పోలవరంపై అవినీతి చేసిన తెదేపాపై చర్యలెందుకు తీసుకోరు?

507

– రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సోమువీర్రాజు పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంచి దోచుకున్న తెదేపా అవినీతిని ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు బయటపెట్టదని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెరగడానికి, ప్రాజెక్టు భూములు, వాటి ధరల అంచనాలు పెంచడమే ప్రధాన కారణమని అన్నారు. లేని భూములు ఉన్నట్లు చూపించడం, ప్రభుత్వ భూములకు పట్టాలిచ్చి వాటికి పరిహారం ఇప్పించడం, గతంలో పరిహారం ఇచ్చినవాటికి మరల నమోదుచేసి 3 రెట్లు పెంచి ఇచ్చినట్లు ఆరోపించారు. ఇలా తెదేపా ప్రభుత్వం చేసిన అవినీతి వల్ల పోలవరం ప్రాజెక్టు అంచనాలు బాగా పెరిగి పోయాయని అన్నారు. కాని పోలవరానికి వ్యతిరేకమని భాజపాపై తనకు అనుకూల మీడియాతో నిందలేస్తూ ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నట్లు విమర్శించారు. ఆయన మాటలు ఇలా…

చంద్రబాబుకు అనుకూలంగా ఉండేలా ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాధాకృష్ణ పోలవరం గురించి అసత్యాలు రాస్తున్నారు. పోలవరం పైన, ముంపు మండలాల పైన రాధాకృష్ణకు అవగాహన లేదు. “ఆ 7 ఏడు మండలాల దారెటు? విలీన

మండలాలపై కొత్త ప్రశ్న. ఈ మండలాలను కెసీఆర్ మరల అడగవచ్చా? ఇలాంటి రాతలు రాస్తున్నారు. ఎంత దారుణమైన రాతలు, కూతలు ఇవి. ఈ మండలాలు తూర్పు గోదావరి

జిల్లాలో ఉన్నాయి. భద్రాచలం ఎపి పరిధిలో ఉ ంది. చర్మ, వాజేడు, దమ్ముగూడెం తూర్పుగోదావరి

జిల్లాలో ఉన్నాయి. ఇవి పది మండలాలు ఏపీకి చెందినవి. ఈ మండలాల గురించి చంద్రబాబు, జగన్ ఒక్కముక్క అయినా మాట్లాడలేదే? భాజపానే మాట్లాడింది. భద్రాచలం ఎపీలోనే ఉండాలని,

నేను మా నాయకుడు సూర్యనారాయణరాజు డిమాండ్ చేశాం. పోలవరం ఎత్తు తగ్గించాలని తెలంగాణలో అన్ని పార్టీలు డిమాండ్ చేశాయి. కేసీఆర్ మొదట ఈ 7 మండలాలను తూ.గో.

జిల్లాకు వదిలేసి మిగిలిన 53 మండలాలు చాలని చెప్పారు. కాని పోలవరాన్ని బేస్ చేసుకుని ముంపు మండలాల్లోని రాయలసీమకు నీరిచ్చే దుమ్ముగూడెం మండలాన్ని కావాలని కేసీఆర్ తిరిగి డిమాండ్ చేశాడు. ఒక్క భాజపా తప్ప ఎవరూ దమ్ముగూడెం కావాలని డిమాండ్ చేయలేదు. దమ్ముగూడెం ప్రాజెక్టును హరీష్ రావు పరిశీలిస్తే… ఎపి నుంచి ఏ నాయకుడు అటు వెళ్ల లేదు. అక్కడ 430మెగావాట్లలో ముప్పై పైసలు యూనిట్ తయారవుతుంది. మరో 230 మె.వా.పవర్ కూడా ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉందని తెలుసుకున్నాం. దానిని మేం

ప్రతిపాదిస్తే ఇప్పటి ప్రభుత్వం ఆ 230 మె.వా. పెంపుకు అనుమతులు ఇచ్చింది. ఈ ప్రాజెక్టు విలువ తెలుసుకున్న హరీష్ రావు సిఫార్సుల మేరకు కెసీఆర్ దుమ్మగూడెం కోసం అన్ని మండలాలు కావాలంటున్నారు. శబరి నుంచి నీరు, దమ్ముగూడెం వల్ల రాయలసీమకు నీరు వస్తాయి. భద్రాచలం, మూడు మండలాలు కేసిఆర్ ఇచ్చేమంటున్నాడు. ఆ మూడు మండలాలపై కాళేశ్వరంతో పాటు పలురకాల ప్రాజెక్టులు కడితే బాగా నీరు వస్తున్నాయి. మన ముఖ్యమంత్రి ఒక కాలువను వెడల్పు చేస్తామంటే అన్ని పార్టీలు కలవాలి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వారే ఎప్పుడూ ఇరిగేషన్ మంత్రిగా ఉండేవారు. భద్రాచలం ఎపీలోనే ఉండాలని నేను డిమాండ్ చేశా. దీనిపై ఇంత విస్తృతంగా భాజపానే మాట్లాడింది. విభజన సమయంలో ఇన్ని చేస్తే రాధాకృష్ణ తాబేదారుగా మాట్లాడుతున్నాడు. ఆయనకు దమ్ముంటే ఈ మండలాలతో పాటు భద్రాచలంతో సహా ఆ మండలాలను ఎపీలో కలపాలి. ఇవన్నీ సంబంధం లేని రాతలు, ఎత్తుగడలు రాస్తున్నారు. తెలంగాణ ఉద్యమం కోసం రాజ్యసభలో చర్చ జరుగుతున్నపుడు తెలంగాణ ఎంపీలు పోలవరం కట్టరాదని నినాదాలిచ్చారు. పోలవరం ముంపు మండలాలు ఎపీలో కలవలేదు. ఇవి కలవకుంటే పోలవరం కట్టడం అసాధ్యమని ముందుగా భాజపానే గుర్తించింది.

ఈ ఏడు ముంపు మండలాలు కలిపేందుకు ఎంతో కృషిచేశాం. ఆ కృషి ఫలితంగానే మే 26న జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీర్మానించి 27న ఆర్డినెన్స్ తెచ్చారు. ఆ ఏడు మండలాలు, ఏపీలో చేర్చాలనేదానిపై చంద్రబాబుకు అవగాహన లేదు. కాని తానే ఆ ఏడు మండలాలు కావాలని ప్రయత్నం చేసినట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారు. పోలవరానికి ఇంత చేస్తే ఈ రాతలు ఏంటీ? ఈ ప్రభుత్వమైతే ఎత్తుతగ్గిచేశారు… నిధులు తగ్గించేశారంటున్నారు. పోలవరం ప్రాజెక్టుకు వైయస్ అంకురార్పణ పారంభిస్తే, భాజపా నిర్మిస్తుందని మేం మొదటి నుంచి చెబుతున్నాం. కాని మంత్రి అనిల్ మాత్రం వైయస్ ప్రారంభిస్తే.. జగన్ పూర్తి చేస్తాడు అంటున్నారు. ఇది జాతీయ ప్రాజెక్టు. మోదీ సహకారం ఉందని చెప్పడం లేదు. ఆయనకు మాట పడిపోయిందా? ఈ రోజు కేంద్రం నిధులిస్తుందని ఎందుకు చెప్పరు? కేంద్ర మంత్రులను కలుస్తారు? ఇటీవల రూ.3 వేల కోట్లు ఇస్తే తీసుకున్నారు. కాని మేమే కట్టేస్తాం అంటున్నారు. మీరు కట్టడమేంటి? ఇది కేంద్ర ప్రాజెక్టు. 2014న చంద్రబాబు 28 వేల కోట్లకు ఒప్పుకున్నారు. దానిపై తీర్మానం చేశారు. కేంద్రతీర్మానంలో తెదేపా మంత్రులున్నారు. దానిని వారు అంగీకరించారంటున్నారు. మరి రూ.48 వేల కోట్లు ఎందుకు పెరిగిందో పరిశోధించరెందుకని? ఈ ప్రభుత్వం ఎందుకు దీనిపై విచారించదు. చంద్రబాబు పెంచేసిందానిని మీరు బుక్కేయాలనుకుంటున్నారా? కుడి, ఎడమ మెయిన్ కెనాల్ లో గతంలోను, ఇప్పుడు కాంట్రాక్టర్లను మార్చారు.

ఎత్తిపోతల పథకంలో మెగా కృష్ణారెడ్డి బకెట్ మట్టి తోడితే రూ.3 లక్షలు ఇచ్చారు. అలాంటి కృష్నారెడ్డి ఇప్పుడు ఆణిముత్యం అయ్యాడు. 2014కు ముందు రూ.5 కోట్ల రైట్ బ్యాంకు కెనాల్ పనులు అంచనాలు యనలమల రామకృష్ణుడు వియ్యంకుడి కంపెనీకోసం రూ.30 కోట్లకు పెంచారు. ఇలాంటివి పది ప్యాకేజీలు చేశారు. వీటిని ఇప్పటి మంత్రి ఎందుకు పరీక్షించరు. ఎందుకు అంచనాలు పెంచారో ఈ ప్రభుత్వం అడగాలా వద్దా? ఒక తెదేపా ఎమ్మెల్యే అంచనాలు పెంచేసి రాజమండ్రిలో మూడు అపార్ట్మెంటులు కొని వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. ఎవరి వద్ద డబ్బుందో నాకు తెలుసు. భూముల సంఖ్య, విలువ పెంచేశారు. రాజశేఖరరెడ్డి ఎకరానికి రూ. 5 లక్షలు ఇచ్చారు. మూడు వేల ఎకరాలను మరల అప్ లోడ్ చేసి 30 లక్షలు ఇచ్చేశారు. అవే పెరిగిపోయాయి. కాంటూరు లెవల్ పెంచారు. ఎకరాలు పెంచారు. తెచ్చేదాం, తినేద్దాం, వచ్చేస్తాయనుకున్నారు. పోలవరం, సోమవరం అన్నారు. పోలవరం పోయింది. ఈ ప్రభుత్వం మాట్లాడదే. దమ్ముంటే దర్యాప్తు చేయాలి. కేంద్రం ఎత్తు తగ్గించదు. మీరు కాంట్రావర్సీ చేయవద్దు. భద్రాచలం ఎవరిదో తెలీదు. ఏడు మండలాలు ఎవరివో తెలీదు. కేసీఆర్ గొడవ చేస్తాడని అవగాహన లేని రాధాకృష్ణ అర్ధరహితంగా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వెనక్కి తీసుకోవాలని భాజపా డిమాండ్ చేస్తుంది. చంద్రబాబు దేనినైనా మేనేజ్ చేయగలరు.

అప్పటికే రూ.3 వేల కోట్ల నుంచి 2014 లో రూ.12 వేల కోట్లకు చేరింది. దానిని కేంద్రం ఒప్పుకుంది. కాని రూ.33 వేల కోట్లకు పెంచడానికి కారణాలు ఏమిటి? భూముల రేట్లు ఎందుకు పెంచారు? కేంద్రమే కదా డబ్బులిస్తుందని ఉదారంతో ప్రభుత్వ భూములకు పట్టాలిచ్చి తెదేపా కార్యకర్తలకు ఇస్తున్నారా? రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం వంటి అంశాలు ప్రభుత్వం విచారించాలి. పోలవరం పై 2014లో ఎస్టిమేషన్ల ప్రకారం నిర్మాణానికి కట్టుబడి ఉంది. కానీ సవరణలు అంత ఎలా పెరిగాయో.. అవినీతి ఎక్కడ జరిగిందో వెలికి తీయాలి. కాని ఈ ప్రభుత్వం అవినీతిని ఎందుకు వెలికితీయడం లేదు. వెయ్యని బోరుకు రూ.5 లక్షల చొప్పున 500 బోర్లు వేసినట్లు నాటి ప్రభుత్వం దోచేసింది. బ్యానర్లు పొలంలో ఉన్నట్లు చూపి అవినీతి చేశారు. అప్పటికే డబ్బులు తరలిపోయాయి. ఈ విషయాన్ని నేను ప్రభుత్వానికి వివరించినా దానిని పట్టించుకోలేదు. కాని పోలవరంపై అవినీతి చేసినవారిని కడిగిన ముత్యంలా బయటకు తెచ్చేలా రాధాకృష్ణ ప్రయత్నాలుచేస్తున్నారు. ఇలాంటి అవగాహన లేని రాతలను భాజపా క్షమించదు. దమ్ముగూడెం వల్ల రాయలసీమకు ఎంత నష్టపోయిందో 2014కు ముందు ఎందుకు కథనం రాయలేదు. ఈ రోజు ఎందుకు రాస్తారు? భాజపానే పోలవరం కడుతుంది. పోలవరం అంటే చంద్రబాబుకు ఇష్టం లేదు పోలవరంపై చంద్రబాబు ఏమాత్రం మమకారం లేదు. పోలవరం కట్టాలని చంద్రబాబు కట్టాలని జీవితంలో అనుకోలేదు. పోలవరం కట్టరాదని రెండు ఎత్తిపోతల పథకాలు కట్టాడు.

తెదేపా నాయకులు ప.గో.జిల్లా పరిషత్ ఛైర్మన్ అయినా నారాయణస్వామి, తూ.గో.నాయకులు వడ్డీ వీరభద్రరావు బిందెలతో ఉద్యమం చేశారు. కాని పోలవరం కట్టలేదు. చంద్రబాబుకు దమ్ములేదు. కాని పోలవరం కట్టేస్తామని ప్రగల్బాలు పలుకుతున్నాడు. పోలవరంపై చంద్రబాబుకు సంబంధం లేదు. తిరుపతికి స్మార్ట్ సిటి , 4 వర్శిటీలు, శ్రీకాళహస్తి నుంచి బెంగుళూరుకు నాలుగు రోడ్లు వేశాం. ఎలక్ట్రానిక్ క్లస్టర్లు, విమానాశ్రయం అభివృద్ధి చేస్తాం. ఇలాంటివి 60 చేశాం. ఈ రోజు మేం అక్కడ పోటీచేస్తాం. ప్రజలను అడుగుతాం. నడికుడి – శ్రీకాళహస్తి రైల్వేలైన్, ఎర్రగుంట్ల రైల్వేలైన్ వేశాం. రైల్వేలకు 5 వేల కి.మీ. 5 వేల కోట్లు ఖర్చుచేశాం. మరో 22 వేల కోట్ల ప్రాజెక్టులు రెడీ చేస్తున్నాం. నిడదవోలు నుంచి విజయవాడకు డబ్లింగ్ పూర్తిచేస్తున్నాం. బ్రిడ్జిలు కట్టాం. రహదారులు నిర్మిస్తున్నాం. ఇలాంటివి మోడళ్లను ఈ ముఖ్యమంత్రులు చూపించమనండి. మేం ఇంత బలంగా అభివృద్ధి చేస్తుంటే రోజూ మేం చేసినవి చూపించడం లేదు. రూ.1800 కోట్లతో నిర్మించే ఎయిమ్స్ వంటివి ఒకటైనా రాజదానిలో కట్టాడా? రాజధాని ఇక్కడే ఉంటుందని మేం చెబుతాం. చేయని వారిని అగడరు. మేం నిబద్ధతతో పనిచేస్తాం. గ్రామాల అభివృద్ధికి నరేగా నిధులు రూ.40వేల కోట్లు ఇచ్చాం. గతంలో రూ.45 వేల కోట్లు ఇచ్చాం. ఎందుకు పోలవరానికి నిధులివ్వం. రూ.3 వేల కోట్లతో పట్టాలిచ్చినవాటికి మౌలికసదుపాయాలకు ఇస్తే ఎర్రగ్రావెల్ పరిచేస్తున్నారు. దానిని పరిశీలిస్తాం. ఎర్రచందనం స్మగ్లర్లను నియంత్రించాలి

కాంతారావనే అధికారి గతంలో ఎర్రచందనం స్మగ్లర్లను నిరోధించారు. ఇప్పుడు కొంత నియంత్రణలోకి వచ్చినా విచ్చలవిడిగా ఎర్రచందనాన్ని దోచేస్తున్నారు. ప్రభుత్వమే ఇందుకు సహకరిస్తున్నట్లు కనిపిస్తోంది. తక్షణమే ఎర్రచందనం సర్గర్లను నిరోధించాలి. ఒక స్మగ్లర్ టిండర్ల భూములు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిని భాజపా గట్టిగా అడ్డుకుని అతనిపై కేసులు పెట్టింది. ప్రభుత్వం ఎర్రచందనం స్మగ్లింగ్ ను వెంటనే అరికట్టాలి. తెదేపా, వైఎస్ఆర్ సీపీ మతతత్వ పార్టీలు అబ్దుల్ సలాం ఆత్మహత్య ఘటనను తెదేపా, వైఎస్ఆర్ సీపీ పార్టీలు ముస్లింలను రెచ్చగొట్టి మతతత్వ రాజకీయాలకు పాల్పడుతున్నాయి. ఈ ఘటనలో సర్కిల్ ఇన్ స్పెక్టర్, కానిస్టేబుల్ ను బాధ్యులను చేసి జైలుకు పంపి రాజకీయం చేస్తున్నారు.

పోలీసులకు తెదేపా బెయిల్ ఇప్పించి ముస్లింలచే ఉద్యమం చేయిస్తుంది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తున్నారా? ఇబ్బందులు వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటారు. ముఖ్యమంత్రులను అరెస్టు చేయడం లేదు కదా? పోలీసులు విధులు నిర్వవిస్తే అరెస్టు చేస్తారా? ఈ రెండు పార్టీలకు ముస్లింల ఓట్లు కావాలా? హిందువులు ఓటర్లుకారా? ఈ రెండు పార్టీలకు ముస్లింలే కావాలా? మనం మనుషులం కాదా? రాష్ట్రంలో హిందువులు, ఇతర కులాలు అవసరం లేదా? ఎంత మతతత్వ రాజకీయాలు నడుపుతున్నారో ప్రజలు తెలుసుకోవాలి. తిరుమలలో అన్యాయం పై మేము ప్రశ్నిస్తే, రథాలు కాల్చివేస్తే ఉద్యమిస్తే… భాజపా మత తత్వ రాజకీయం చేస్తుందని విమర్శిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు, జగన్ మతతత్వ వాదులు కాదా? కడిగిన ముత్యాలా? ధగధగ మెరిసిపోతున్నారా? ఇప్పుడు చంద్రబాబు, జగన్ లు చేసేదేమిటో… మీడియా కూడా వారిని ప్రశ్నించాలి.

చంద్రబాబు హయాంలో విద్యా దీవెన పధకం కింద రూ. 10 లక్షలు ఇచ్చేవారు. ఇప్పటి ప్రభుత్వం అమలుచేయడం లేదు. కనీసం ప్రతిభ ఉన్న విద్యార్థులకు అయినా ఈ పధకాన్ని జగన్ అమలు చేయాలి. తుంగభద్ర పుష్కరాలలో భక్తుల స్నానాలకు అవకాశం ఇవ్వాలి. స్నానాలు , ఘాట్లు, ప్రజారోగ్యం ప్రధానం. స్నానాలు చేయడానికి అవకాశం లేదంటూ రూ. రెండు వందల కోట్లు ఎందుకు కేటాయించారో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. షెల్టర్లు, ఘాట్లు నిర్మించాలి. నీటి సరఫ పెంచాలి. కనీసం పర్యవేక్షణ ఏర్పాటు చేసి.. తిరుపతిలో దర్శనాలకు అమలుచేస్తున్నట్లు పరిమిత సంఖ్యలో భక్తులు స్నానం చేసేలా కార్యక్రమం నిర్వహించాలి. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణరాజు, టుబాకో బోర్డు ఛైర్మన్ యడ్లపాటి రఘునాధబాబు, నాయకులు సైదారెడ్డి పాల్గొన్నారు.