కోటి లింగముల ప్రతిష్టాపన

104

తాళ్ళాయపాలెం, అమరావతి రాజధాని మందడం శివారు వెంకటపాలెం నందు శ్రీ కోటిలింగ మహాక్షేత్రములో కార్తీకమాసంలో కోటి శివలింగముల ప్రతిష్టాపనకై పరమపూజ్య భారత ధర్మదేవత బిరుదాంకితులు శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శివస్వామి వారు సంకల్పించియున్నారు.

ఈ సందర్భముగ స్వామివారు నేడు శుక్రవారం ఉదయం 11:30 ని.లకు ఒంగోలు నగరంలోని సంతపేట శిరిడిసాయి మందిరములో జరిగిన మీడియా సమావేశములో మాట్లాడుచూ ప్రతి హిందువూ కుల మత ప్రాంత వయో బేధములు లేకుండా ఎవరైనా శివలింగ ప్రతిష్ట చేయవచ్చునని తెలిపారు. పితృదేవతల సద్గతి మరియు ఆశీర్వాదం కొరకు, సంతానాభి వృద్ధికొరకు, జన్మ సాఫల్యత కొరకు శివలింగ ప్రతిష్ట పరమోత్తమమైన కార్యమని తెలిపారు. అనంతరం కోటి శివలింగ ప్రతిష్టాపనల కరపత్రమును విడుదల చేశారు.

కార్యక్రమములో శిరిడి సాయి మందిర వ్యవస్థాపక ధర్మకర్త సాయి పాదసేవకులు అళహరి చెంచలరావు, స్వాతి పైప్స్ అధినేత కవర్తపు శ్రీనివాసరావు,
తూనుగుంట మల్లిఖార్జునరావు విహెచ్ పి ఒంగోలు జిల్లా అధ్యక్షులు,నేరెళ్ల శ్రీనివాసరావు విహెచ్పి సహ కార్యదర్శి రాధా రమణ గుప్తా జంధ్యం, ఎయిమ్స్ క్లబ్ జాతీయ అధ్యక్షులు,పాతృని నాగార్జున, బిజేపి NRI కార్యదర్శి పిన్నింటి బాలకృష్ణ, ఒంగోలు శాఖ,బొర్రా వేణు, తాళ్ళాయ పాలెం బైసాని ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.