తేనెల సోనల పాటల కోకిల

206

సినీ సంగీతాశాఖపై వాలిన ఆ కోకిల హాయిహాయిగా, మధురాతిమధురంగా ఆలపిస్తుంటే కొన్ని తరాలు మైమరి ఆలకించాయి. వేలవేల పాటలు ఆమె మంత్రగళంలో జీవం పోసుకున్నాయి. పరిమళం అద్దుకున్నాయి. కొత్త అందచందాలతో శ్రోతల వీనుల విందు చేశాయి. హృదయాలను రసభరితం చేశాయి. ఆమే దక్షిణాది లతామంగేష్కర్‌గా పేరు పొందిన పి.సుశీల. నవంబర్‌ 13న ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె గాన లహరులనూ, స్వర మధురిమలనూ నెమరువేసుకుందాం!

సుశీల పాటలను స్మరించటమంటే కొన్ని దశాబ్దాల తెలుగు చలనచిత్రాల గమనాన్ని కూడా గుర్తు చేసుకున్నట్టే! అమె సినీరంగ ప్రవేశం చేసిన 1952 నాటికే బాలసరస్వతీదేవి. జిక్కి, పి. లీల, ఎం.ఎల్‌. వసంతకుమారి లాంటి ప్రతిభావంతులైన గాయనీమనులుండేవారు వారి మధ్య తన ఉనికిని చాటుకోవటం అంత సులువైన పని కాదు.
ఆమె మొదటి పాట ‘కన్నతల్లి’ చిత్రంలోది. పెండ్యాల సంగీత దర్శకత్వంలో ఎందుకు పిలిచావెందుకు అన్న ఆ పాటను ఎ.ఎం రాజాతో కలిసి పాడారు.
‘‘సుశీల గాత్రం పీలగా వుంటుందనీ నూతిలో నుండి పాడినట్లు వినిపిస్తుందనీ మిత్రులైన కొందరు పెద్దలు నిరుత్సాహపరిచారు. కానీ మేము ఆధైర్యపడలేదు. సుశీలతోనే ‘దొంగరాముడు’ పాటలు రికార్డు చేశాం’’ అని ఓసారి గుర్తుచేసుకున్నారు నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు. ‘‘అనురాగం విరిసేనా’’ అన్న పాట విన్న తరువాత మమ్మల్ని నిరుత్సాహపరిచినవారే, వారి వారి చిత్రాల్లో సుశీలకు అవకాశాలు ఇచ్చారు.!

1956 సంవత్సరం సుశీల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసింది. అంతవరకు చిన్నచిన్న పాత్రలకు తన కంఠాన్నిస్తూ వచ్చిన సుశీల మొదటిసారిగా కథానాయిక పాత్రకు మా తోడికోడళ్ళు’ చిత్రంలో పాడింది. తెలుగు, తమిళ బాషల్లో నిర్మించిన ఆ చిత్రానికి నాయిక (సావిత్రి) పాటలన్నీ రెండు బాషల్లోనూ సుశీలే పాడింది. రెండు బాషల్లోనూ ఆ చిత్రం ఘన విజయం సాధించింది. సుశీల ప్రాచుర్యం కూడా ఎంతోగానో ఇనుమడించింది’’ అన్నారాయన.

అందుకే తెలుగులో 1955 నుంచీ చాలాకాలం వరకూ సుశీల పాటలేని సినిమా దాదాపు లేకపోయింది. 1960ల నుంచి 1970ల తొలి భాగం వరకూ ఆమె కెరియర్‌లోనే అత్యుత్తమమని సంగీతభిమానులు భావిస్తారు. ‘‘1980 తర్వాత సినిమాలో వేగం పెరిగింది. గుగ్గుగ్గుగ్గు గుడిసుంది’ లాంటి పాటలు పాడనన్నా నాచేత పాడించారు. అవి మరోతరం ప్రేక్షకులకు నన్ను దగ్గర చేశాయి’’ అంటారు సుశీల, తెలుగు సినీసంగీత స్వర్ణయుగ చరిత్రంలో ఆమెది ఘనతర ఆధ్యాయం!

సహజత్వం, వైవిధ్యం….
సుశీల గానం ప్రత్యేకతలు ఏమిటి? పాటలోని ప్రతి పదం చక్కగా వినపడేంత స్పష్టత. సన్పివేశానుగుణంగా భావయుక్తంగా సహజంగా తీయగా పాడటం. ఏ హీరోయిన్‌కు పాడితే అచ్చం ఆమె గొంతే అనిపించే గానం మరో విశిష్టత.
‘‘కొన్ని వందల పాటలు సుశీల పాడడం వల్ల మరింత మాధుర్యాలయ్యాయి. అంటారు. సంగీత విమర్శకుడు వీఎకే రంగారావు. ‘‘ఆమె ఎంత బాగా పాడినా నేనింత బాగా పాడుతున్నాను వినండహో అన్న చాటింపు ఉండదు. ఆ ఉండే మాధుర్యం మంచి దంతానికి ఉండే మెరుపులాగా సహజంగా, స్నిగ్థంగా, స్వచ్ఛంగా ఉంటుంది. గొంతులో సుడులు తిరిగే సంగతులు అతి సుభంగా సాధించినట్టు ఉంటాయే గాని శ్రమపడినట్టు ఉండవు. ఆ పాటలు చెవితో ప్రమేయం లేకుండా హృదయంలోకి, పంచేంద్రియాలలోకి ప్రవేశించి హాయిని కలిగిస్తాయి. అని విశ్లేషించారాయన. సుశీల పాటల్లో ‘అత్యుత్తమమైనవి మాత్రమే’ అనే నిబంధన పెట్టుకుని జాబితా తయారుచేయబోయినా అది ఓ పట్టాన పూర్తవదు.
* ఇది మల్లెల వేళయనీ… ఇది వెన్నెల మాసమనీ (సుఖదుఃఖాలు)
* వస్తాడు నా రాజు ఈ రోజు (అల్లూరి సీతారామరాజు)
* సన్నగ వీచే చల్లగాలికీ (గుండమ్మ కథ)
* బృందావనమది అందరిదీ (మిస్సమ్మ)
* హిమగిరి సొగసులూ (పాండవ వనవాసం)
* నీ పేరు తలచినా చాలు (ఏకవీర)
* తెలిసందిలే… తెలిసిందిలే (రాముడు మల్లిగాడు)
* మల్లెపందిరి నీడలోన జాబిల్లీ (మాయదారి మల్లిగాడు
* మనసే కోవెలగా మమతలు మల్లెలుగా (మాతృదేవత)
* మనసు పరిమశించెనే (శ్రీకృష్ణార్జున యుద్ధం)
… ఇలా ఈ జాబితా పెరిగిపోతూనే ఉంటుంది.
ఏ రకమైనా పాటకైనా ఒదిగే గొంతు ఆమెది. అల్లరి పాటలైనా, హాయి పాటలైనా, హాస్యం, చిలికేవైనా, విషాదం పలికేవైనా, వలపుపాటలైనా, తలపు పాటలైనా… వేటినైనా సరే, ఆమె కంఠం అలవోకగా అనుదించుకుంటుంది. అనుపమానంగా పాడుతుంది. దైవ భక్తి దేశభక్తి గేయాలు, జానపద గేయాలు, బృందగీతాలు, ప్రణయ, విరహ, శృంగార, కరుణామయ గీతాలు పిల్లల పాటలూ, పండగల పాటలూ, క్లబ్‌ పాటలూ….. ఎంతటి వైవిధ్యం!

12 బాషల్లో….
* ఆరు దశాబ్దాల్లో 12 భాషల్లో (తెలుగు, తమిళం కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళ్లు పడుగు, సింహళీస్, మరాఠీ) దాదాపు 40 వేలకు పైగా పాటలు పాడారు. విజయనగం మాహారాజా కళాశాలలో ద్వారం వెంకటస్వామి నాయుడు వద్ద అభ్యసించిన శాస్త్రియ సంగీతం దీనికి పునాదిగా పనిచేసింది.
* సినీ వీణపాటల కవిగా దాశరధకి పేరు. ఆయన రాసినవే కాకుండా ఇతర కవులు రాసినవి కూడా కలిపి, అత్యధిక వీణపాటలను పాడే అభ్యసించిన శాస్త్రియ సంగీతం దీనికి పునాదిగా పనిచేసింది.
ఆయన రాసినవే కాకుండా ఇతర కవులు రాసినవి కూడా కలిపి అత్యధిక వీణపాటలను పాడే అవకాశం సుశీలకే దక్కింది.
‘అధిక ప్రచారం పొందిన నా పాటలు సుశీల పాడినవే కావడం నా అదృష్టం… సుశీల పాడుతుంటే ఆకాశంలో నక్షత్రాలన్నీ ఏకమై బృందగానం చేస్తున్నట్లుంటుంది నాకు చందమామ వీణ తీగలు పలికిస్తున్నట్లుంటుంది. ఆమె పాట వినిపించినప్పుడు ఆమని ఆకాలంలో అవతరించనట్లయంటుంది. మనిషిని నిజమైన మనిషిని చేయగల మధుర సంగీత హేల మా సుశీల అని దాశరథి ప్రశంసించారు.

తాదాత్త్మంతో కంటతడి:
* ‘ఆత్మీయులు’ చిత్రంలోని ‘మదిలో వీణలు మ్రోగే’ అనే పాట రికార్డింగ్‌ సందర్భం అప్పటికి పదకొండు సార్లు టేక్‌ చేశారు. చివరి టేక్‌ విని సంగీత దర్శకుడు రాజేశ్వరరావు పాట చాలా అద్భుతంగా వచ్చిందని ఓకే చేశారు. కానీ సుశీల ఆ టేక్‌ విని మరోసారి పాడతానన్నారు. అంతకంటే గొప్పగా పాడటం అసాధ్యమనీ, వృథా శ్రమ అనీ రాజేశ్వరరావు అన్నారు. అయినా మరో ప్రయత్నం చేస్తానని పాడారు. సుశీల. ఆమె పాడుతున్న పాట వింటూంటే అక్కడున్న అందరితో పాటు- అసాధ్యమన్న సంగీత దర్శకుడు కూడా తాద్తాత్మంతో కంటతడి పెట్టుకున్నారు. అంతటి పట్టుదల, నిజాయతీ, శ్రద్ధ గల అరుదైన గాయని సుశీల!.
* ఒకే కుటుంబంలోని రెండు తరాలతో కలిసి సుశీల పనిచేశారు. నటి జయచిత్రకూ, ఆమె తల్లి అమ్మాజీకీ నేపథ్యగానం అందించారు. ఎస్పీ బాలుతో, ఆయన కొడుకు చరణ్‌తో, కె.జె. ఏసుదాసుతో, ఆయన కుమారుడితో కలిసి పాడారు. ఇళయరాజా, ఆయన కోడుకు కార్తీక్‌ రాజా… ఇద్దరి సంగీత దర్శకత్వంలో పాడారు.
* 2008లో సుశీలను పద్మభూషణ అవార్డుతో సత్కరించారు. 2001 లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రఘపతి వెంకయ్య పురస్కారం పొందారు. ఐదుసార్లు జాతీయ ఉత్తమ గాయనిగా ఎంపికయ్యఆరు. 1969, 1971 లలో తమిళ పాటలకు ఆ పురస్కారం వచ్చింది. 1978 లో ఝమ్మంది నాదం సౌయ్యంది పాదం’ (సిరిసిరిమువ్వ) 1982 లో ‘ప్రియె చారుశీలే’ (మేఘసందేశం) 1983లో ‘ఎంత బీదవాడే గోపాలుడు వేణుగోపాలుడు (ఎం.ఎల్‌.ఎ. ఏడుకొండలు) పాటలకు జాతీయ అవార్డును అందుకున్నారు.
* ‘పెండ్యాల గారు నన్ను వెండితెరకు పరిచయం చేస్తే, సాలూరి రాజేశ్వరరావు గారు స్వరభిక్ష పెట్టారు. పాటను భావగర్భితంగా ఎలా పాడాలో ఘంటసాల మాస్టారు నేర్పించారు. మహదేవన్‌ గారు ఎన్నో మధురాతి మధురమైన పాటలు పాడించారు. ఆదినారాయణరావు గారు నా గళం లోని అమృతాన్ని వెలికి తీయించారు. తెలుగు సినీ స్వర్ణయుగంలో, ఆ మహానుభావులందరి దగ్గరా పాడటం నా అదృష్టం అని కృతజ్ఞతగా స్మరించుకుంటారు. సుశీల.

* ఆ రెండు పాటలు…
ఆత్రేయ మూగ మనసులు’ చిత్రంలో ‘మానూ మాకును గాను’ అన్న పాట ప్రత్యేక పరిస్థితులలో రాసినది మాను, మాకు, రాయి, రప్ప… మొదలైన పదాలు కవితా వస్తువులు కాదని కొందరు ఈసడించారు. ఎగతాళి చేశారు. కానీ సుశీల గాత్ర స్పర్శతో ఆ ఆకవితా వస్తువులక్కూడ సుగంధం సౌకుమార్యం అబ్బినాయి. ఆ పాట మంచి పాటగా ప్రశస్తి పొందింది. (బడి పంతులు చిత్రంలో రెండు పాటలు రాసినప్పుడే నాకు బాగా నచ్చాయి. సుశీల పాడినప్పుడు ఇంకా బాగా నచ్చాయి. ఆ రెండు పాటలూ భావంలోనూ, శబ్దాలలోనూ పరస్పర విరుద్ధమైనవి ఒకటి సరదాగా, చిలిపిగా ఉండే టెలిపోన్‌ పాట బూడాడమ్మా బూచాడు! సుశీల ఆ పాటను గంతులు వేసే బాలికలాగానే పాడారు. రెండో పాట షష్టిపూర్తి చేసుకున్న ‘దంపతి’ పాడేపాట- మీ నగుమోము’ ఆరాధన అనురాగం, జీవిత సింహావలోకనం… ఆ వేగాలన్నీ ఆ పాటలో ఉన్నాయి. ఏ రకంగా చూసినా నాకు సంతృప్తినిచ్చిన పాటలలో ఇది ఒకటి.
ఎస్‌. జానకితో కలిసి సహ గాయని ఎస్‌. జానకితో పాటు సుశీల తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సింహళీస్‌ బాషల్లో పాడారు. కానీ ఎక్కువ సంఖ్యలో (90కి పైగా) పాడింది. తెలుగులోనే! వాటిలో శ్రోతల ఆదరణ పొందిన కొన్ని:
1. సరిలేరు నీకెవ్వరూ (కంచుకోట)
2. వేణుగానమ్మ పిల్లల వంతు (మంచి కుటుంబం)
3. ప్రేమించుట పిల్లల వంతు (మంచి కుటుంబం)
4. నల్లవాడే అమ్మమ్మో అల్లరి పిల్లవాడే (దసరా బుల్లోడు)
5. ఎన్నాళ్ళ కెన్నాళ్ళకెన్నాళ్ళకూ (అడవి రాముడు)
6. అమ్మతోడు అబ్బతోడు నీ తోడు (అడవి రాముడు)
7. తెలిసెనులే ప్రియరసికా (దానవీర శూర కర్న)
8. హలో హలో ఓ తాతయ్య (ఖైదీ కాళీదాస్‌)
9. తంతననంతన తాళంలో రసరాగంలో (కొత్త జీవితాలు)
10. అనురాగ శికరాన ఆలయం (రక్త సంబంధాలు)
11. అరనీకుమా ఈ దీపం (కార్తీకదీపం)
12. చణచణ మనే మువ్వలూ (మహాశక్తి)
13. నా హృదయమా (ప్రియ)

పాటపై పాటలు..
* నా పాట నీ నోట పలకాల సిలకా (మూగమనసులు)
* పాడమని నన్నడగవెలనా.. పరవించీ పాడనా (డాక్టర్‌ చక్రవర్తి)
* పాడవోయి భారతీయుడా (వెలుగు నీడలు)
* పాడెద నీ నామమే గోపాలా (అమాయకురాలు)
* పాడనా తెలుగు పాట పరవశనై (అమెరికా అమ్మాయి)
* నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది. (ముత్యాల ముగ్గు)
* ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు (తలంబ్రాలు)

వీణ పాటలు..
* ఏమని పాడెదనో ఈ వేళ (భార్యభర్తలు)
* నీవు లేక వీణా పలుకలేన్నదీ (డాక్టర్‌ చక్రవర్తి)
* మనసే అందాల బృందావనం (మంచి కుటుంబం)
* నా మనసే వీణియగా పాడనీ (విచిత్ర దాంపత్యం)
* ఈ వీణకు శ్రుతి లేదు (దేశోద్ధారకులు)
* ఈ వీణపైనా పలికిన రాగం (అభిమానవంతులు)
* ఎవరో రావాలి నీ హృదయం కదిలించాలి (ప్రేమనగర్‌)
* సఖియా వివించవే (నర్తనశాల)
* నీవు రావు నిదుర రాదు (పూలరంగడు)
* మదిలో వీణలు మ్రోగే (ఆత్మీయులు)
* వేణుగానలోలుని గన వేయకనులు చాలవులే (రెండు కుటుంబాల కథ)
* పాడెద నీ నామమే గోపాలా (అమాయకురాలు)
* మురళీలోలుడు మరులను పొంగించి (మనువు మనసు)
* మ్రోగింది వీణా (జమీందారు గారి అమ్మాయి)
* వీణలోనా తీగలోనా ఎక్కడున్నదీ నాదమూ (చక్రవాకం)

– velagapudi gopalakrishna prasad, p. venu