అన్ని మతాలకు ప్రాతినిధ్యం లభించేలా బిల్లు పాస్ చేయండి 

396
– ఆర్ బి ఎఫ్ జాతీయ అధ్యక్షుడు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సాయినాథ్ శర్మ ఎద్దేవా
తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని మతాలకు ప్రాతినిధ్యం లభించేలా ప్రస్తుత ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేస్తే తిరుమలలో కొందరు చేస్తున్న హిందూ వ్యతిరేక విధానాలకు అడ్డు ఉండదని అప్పుడు ప్రభుత్వం తిరుమలలో యథేచ్ఛగా ఏమైనా చేసుకోవచ్చునని రాష్ట్రీయ బ్రాహ్మణఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ ఎద్దేవా చేశారు
   కమలాపురంలో శుక్రవారం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్రాహ్మణ కార్పోరేషన్ మాజీ జిల్లా కో ఆర్డినేటర్ , ఆర్ బి యఫ్ రాష్ట్ర నాయకులు జనార్దన్ తో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు .తిరుమల తిరుపతి దేవస్థాన ప్రాంతాలలో పవిత్రమైనటువంటి తిరుమల పుణ్యక్షేత్రంలో హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ తిరుమల ప్రతిష్టను రోజురోజుకు దిగజార్చే విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుండడం సిగ్గుచేటన్నారు.టిటిడి అనుసంధానమైన ఎస్వీబీసీ ఛానల్ లో రోజురోజుకు అనేక ఆకృత్యాలు జరుగుతున్నప్పటికీ పాలకవర్గం నిమ్మకునీరెత్తినట్లు ఉండడం శోచనీయం అన్నారు .
ఈ ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన హిందూ ధర్మ ధార్మిక  సంస్థగా ఉన్న తిరుమల ,,వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ,అక్కడి పాలకులు అవలంబిస్తున్న విధానాల వల్ల టిటిడి ప్రతిష్ట రోజు రోజుకి దిగజారి  పోతుండడం కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోంది అన్నారు .అన్యమత  విధానాలతో ఒకవైపు ,అశ్లీల విధానాలతో మరోవైపు టిటిడి ని భ్రష్టు పట్టించే ప్రణాళిక కొందరు పాలకులు బాగానే …రచించార న్నారు ,,టిటిడి పాలకమండలి చైర్మన్ సతీమణి చర్చి లోకి వెళ్లి ప్రార్థనలు చేస్తున్న విషయాన్ని హిందూ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారన్నారు  .టిటిడి పాలక మండలిలో కొందరు కేవలం హోదా కోసం టీటీడీలో కొనసాగుతున్నారే గాని  తిరుమల  పవిత్రత మీద వారికి ఎటువంటి శ్రద్ధ, భక్తి భావాలు లేవన్నారు
టిటిడిలో అన్ని మతాలకు సమాన ప్రాతినిధ్యం కావాలనే కోరిక ప్రభుత్వానికి ఉన్నప్పుడు 150 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ ప్రభుత్వం శాసన సభలో బిల్లు పెట్టి పాస్ చేసుకుంటే వారు స్వతంత్రంగా రాజ్యాంగ హక్కులతో తమ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి ఎవరూ అడ్డుకోరని ఆయన ఎద్దేవా చేశారు*.గత రెండు మూడు రోజుల కిందట అశ్లీల వీడియోలు ఎస్వీబీసీ ఛానల్ ఉద్యోగి ఎస్వీబీసీ గురించి అడిగిన ఒక భక్తుడికి  పంపించడం  చూస్తుంటే తిరుమల ప్రతిష్ట ఏ స్థాయిలో మంట కలుపుతున్నారో  ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ..వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో ప్రతి విషయం వివాదాస్పదం అవుతుండడం ముఖ్యమంత్రి టీటీడీ  మీద ఏ మాత్రం శ్రద్ధ చూపకపోవడం చాలా విచారకరమన్నారు .
     రాష్ట్రంలోని దేవాలయాల మీద దాడులు జరుగుతున్నప్పటికీ అలాగే దేవాలయాల్లో దేవతల ఆభరణాలు దేవతల వాహనాలు చోరీకి గురైనప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం బాధ్యతగల కేంద్ర క్యాబినెట్ మంత్రులు ఈ విషయాల పట్ల హేళనగా  మాట్లాడినప్పటికీ ముఖ్యమంత్రి గారు స్పందించకపోవడం కారణంగా ,హిందువుల మనోభావాలను బాగా దెబ్బతింటున్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు.ఎన్నో ఆశలతో ఆశయాలతో వైసీపీ ప్రభుత్వానికి ఓట్లేసిన ప్రజలు చాలా మంది ఈరోజు తిరుమలలో జరుగుతున్నటువంటి విషయాల పట్ల తాము ఈ పార్టీకి ఓట్లు ఎందుకు వేశామని ఆవేదన చెందుతున్నారని సాయినాధశర్మ పేర్కొన్నారు.
    ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు తిరుమల తిరుపతి దేవస్థానం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అక్కడ జరుగుతున్న అన్యమత ,అశ్లీల వ్యవహారాల పట్ల కఠినమైన హెచ్చరికలు సూచనలు చేయకపోతే తిరుమల విశిష్టత మరింత దిగజారిపోయే పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.