమ్మసమాజంలో తీవ్రంగా ఉంది.

అందులో భాగంగానే మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అత్యధికమంది కమ్మవారు మల్కాజిగిరి పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డిని, చేవెళ్ల పార్లమెంటు స్థానంలో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  కొండా విసవేశ్వర్ర రెడ్డిని, సికింద్రాబాద్ నిజామాబాద్ పార్లమెంటు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను బలపరచారు,ఓట్లేశారు, ఇది బహిరంగ సత్యం.

హైదరాబాదు నగరంలో రాజకీయ నిర్ణయాత్మకశక్తి అయినటువంటి కమ్మసామాజికవర్గం పది అసెంబ్లీ నియోజకవర్గాలలో అత్యంత గణనీయమైన నిర్ణయాత్మకమైన ఓటు బ్యాంకు కలిగి రాబోయే హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో దరిదాపు నలభై డివిజన్లలో అత్యంత ప్రభావితం చూపించగలిగిన, గెలుపు ఓటములను నిర్ణయించగలిగిన శక్తి కమ్మకులానికి ఉంది.
నేడు తెలంగాణా రాష్ట్రంలో కమ్మసామాజికవర్గానికి రాజకీయంగా సముచితమైన స్థానము గౌరవమర్యాదలు లేవని తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మ శాసనసభ్యులు మీద కమ్మ సమాజంలో ఎవరికీ గుర్తింపు గౌరవంలేవు, ఎందుకంటే ఇప్పుడున్న కమ్మకులానికి చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ కూడా కులానికి చేస్తున్నది ఏమీలేదు, పైగా కంచే చేను మేసినట్లు సాటికమ్మవారినే వేధించడం తప్పుడుకేసులతో బెదిరించడం అనేది అత్యధిక శాతం కమ్మవారికి ఇప్పుడు ప్రధానసమస్య.

ఇప్పుడున్న శాసనసభ్యులు ఎంపీ మరియు ఇతర నాయకులు ఎవరూ కూడా ప్రభుత్వంలో కమ్మకులాన్ని పట్టించుకోకుండా, వీలైతే కులాన్ని తమ స్వార్ధానికి వాడుకోవాలని, కులాన్ని బానిసలుగా మార్చేసి కులాన్ని తాకట్టుపెట్టాలని చూస్తూ, ఇబ్బందులకు వేధింపులకు గురవుతున్న ప్రభుత్వఉద్యోగుల ఉన్నతాధికారుల సమస్యలను పరిష్కరించకపోవడం, నగరంలో కులానికి వెన్నుదన్నుగా నిలబడాల్సిన ఎమ్మెల్యేలు ఎంతసేపూ నగరంలో భూవివాదాల్లో సెటిల్మెంట్లులో ఉంటూ కమ్మవారికే కంట్లో నలుసులాగా తయారయ్యారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎంపీ మంత్రి వలన కమ్మకులానికి ఒనగూడేదేమి లేదనేది, వీళ్ళందరూ వాళ్ళ వ్యాపారాలకోసమే తప్పించి కమ్మకులానికి అండగా నిలబడి వీళ్ళచేస్తున్నది ఏమీలేదు అని అందరూ అనుకునే విషయం, అది సత్యం కూడా.
నగరంలో ఇప్పుడుడున్న ఇద్దరు కమ్మ శాసనసభ్యులు అప్పట్లో 2014 లో తెలుగుదేశం పార్టీ భిక్షతో, కమ్మకులంవలన, తరువాత 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో యాదృచ్చికంగా గెలిచినవాళ్లే తప్పించి సామాజిక గౌరవమర్యాదలతో వ్యక్తిగతగుర్తింపుతో గెలిచినవాళ్ళు కానేకాదు అని అందరూ అనుకుంటుంటారు.

నేడు తెలంగాణా ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలలో, ముఖ్యంగా తెలంగాణా రాష్ట్రంలో, హైదరాబాదు నగరంలో కమ్మవారికి వ్యూహాత్మకమైన గౌరవనీయమైన సమర్ధవంతమైన నాయకత్వం మరియు గుర్తింపు అవసరం ఎంతైనా ఉంది.రాబోయే హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో తెరాస పార్టీ ఆంధ్రా ప్రాంతానికి చెందిన కమ్మ సామాజికవర్గానికి రకరకాల ఆశలుచూపించి సినిమావాళ్లను పారిశ్రామికవేత్తలను కాంట్రాక్టర్లను మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో తిప్పుతూ ఓట్లు పొందాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.తద్వారా….తెలంగాణా రాష్ట్రంలో దరిదాపుగా 45 అసెంబ్లీ నియోజకవర్గాలలో, నగరంలో నలభై డివిజన్లలో అత్యంత ప్రభావితం చూపించగలిగిన నిర్ణయాత్మకమైన శక్తి అయినటువంటి కమ్మసామాజికవర్గాన్ని  ఆకట్టుకోవాలని, దగ్గరకుచేర్చుకోవాలని అలా చేయడంవలన రాష్ట్రంలో బీజేపీ దూకుడికి అడ్డుకట్ట వేయవచ్చని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు తెరాసలోనున్న కమ్మకులానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు ఉద్యోగులు గత చాలాకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, కమ్మకులానికి చెందిన చాలామంది అధికారులు వేధింపులకు గురవుతున్న సంఘటనలు, అలాగే కమ్మసామాజికవర్గం కూడా తెరాస పట్ల అంటీముట్టనట్లు ఉంటోందని తెరాస అధినాయకత్వం గుర్తెరిగి, కమ్మ ఎమ్మెల్యేలతోను తెరాస లోని ఒకరిద్దరు కమ్మ నాయకులతోను మీరు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బాగా పనిచేసి మీకమ్మకులాన్ని ప్రభావితం చేస్తే, మీకమ్మకులంలోని ప్రముఖులను కమ్మసంఘాల నాయకులను, యాక్టివిష్టులను తెరాసలో చేర్పిస్తే తెరాసను జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపిస్తే మంత్రివర్గ విస్తరణలో మరోక మంత్రిపదవితోపాటు, వేరే ఇతర కొర్పొరేషన్ పదవులు, వీలైతే ఒకటిరెండు ఎమ్మెల్సీలు, మీకు కావలసిన పనులు భూకేటాయింపులు భూవివాదాలపరిష్కారాలు చేసిపెడతామని ఆశచూపించినట్లు, మీరు మాదారిలోకి రాకపోతే మీకు అన్నివిధాలుగా ఇబ్బందులు తప్పవని తెరాస పెద్దలు హెచ్చరించినట్లు, అందుకోసం  కమ్మ ఎమ్మెల్యేలు ఎంపీ తెరాసలో ఒకరిద్దరు కమ్మముఖ్యులు ఛోటామోట నాయకులు అలాగే సినీపరిశ్రమలోని ముఖ్యులు పారిశ్రామికవేత్తలు బడాకాంట్రాక్టర్లు తెలంగాణా రాష్ట్రంలో కమ్మ కులాన్ని తెరాస వైపు ఆకట్టుకోవడానికి రంగంలోకి దిగినట్లు, కమ్మసంఘాల కార్తీకమాసం సమావేశాలను  అందుకు వేదికలుగా మార్చుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కొంతమంది కమ్మకులానికి చెందిన ముఖ్యులను కలుస్తూ వాళ్ళను మచ్చికచేసుకోవాలని, నయాన భయాన వాళ్ళదైన శైలిలో దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.బీజేపీ ఇప్పటివరకు హైదరాబాదు తెలంగాణా ప్రాంతాల్లో ఆంధ్రాప్రాంత ప్రజలను ఆకట్టుకునే ఎటువంటి ప్రయత్నాలు చేపట్టలేదు. బీజేపీ గత సంవత్సరం కాలంగా తెలంగాణరాష్ట్రంలో అత్యంత ప్రభావంతం చూపించగలిగిన కమ్మసామాజికవర్గాన్ని ఆకట్టుకోవాలని, ఆకులానికి చెందిన ప్రముఖులను కమ్మసంఘాల నాయకులను యాక్టివిష్టులను కలవాలని వాళ్ళ మద్దత్తు కూడగట్టాలని ఎటువంటి చర్యలు చేపట్టలేదు.అలాగే, బీజేపీ తన రాష్ట్ర కార్యవర్గంలో కూడా కమ్మసామాజికవర్గానికి సముచిత స్థానం గుర్తింపు ఇవ్వలేదని, సరైనవాళ్లకు పదవులు ఇవ్వలేదని కమ్మసామాజికవర్గానికి కొద్దిగా మనస్థాపం ఉన్నమాట వాస్తవం.

గతంలో తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలక పాత్రలో ఉంటూ క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మమేకమై వ్యూహాత్మకంగా నడిపించిన రాజ్యసభ సభ్యుడిగా ఉండి తరువాత బీజేపీలో చేరిన  మోహనరావుని వాడుకోవడంలో బీజేపీ వైఫల్యంచెందడం, కమ్మకులానికి చెందిన ముఖ్యుఆ నాయకులను చేర్చుకోలేకపోవడం, అటువంటి నాయకుల సమర్థతను వాడుకోవడంలో బీజేపీ వెనకబడిపోవడం, కమ్మకులం విషయంలోనూ హైదరాబాదు నగరంలో ఆంధ్రాప్రాంత ప్రజలను ఓటర్లను ఆకర్షించడంలో బీజేపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందనేది నిర్వివివాదాంశం.
బిజెపి కమ్మకులానికి చెందినవారిని పార్టీలోకి తీసుకురావడానికి రంగంలోకి దిగేసరికే తెరాస అన్నిరకాలుగా బీజేపీ వాళ్ళను కట్టడిచేయాలనే తీవ్రప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెసు పార్టీ గతకొంతకాలంగా చేష్టలుడిగిపోయి భవిష్యత్తు అంధకారంగా తయారవ్వడం వలన ఆపార్టీలో ఎవరు నాయకుడో వాళ్ళకే తెలియనట్లు కొట్టుమిట్టాడే పరిస్థితి నేడు దాపురించింది. అందువలన ఆపార్టీ వైపు కమ్మకులం వెళ్లే పరిస్థితి సమీప భవిష్యత్తులో లేనేలేదు.

అలాగే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకోబోయే నిర్ణయం కూడా చాలా ప్రభావం చూపించవచ్చు, తెలుగుదేశం పార్టీ గనక తన అభ్యర్థులను నిలబడితే తెలుగుదేశం పార్టీ ఎట్టిపరిస్థితుల్లోనూ ఒక్క డివిజన్ కూడా గెలవలేకపోయినా అది తెరాసకు అత్యంత లాభదాయకం అవుతుంది. అందుకోసం తెరాస నాయకులు తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యనాయకులను “అన్నిరకాలుగా మచ్చికచేసుకోవడానికి” రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే గనక తెలుగుదేశం తీసుకునే నిర్ణయం అయితే మాత్రం అది తెలుగుదేశం పార్టీకి పూర్తిగా అంతిమాఘడియలుగా అవ్వడం మరియు తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు జీవితంలో మరో అతిపెద్ద మచ్చగాను, తెలంగాణా సమాజానికి అతిపెద్ద ద్రోహిగాను మిగిలిపోవడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అన్నివిధాలుగా నష్టపోవడం మునిగిపోవడం ఖాయం.

ఈ పరిస్థితుల్లో సత్వరమే అన్నివిధాలా ఆలోచించుకోవాల్సింది సత్వరనిర్ణయాలు తీసుకోవాల్సింది బీజేపీ తెదేపాలు మాత్రమే.!ఇకపోతే, కమ్మకులం ఎప్పుడూ కూడా రాజకీయంగాను సామాజికంగాను వ్యాపారపారిశ్రామిక రంగాల్లోనూ విద్యలోను చాలా దూరదృష్టితో ఆలోచిస్తూ సరైన నిర్ణయాలు తీసుకోవడంలో అత్యంత చైతన్యవంతమైన కులం, కమ్మవారి ప్రస్తుత ఆలోచనలో ఏకవ్యక్తి మీద ఆధారపడి నడిచే రాజకీయ పార్టీలు అన్నీ కూడ తాత్కాలికమైనవేనని, అందుకు తమిళనాడులో జయలలిత తరువాత ఎఐఏడీఎంకే పరిస్థితి అందుకు ఉదాహరణ అని, కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణా రాష్ట్రంలో కమ్మకులానికి శాశ్వతంగా రాజకీయ మనుగడకు జాతీయపార్టీలే సరైనవనే నిర్ణయాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

                                                                                     – సువేరా