ప్రజాస్వామ్య వ్యవస్థలో భూమి యాజమాన్య హక్కు వ్యక్తులకు వుంటుంది. ఈ హక్కు be తల్లిదండ్రుల నుండి పిల్లలకు వారసత్వం ద్వారా బదిలీ అవుతుంది. ప్రభుత్వం నమోదుల శాఖ ద్వారా భూమి హక్కులను నమోదు చేస్తూ హక్కులకు చట్టబద్ధతను కల్పిస్తుంది. సమాజావసరాలకోసం కేటాయించిన భూమి ప్రభుత్వ యాజమాన్యంలో వుంటుంది. వ్యక్తులకు హక్కు గలభూమికి గుర్తింపు పత్రాలు అనగా యాజమాన్యహక్కు పుస్తకం, పట్టాదారు పాసుపుస్తకం ప్రభుత్వం నుండి పొందవచ్చు. ఆదాయపు శాఖ ఆధ్వర్యంలో గల ప్రభుత్వ యంత్రాగం క్షేత్రస్థాయిలో భూమి వివరాలు అనగా సర్వే సంఖ్యలు, హద్దులు చూపే పటాలను నిర్వహిస్తుంది.
ప్రభుత్వ యాజమాన్య భూములు
శ్మశానాలు, నదీగర్భాలు, చెరువులు, కాలువలు, సముద్రతీరాలు, రోడ్లు లాంటి పోరంబోకు భూములు ఎవరికీ కేటాయించకూడదు.ఈ తరహా ప్రభుత్వ భూములన్నీ నిషిద్ధ (ప్రొహిబిటెడ్) భూముల రిజిస్టర్ లో నమోదు చేస్తారు
అతుకుబడి ( అంసైన్డ్ పట్టా మంజూరు)
భూమిలేని నిరుపేదలకు అభ్యంతరం లేని ప్రభుత్వ భూమిని సాగుకు గానీ, ఇంటి స్థలంగా గానీ అతుకుబడి (అసైన్మెంట్) పట్టా ఇస్తారు. పట్టాలు ఇచ్చాక హద్దులు చూపాలి. వ్యవసాయ భూమి అయితే పట్టాదారు పాసు పుస్తకాలు కూడా ఇవ్వాలి. ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న పేదలకు 80 చదరపు గజాల మేర ఇంటి స్థలం క్రమబద్ధీకరిస్తారు.
చాలాచోట్ల ప్రభుత్వ భూమి బినామీ పేర్లతో అన్యాక్రాంతమైంది.ఆది నుంచి సక్రమంగా అడంగల్‌ నిర్వహించని చోట్ల ఈ భూమి అక్రమార్కుల వశమవుతుంది. చెరువుల కోసం ప్రభుత్వ అసైన్డ్‌ భూమితో పాటు చివరకు సిఆర్‌జెడ్‌ భూమిని సైతం వదల కుండా ఆక్రమించారు. పేదలకు పంచిన అసైన్డ్‌ భూమి పెద్దల పరమైంది. ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారు. అసైన్డ్‌ భూములను లబ్ధిదారులకు, ఎంతో కొంత వారికి, డబ్బు అప్పచెప్పి కాజేస్తున్నారు. గతంలో సొసైటీల పేర ప్రభుత్వం వేలాది ఎకరాలను పేదలకు పంచిపెట్టింది. ఇప్పుడా భూములన్నీలీజుల పేరుతో పెత్తందార్ల చేతుల్లోనే ఉన్నాయి. వీఆర్వోలు ప్రతి ఏడాది భూమి వివరాలను అడంగల్‌లో నమోదు చేయాల్సి ఉంది.ఆ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదు. సాగులో ఒక రైతు ఉంటే ప్రభుత్వ రికార్డులు పరంగా పట్టాదారు పసుపుస్తకం, ఆడంగల్ పరంగా మరొక్కరు ఉంటున్నారు. ఇలాంటివి ఆంద్ర రాష్ట్రాలలో ఎక్కువ శాతం కానొస్తాయి.  రైతులకు అవగాహన లేకుండా  అసైన్డ్ భూమిని కొనుగోలు పట్టాదారు పసుపుస్తకం  పొందడానికి  తహశీల్దార్ కార్యాలయాలు చుట్టూతిరుగుతూ,  నేటికి మధ్యవర్తులను నమ్మి డబ్బు అప్పజేపుతున్నారు మోసపోతున్నారు.
భూ వినియోగ మార్పిడి
వ్యవసాయ భూములు నివాస ప్రాంతాలుగా మారుతున్నాయి.  వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించాలంటే భూ మార్పిడికి మూల విలువలో 9 శాతం చెల్లించాలి. సంబంధిత ధ్రువీకరణ అధికారి నుంచి భూ మార్పిడికి అనుమతి తీసుకోవాలి. ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఇల్లు కట్టుకుంటే మూల విలువలో 10 శాతంతో పాటు 50 శాతం అపరాధ రుసుంకూడా విధించవచ్చు. కొనుగోలు చేసిన వారే ఈ పన్ను చెల్లించాలి.
ఆర్‌వోఆర్ చట్టం
భూములపై నిర్దిష్టమైన హక్కులు కల్పించాల్సిన  రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్‌వోఆర్) చట్టం కిందకు తీసుకురావాలని నిర్ణయించారు. భూములకు కొలతలు సర్వే ద్వారా  అలాగే ఆకాశం నుంచి తీసిన ఫొటోలను, క్షేత్రస్థాయిలోని వాస్తవ కొలతలను సమన్వయపర్చి యజమానులకు హక్కులను కల్పించటమే భూ భారతి లక్ష్యం. రిజిస్ట్రేషన్లలోని మోసాలను అరికట్టటానికి, భూములకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ ఒకే విదంగా నిర్వహించుకొనేందుకు ఇది ఉపయోగపడుతుంది. భూ భారతి లక్ష్యాలను సాధించాలంటే భూమి హక్కుల(ల్యాండ్ టైటిలింగ్) చట్టం అవసరం. సర్వే శాఖ అందజేసిన కొలతల్లో తేడాలు ఉన్నట్టుగా భావిస్తున్న రైతు నోటీసును అందుకొన్న వెంటనే తన అభ్యంతరాలను చెప్పాలి. అలా చేయకపోతే వివరాలు ఆర్‌వోఆర్ రిజిస్టర్‌కు ఎక్కుతాయి. అప్పుడు సవరణలు కావాలంటే రైతు సివిల్‌కోర్టును ఆశ్రయించక తప్పదు
హక్కుల రికార్డు
బడుగుల స్థలాలు, దేవుడి మాన్యాలు, వక్ఫ్‌ భూములు, చివరకి ,రుద్రభూములకు రక్షణ కల్పించటం కోసం రెవెన్యూ యంత్రాంగం ఆధీనంలో ఎఫ్‌ఎంబీలు.. సర్వే నంబర్లను చూపే ఆర్.యస్.ఆర్ పుస్తకాలు ఉంటాయి. ప్రభుత్వ స్థలం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళకుండా వాటిలో ప్రభుత్వ స్థలమని బోర్డులు పెడతారు. స్థలం దక్కించుకోవడానికి అవతలపార్టీవారు కోర్టు కెళ్ళినా ఈరికార్డులు ఆధారాలుగా చూపించవచ్చు.  డి.పట్టా భూములు, ప్రభుత్వ అసైన్డు, దేవాదాయ స్థలాలు, చెరువులు ,చేతులు మారకుండా సర్వే నంబర్‌ రికార్డులు, ఎఫ్‌ఎంబీలు, అడంగళ్ళు కీలక ఆధారంగా ఉంటాయి.ఈ రికార్డుల నిర్వహణ సర్వేయర్లు చేస్తుండగా భూ వివాదాల నిమిత్తం దరఖాస్తులు వస్తే వాటిని తహసీల్దారులు పరిష్కరిస్తారు. గ్రామ స్థాయిలో వీఆర్వో లు ఏడాదికోసారి అడంగళ్లలో మార్పులు పక్కాగా నమోదు చేయాలి. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలలో చెరువులు కుంటాలకు కబ్జా చేసి పట్టాలు పొందడంతో పాటు  పట్టాదారు పసుపుస్తకాలు కూడా పొందారు. అమ్మకాలు కోనుగోలు కూడా జరుగుతున్నాయి.
ఆక్రమణలు
ప్రభుత్వ భూములకు సహజంగా రక్షణ ఉండదు. ప్రభుత్వ, ఫారెస్ట్‌ భూములపై ఆక్రమణల పరంపర కొనసాగుతుంటుంది. పేదలు గుడిసెలు వేస్తారు. స్థలం సొంతం చేసుకోవాలని ఉద్దేశ్యంతో ప్రభుత్వ భూమి ఎక్కడ కనిపిస్తుందొనని అన్వేషిస్తూ ఆక్రమించడానికి ఉపక్రమిస్తారు. ఎక్కడైనా ప్రైవేటు పట్టా భూముల్ని ఆక్రమిస్తే అది తెలుసుకున్న యజమానులు వారి స్థలాల వద్దకు చేరుకొని ఆక్రమిత దారులతో వాగ్వివాదం పెట్టుకొని వారి స్థలాలకు చుట్టు పునాదులు కంచెలు నిర్మించుకుంటారు. కొందరు భూబకాసురులు ప్రభుత్వ భూమి పట్టాభూమి అని కూడా చూడకుండా దర్జాగా కబ్జా చేసుకుంటారు. చివరికి శ్మశాన వాటికలోని సమాదులను సైతం వదలకుండా ఆక్రమించుకొని పాకలు, డేరాలు వేసి ఆక్రమించుకుంటారు. ఆక్రమించుకున్న వారికే ఈ స్థలాలు చెందుతాయని ప్రచారం చేస్తారు. సొంత ఇళ్లు వ్యవసాయ భూములు ఉన్న పెద్దలు సైతం జాగాలు ఆక్రమణ చేస్తారు. రాజకీయ నాయకులే వెనుకుండి ఈ పని చేస్తున్నారు.
ప్రభుత్వ స్థలాల్లో ప్రార్థనా మందిరాలు
ప్రభుత్వ స్థలాల్లో నిర్మితమై రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న మతపరమైన కట్టడాలు, ప్రార్థనాస్థలాలను తొలగించేందుకుగాను సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రప్రభుత్వం ఇటువంటి కట్టడాలను తొలగించాలంటూ జిల్లాల అధికార యంత్రాగాన్ని ఆదేశించింది.ఇటువంటి కట్టడాలను మూడు విభాగాలుగా విభజించాలి. మొదటి విభాగంలో రెండేళ్ళలోపు నిర్మించిన వాటిని చేర్చి వెంటనే వాటిని తొలగించాలి. 2, 3 విభాగాల్లో రెండేళ్ళకు పూర్వం నిర్మితమైన వాటిని గుర్తించి తొలగించాలి. ప్రజా ప్రతినిధులు, స్థానికులు, మతపెద్దలతో సమావేశమై ఆయా కట్టడాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, వారి అనుమతితో వాటిని వేరేచోట నిర్మించేలా చర్యలు తీసుకోవాలి.
భూ విక్రయాలలో మోసాలు
భూముల విలువలు పెరగడంతో భూ విక్రయాలలో మోసాలు అధికమవుతున్నాయి. కొందరు తప్పుడు రికార్డులతో లేని భూమిని విక్రయించి సొమ్ము చేసుకుంటారు. మరొకరు వక్ఫ్ భూమిని అమ్మి మోసగిస్తున్నారు. ఒకటే భూమిని ఇద్దరు ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేసిన వారూ ఉన్నారు. ఒకరికి భూమిని అమ్మి అదే భూమిని బ్యాంకులో తాకట్టు పెట్టిన మోసం మరొకటి. కొంత ప్రభుత్వ భూమితో కలిపి ప్రైవేటు భూమిని విక్రయిస్తారు. భూమి కొనుగోలు చేసినవారు రెవెన్యూ రికార్డులలో తమ పేర్లు రాయించుకోకముందే సంబంధిత భూమి ఇతరుల ఆధీనంలో ఉంటుంది. ఒకే భూమిని రెండవసారి విక్రయించి మోసం చేస్తారు. అంటే ఇద్దరికి ఒకే భూమిని రిజిస్ట్రేషన్ చేసినట్లు. సరైన యజమానులు లేరని తెలుసుకున్న భూమికి నకిలీ పత్రాలు తయారు చేసి ఆ భూమిని అమ్మి రిజిస్ట్రేషన్ చేస్తారు. నకిలీ డాక్యుమెంట్లను బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకుంటారు. కొంతమంది డబ్బు తీసుకొని భూమిని రిజిష్టర్ చేయడానికి నిరాకరిస్తారు. కొందరు జీపీఏ ఉందంటూ క్రయవిక్రయాలు నిర్వహిస్తారు. అందులో అసైన్డ్ భూమి ఉంటే బాధితుడు కోర్టుకెక్కాల్సిందే.  కోర్టుకెక్కినా సత్వర పరిష్కారం లభించక సతమతమవుతున్నారు.  అందువల్ల భూమి కొనేముందే ఎవరైనా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది.  ఆస్తుల అక్రమ రిజిస్ట్రేషన్ల నిరోధానికి చట్ట సవరణ జరగాలి. మోసపూరిత రిజిస్ట్రేషన్లు ఐజీ రద్దు చేయలేరు. రిజిస్ట్రేషన్ సంబంధ వివాదాలపై కక్షిదారులు సివిల్ కోర్టుకే వెళ్లాల్సి ఉంటుంది. కొందరు ఒకే ఆస్తిని ఒకరికి మించి అమ్ముతూ కొన్నవారి పేర రిజిస్ట్రేషన్లు చేయిస్తూ వచ్చారు. ఇప్పటికీ ఇలాంటి మోసపూరిత అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు సాగుతూనే ఉన్నాయి. ఆస్తికి వారసులమంటూ నకిలీ వ్యక్తులు రావడం, ఫోర్జరీ పత్రాలను చూపించడం, ఆస్తి హక్కుదారు చనిపోయినట్టుగా పేర్కొనడం లాంటి వివిధ పద్ధతుల్లో ఇవి జరుగుతున్నాయి. స్టాంపు రుసుం తీసుకొని దస్తావేజులకు రిజిస్ట్రేషన్లు చేయటమే తప్ప పత్రాలు అసలైనవా, నకిలీవా అనే అంశాలు పరిశీలించే అధికారమేదీ ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్‌కు లేదు. ముఖ్యంగా భవిష్యత్తులో ధర పెరిగితే అక్కరకొస్తుందనే ఉద్దేశంతో కొనుక్కొని ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉంటున్నవారి స్థలాలెన్నో అన్యాక్రాంతమయ్యాయి.
కంప్యూటరీకరణ
భూ లావాదేవీల నమోదుని సౌకర్యవంతం చేయటానికి, కార్డ్ కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్టుమెంట్ అనబడే కంప్యూటరీకరణ విధానం అమలులోకి వచ్చింది. కార్డ్ ను రెవిన్యూ శాఖతో అనుసంధానం చేశారు దీనివలన .తహసీల్దారు కార్యాలయాల్లోని తాజా భూ వినియోగ సమాచారం, నిషేధించిన ఆస్తుల వివరాలు, వ్యవసాయేతర ప్రయోజనాలకు మార్పుచెందిన భూముల వివరాలు లాంటి విషయాలన్నీ తెలుస్తాయి.
మీ సేవ వ్యవస్థ ద్వారా ఆస్తులను కొనే ముందు పరిశీలించుకొనే”ఇన్‌కంబరెన్స్(ఈసీ) పత్రాలు పొందడం సులభమైంది. మండల రెవిన్యూ అధికారి, ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1985 లో మండల వ్యవస్థ ఏర్పడింది. పూర్వం ఉన్న తాలూకాలను చీల్చిమండలాలను ఏర్పాటు చేశారు. ఆ తాలూకాలకు ఉన్న తహశీల్దార్లే ఈ ఎమ్మార్వో లుగా ప్రసిద్ధి చెందారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2007 లో ఈ ఎమ్మార్వో లను మళ్ళీ తహసీల్దార్లుగా మార్చింది. పేరు ఏదైనా చేసే పని ఒకటే.
తహసీల్దార్ అజమాయిషీ లో సంబంధిత ప్రాంతాల భూమి రికార్డులు నిర్వహించబడతాయి.  భూమి హక్కు వివరాలు డిజిటల్ రూపంలోకి మార్చబడి అంతర్జాల ద్వారా అందుబాటులో వున్నాయి. [ [3].మండల రెవిన్యూ అధికారి పర్వేక్షణలో ఉన్న గ్రామాలను రెవెన్యూ గ్రామాలు అంటారు
భూమి రికార్డుల పదజాలం
రీ సెటిల్‌మెంట్‌ రిజిష్టర్‌ (ఆర్‌ఎస్‌ఆర్‌) ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం భూమి సేకరణకు ఇదే ఆధారం. ఆర్‌ఎస్‌ఆర్‌ రిజిష్టర్‌ల్లో ప్రభుత్వ భూమి, ప్రైవేట్‌ భూమి(వ్యక్తులు), ఈనాం భూములు, దేవదాయ, వక్ఫ్‌ భూములు, వాగులు, వంకలు లాంటి వివరాలు ఉంటాయి. ఈ సమాచారం వీఆర్‌ఓ, తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలతోపాటు జిల్లా స్థాయిలో ఏడీ కార్యాలయంలో ఉంటాయి.
1బీ రికార్డు
దీనిప్రకారం ఒక రైతుకు రెవెన్యూ విలేజ్‌లో ఏఏ సర్వే నంబర్‌లో ఎంత విస్తీర్ణం భూములు ఉన్నాయో తెలుస్తుంది. పట్టాదారు పాస్‌ పుస్తకంలో ఉన్న ఖాతా నంబరు, అనుభవదారుడు వివరాలు కూడా వుంటాయి. గతంలో దీనిని 10 (1) అడంగల్ అని పిలిచేవారు.
రికార్డ్‌ ఆఫ్‌ రైట్‌ (ఆర్‌ఓఆర్‌)
భూమి యాజమాన్య హక్కుపై వివాదం తలెత్తినప్పుడు రికార్డ్‌ ఆఫ్‌ రైట్‌(ఆర్వోఆర్‌)ను ప్రామాణికము. దీనిలో ప్రభుత్వ భూములు, బంజరు భూములు, వక్ఫ్‌ బోర్డు భూముల వివరాలుంటాయి.
డైగ్లాట్‌
గ్రామ రెవెన్యూ రికార్డులన్నింటికీ మూలాధారం ఇది. ప్రతి గ్రామంలో సర్వే సెటిల్‌మెంటు భూమి వివరాలు నమోదు చేస్తారు. అన్ని రకాల భూములు, వాటి సర్వే నంబర్లు, విస్తీర్ణం, వాటి వర్గీకరణ, శిస్తు వివరాలు వుంటాయి.
ఆక్రమిత భూమి రిజిష్టర్ (అడ్‌వర్స్‌ పొసెషన్‌)
భూమిపై హక్కు ఉన్న వ్యక్తి అనుమతి పొందకుండా ఆ భూమిని స్వాధీనంలో(వాస్తవంగా, శాంతియుతంగా, బహిరంగంగా) ఉంచుకునే దానిని అడ్‌వర్స్‌ పొసెషన్‌ అంటారు. పట్టా భూమి 12 సంవత్సరాలు, ప్రైవేట్‌ భూమి 30 సంవత్సరాలు స్వాధీనంలో ఉంటే సివిల్‌ కోర్టు ద్వారా యాజమాన్య హక్కులు పొందవచ్చు.
అజమాయిషీ
గ్రామ రెవెన్యూ అధికారి నిర్వహించే లెక్కలను తనిఖీ చేయడాన్ని అజమాయిషీ అంటారు. వీఆర్‌ఓ, మండల ఆర్‌ఐ పొందుపరిచిన లెక్కల్లో వివరాలను కొన్నింటినైనా డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్‌ తనిఖీ చేయాలి. అలా తనిఖీ చేసిన వివరాలను గ్రామ లెక్క నం.3లో నమోదు చేస్తారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రక్రియ ఇది.
ఆవాదీ గ్రామకంఠం
గ్రామంలో ప్రజలు నివసించే భూమిని ఆవాది అని గ్రామ ఉమ్మడి స్థలాన్ని గ్రామ కంఠంమని పిలుస్తారు.
అగ్రహారం
బ్రాహ్మణులకు శిస్తు లేకుండా లేదా రాయితీ శిస్తుతో గ్రాంటుగా వచ్చిన గ్రామం లేదా గ్రామంలోని కొంత భాగాన్ని అగ్రహారం అంటారు
ఫసలీ
ఏటా జూలై 1 నుంచి మరుసటి ఏడాది జూన్‌ 30వ తేదీ వరకు మొత్తం 12 నెలల పంట కాలాన్ని బట్టి దీనిలో వివరాలుంటాయి. ఇందులో అడంగల్‌లో నమోదైన వివరాలు ఉంటాయి. ఏ ఏటికాఏడు భూములు అమ్మకాలు కొనుగోళ్లు జరిపినపుడు, ప్రస్తుత రైతు పేరును కొట్టివేసి కొత్త రైతు పేరును చేరుస్తారు. భూమి కొనుగోలుదారులు కొనుగోలు పత్రాలను తీసుకొని రెవెన్యూ అధికారులను సంప్రదించి అడంగల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి.
ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ బుక్‌ (ఎఫ్‌ఎంబీ)
దీనిలో అన్ని సర్వే నంబర్ల పటాలు వాటి నిర్ధిష్ట కొలతలతో సహా ఉంటాయి.
జమాబందీ
జమాబందీ అంటే ప్రభుత్వానికి రావాల్సిన భూమి పన్ను, నీటి పన్ను ఇతర బకాయిలు సక్రమంగా లెక్క కట్టడం. మండల స్థాయి అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అనే పరిశీలన. రైతులు తమ సాధకబాధకాలను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడానికి కూడా ఇదే వేదిక. ఏడాదికి ఒకసారి కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, ఇతర డిప్యూటీ కలెక్టర్లు పరిశీలిస్తారు.
అడంగల్‌ (పహాని)
ప్రతి ఏటా సాగు భూముల వివరాలు నమోదు చేసే రిజిష్టరు. ఆంధ్రప్రదేశ్ లో అడంగల్‌ అని, తెలంగాణలో పహాని అని అంటారు. అడంగల్‌లో రైతుల పేర్లు నమోదై ఉంటే ఆ భూమిపై పూర్తి హక్కు వున్నట్లే. భూముల క్రయ విక్రయాలు చేయాలంటే ఇదే ప్రామాణికం. గతంలో ‘గ్రామ లెక్క నంబర్‌.
జిల్లా,మండల,రెవిన్యూ గ్రామంలో భూముల సర్వేతోపాటు, సర్వేరాళ్లు, సరిహద్దులు, రికార్డుల నిర్వహణ కీలకమైన బాధ్యత. వ్యక్తుల మధ్య భూవివాదాలు తలెత్తినప్పుడు రెవెన్యూ చట్టాలపై వారికి అవగాహన కల్పించి గ్రామస్థాయిలోనే పరిష్కరించుకునేలా న్యాయ సహాయకుడిగా పనిచేసేలా కొత్త బాధ్యతను  గ్రామ సర్వేయర్లకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అప్పగించింది.
1)సర్వే మరియు ల్యాండ్ రికార్డ్స్ విభాగం:-
1978సం.లో స్థాపించబడిన రెవెన్యూ శాఖ తరువాత సర్వే మరియు ల్యాండ్ రికార్డ్స్ పురాతన విభాగం. నిజాం కైండ్ సర్ సాలార్జంగ్ పాలక కాలంలో ఈ విభాగం స్థాపించబడింది. ప్రతి రాయిని తెలుసుకోవటానికి, అతను ఎంత భూమిని సాగు చేస్తున్నాడో మరియు పన్నులను నిర్ణయించడానికి భూమిని వర్గీకరించడానికి వివరణాత్మక భూ సర్వే నిర్వహించడం విభాగం ఏర్పాటు యొక్క ఉద్దేశ్యం. 1900 నుండి 1915 మధ్య కాలంలో మొట్టమొదటి సరిగా సర్వే జరిగింది, 1930 నుండి 1950 మధ్యకాలంలో 2 వ (పునర్విమర్శ) సర్వే జరిగింది, అప్పటి నుండి ఇప్పటి వరకు మేము పునర్విమర్శ సర్వే రికార్డులను ఉపయోగిస్తున్నాము. కాలక్రమేణా దాదాపు 80% రికార్డులు టోన్డ్ కండిషన్ (శిధిలావస్థ) పొందాయి. భూ రికార్డులను సక్రమంగా పర్యవేక్షించడానికి, నవీకరించబడిన సాంకేతిక పరిజ్ఞానంతో మొత్తం భూములను తిరిగి నిర్వహించడం అవసరం.
2)విధులు:-
ల్యాండ్ రికార్డ్స్ నిర్వహించడం, తప్పిపోయిన సర్వే రాళ్లను తిరిగి పరిష్కరించడం, పట్టా మరియు ప్రభుత్వం, ల్యాండ్ సబ్ డివిజన్ పని, ల్యాండ్ రికార్డ్స్‌లో మార్పులను చేర్చడం.
3) విధులను అమలు చేయడంలో సమస్యలు:-
గొలుసులతో సర్వే చేయడం ద్వారా పాత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాము మరియు మేము వేసవి కాలంలో (క్యాలెండర్ సంవత్సరంలో 4 నెలలు) మాత్రమే సర్వే నిర్వహించగలరు, పంట సీజన్లో రైతులు క్షేత్రాలలో గొలుసు సర్వేను అంగీకరించరు. కాబట్టి పై కారణాల వల్ల తహశీల్ధార్ కార్యాలయాలలో చాలా సరిహద్దు పెండెన్సీ ఫైళ్లు పేరుకుపోయినవి.  పట్టణీకరణ కారణంగా భూమి విలువలు పెంచబడ్డాయి మరియు భూ యజమానులు తమ భూభాగాలను తెలుసుకోవడానికి మరిన్ని పిటిషన్లు దాఖలు  చేస్తున్నారు. కానీ మా సర్వేయర్లు (గొలుసు సర్వేను ఉపయోగించడం ద్వారా) నిర్ణీత సమయంలో ఆ సమస్యలను పరిష్కరించే స్థితిలో లేనందున, రైతుల భూముల సరిహద్దులను చూపించడానికి రెవిన్యూ కార్యాలయాల వద్ద తిరుగుతున్నా వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. భూమి పంపిణీలో సర్వే కీలకమైనది,  భూసేకరణ పనులలో లక్షలాది ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. నీటిపారుదల ప్రాజెక్టులు, రోడ్లు మరియు ఇతర అభివృద్ధి పనుల నిర్మాణం కోసం. లొకేషన్ వర్క్ నుండి పోస్ట్ అవార్డు కేసులు (ఇన్ కార్పొరేషన్ మార్పులు) పని వరకు, చేయవలసిన వేగవంతమైన మరియు ఖచ్చితత్వపు పనుల కోసం విభాగం జాగ్రత్త తీసుకోవాలి. కానీ చైన్ సర్వే మరియు తక్కువ సాంకేతిక నైపుణ్యం  ఉన్న వాటిని  సర్వేయర్లు  ఉపయోగించడం వలన వేగవంతమైన మరియు ఖచ్చితత్వపు పనిని సాధించడం కష్టమవుతుంది.
4)సేవా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి
జిపిఎస్, ఇటిఎస్ మరియు డిజిపిఎస్ పరికరాలను అందించడం ద్వారా ప్రభుత్వం సాంకేతిక సహకారాన్ని అందించగలిగితే,  పిటిషన్లు / ప్రభుత్వ సంబంధిత పనులను వేగంగా భూమి ఖచ్చితత్వంతో  ఏడాది పొడవునా సర్వే చేయవచ్చు. CAD సాఫ్ట్‌వేర్‌లోని అన్ని మ్యాప్‌లను మాత్రమే గీయడానికి సర్వే సిబ్బందికి ఆటో  టెక్నాలజీపై శిక్షణ అవసరం. ఎందుకంటే ఇది వేగవంతమైన, ఖచ్చితత్వంతో పనిచేయడానికి సహాయపడుతుంది మరియు సాఫ్ట్‌ కాపీ వలె శాశ్వత రికార్డుగా ఉంచబడుతుంది. పైన పేర్కొన్న విషయాలు వాస్తవానికి లభిస్తే,  ఇప్పుడు ఒక రోజు అవసరం ప్రకారం, భూమిపై పనిచేసే అన్ని ఇతర విభాగాలకు సహాయపడే భూ ప్రణాళిక రంగానికి సరిహద్దులను పరిష్కరించడానికి  శాఖ పద్ధతిని మార్చాలి.
5)రి సర్వే చెస్తే సివిల్ కేసులు పరిష్కరించబతాయి
సర్వే రాళ్లు తొలగించి  కబ్జాలు చేయడం మరికొందరు హద్దులు మించి  కాలక్రమేనా జరుగుతున్న వస్తుంది.   దీనితో సర్వే సమస్యలు మొదలైనాయి. ఇలాంటి భూముల్లో నిర్మాణాలు చేపట్టడం ద్వారా సర్వే చేయుటకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సర్వే నిర్వహణ జరగాలి అప్పుడే సగం సివిల్ కేసులు పరిష్కరం అవుతాయి. అదేవిధంగా రెవెన్యూ అధికారులు అవినీతి బాగా పెరిగింది. ఆన్లైన్ విధానం వచ్చిన తర్వాత ఒకరి భూములు ఒకరికి ఆన్లైన్ చేయడం గ్రామీణ ప్రాంతాల్లో రైతుల్లో గొడవలు ప్రారంభం అవుతున్నాయి.  ప్రభుత్వ భూములు పేదల అనుభవంలో సాగు చేసుకుంటూ ఉంటే, తాసిల్దార్ లు డబ్బులు తీసుకొని, అసైన్మెంట్ తో సంబంధం లేకుండా బోగస్ ఆన్ లైన్ చేస్తున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులు అండగా ఉండి తప్పుడు పనులు చేయిస్తున్నారు. తప్పు చేసిన తాసిల్దార్ లను ట్రాన్స్ఫర్ తో సరిపెడుతున్నారు. సస్పెండ్ చేసి, ఉద్యోగం తొలగిస్తే, వచ్చే అధికారులు విజయ్ తో పని చేస్తారు. పేద ప్రజలు పలు సమస్యల పరిష్కారం కాక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అవినీతి అధికారులను, ఎ సి బి ,లకు  పట్టించాలి.పేద ప్రజలందరూ ఐక్యమై పోరాటం చేయాలి.

– సిహెచ్ .చంద్రశేఖర్ 
 (సిఐటియు కడప జిల్లా కార్యదర్శి)

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner