ఆంధ్ర మరో నాగాల్యాండ్ అవుతుందా?

987

నాగాల్యాండ్ – భారతదేశంలో ఉండే అనేక రాష్ట్రాలలో ఇది కూడా ఒకటి అని మనం చదువుకున్నాం.

నాగప్రజలు దృఢశరీరులు. చాలా అందమైన వారు.

కష్టించి పనిచేసే వారు. కొండలు కోనలు అడవులలో ఆనందంగా జీవించే వారు. అతిథి ప్రియులు. నాగభాషను మాట్లాడేవారు.

మహాభారత కాలంలో అశ్వసేనుడు అనే నాగునికి అర్జునుడితో వ్యక్తిగత శత్రుత్వం ఉండేది అని, అతడు అర్జునుని సంహరించేందుకు గాను యుద్ధంలో కర్ణునికి సహాయం చేయబోయి విఫలమయ్యాడని కథనం ఉన్నది. ఉలూచి అనే నాగకన్య అర్జునుని వలచి వరించిందని ఇతిహాసం కూడా ఉన్నది.

నాగాప్రజలు మంగోలియా, చైనా ప్రాంతాలనుండి వలస వచ్చినవారని పాశ్చాత్య చరిత్రకారులు అంటారు. ఇది ఎంతమాత్రం నమ్మదగినట్లుగా లేదు.  ముందే పేర్కొన్నట్లుగా, నాగాల ప్రస్తావన అతి ప్రాచీనమైన మహాభారతంలోనే ఉంది.  భారతీయులను వివిధ కారణాలు చూపి విభజిస్తే గాని భారతదేశాన్ని పాలించలేమనే కుటిలనీతితో,   నాగాలు, మిజోలు, గోండులు అనేవారు అసలు భారతీయులే కారని,  వారు ఈ దేశీయులు కానే కాదని, వాళ్ళ జన్మమూలాలు మరెక్కడో ఉన్నాయని చెప్పడం ద్వారా, వారిని మానసికంగా భారతీయ సంస్కృతి నుంచి వేరు చేసి, తమ మత మార్పిడి దందాను ఆ ప్రాంతాలలో తేలికగా నిర్వహించుకునేందుకు గాను ఆంగ్ల చరిత్రకారులు అల్లిన కట్టుకథలే ఇవి.

అయితే బ్రిటిష్ పాలన అంతమవటంతో అయినా ఆంగ్లేయుల కుటిల నీతికి అడ్డుకట్ట పడిందా? అంటే అదీ లేదు. 1947లో బ్రిటిష్ ప్రభుత్వం నుంచి విముక్తిని పొందిన తరువాత కూడా, మనం సెక్యులర్ దేశంగా ఉంటాం అంటూ మన తొలి నాటి పాలకులు చేసిన భయంకరమైన పొరపాటు వల్ల, ఇప్పుడు ఆ నాగాలాండ్ ప్రధాన భారత జన స్రవంతికి దూరమయ్యే పరిస్థితులకు బీజం పడింది.

ఇప్పుడు, మేము ఒక ప్రత్యేక దేశంగా ఉంటాం. మాకు ఒక ప్రత్యేకదేశపతాకం ఉంది అని వారు అనడం ప్రారంభమైంది.

దానికి కారణం నాగాలాండ్ లో చాపకింద నీరులా విస్తరించిన క్రిస్టియన్ మిషనరీ కార్యకలాపాలు.

ఎడ్వర్డ్ వింటర్ క్లార్క్ అనే వ్యక్తి యొక్క నేతృత్వంలో మొదటి క్రిస్టియన్ మిషనరీ 19వ శతాబ్దంలోనే (అంటే బ్రిటిష్ వారి పరిపాలన కాలంలోనే) నాగాలాండ్ లో అడుగు పెట్టింది.

ఆ సమయంలో నాగాలాండ్ అంతటా బౌద్ధులు అనిములు మాత్రమే ఉండేవారు. ఒక్క క్రిస్టియన్ కూడా ఉండేవాడు కాదు.

భారతదేశంలోని మిషనరీల పని మతేతర ప్రజలను క్రిస్టియన్ మతం లోనికి మార్చడం మాత్రమే కాదు, మతం మారిన వారిని తమ పూర్వపు ఆచారాలకు దూరంగా ఉంచడం, వారు తమ బంధువుల ఇళ్లలో జరిగే వేడుకలకు పండుగలకు హాజరు కాకుండా చూడడం, ఆ విధంగా, వారు తమ రక్తసంబంధీకులకు కూడా క్రమంగా దూరమయ్యేలా చేయడం, వారు తమ మాతృభాషను కాకుండా ఇంగ్లీషును తమ అ ప్రధాన భాషగా భావించేలా చేయడం, ఈ విధంగా తమ పని పూర్తి అయిన తరువాత, మేము అధిక సంఖ్యాకులం కాబట్టి మాకు ప్రత్యేక దేశం కావాలి అనిపించడం. ఇవన్నీ కూడా అ మిషనరీ కార్యకలాపాల యొక్క అజెండాలు. ఒక్క మాటలో చెప్పాలంటే యుద్ధం చేయకుండా దేశాన్ని ఆక్రమించడంలో ఇది ఒక తంత్రం.

ఏదైతేనేం, 1872 ప్రాంతంలో క్రిస్టియన్ మిషనరీ నాగాలాండ్ లో మొట్టమొదటి మతాంతరీకరణ కార్యక్రమం జరిపించింది. ఒకే ఒక వ్యక్తి క్రిస్టియన్ గా మారాడు.

అది మొదలుగా ఈ మతాంతరీకరణలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. 1947 తరువాత, సెక్యులర్ అనే పదం తగిలించుకుంటే తమను ప్రపంచప్రజలు మెచ్చుకుంటారు అనే ఒక కీర్తి కండూతితో, ఒక గుడ్డి మోజుతో కాంగ్రెస్ నాయకులు ఈ మిషనరీల కార్యకలాపాలను ఎంత మాత్రం పట్టించుకోలేదు.

దాంతో, సహజ శత్రువులైన పాములు పిల్లులు కాకులు గుడ్లగూబలు లేనిచోట, ఎలుకలు విచ్చలవిడిగా పెరిగినట్లు ఈ మిషనరీలు నాగాలాండ్‌లో ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. 2019 నాటికి దాదాపు 20 లక్షల జనాభాలో 98% నాగ ప్రజలను క్రిస్టియన్లుగా మార్చేశారు.

 

కేవలం మిషనరీలే కాదు. రాజకీయనాయకులు కూడా ఇలా జరిగేందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించారు.

1963 డిసెంబర్ 1 వ తేదీన నాగాలాండ్ ను ప్రధాన భారత భూభాగం నుండి ఒక ప్రత్యేక రాష్ట్రంగా విడదీశారు. (అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ) 1964 జనవరిలో ఎన్నికలు జరిగాయి. 1964 ఫిబ్రవరి 11న మొదటి నాగాలాండ్ ప్రభుత్వం ఏర్పడింది.

1967లో నాగాలాండ్ ప్రభుత్వం రాష్ట్రానికి చెందిన నాగ భాషను అధికార భాషగా రద్దుచేసి దాని స్థానంలో ఇంగ్లీష్ భాషను అధికార భాషగా ప్రకటించారు. తమ రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం మాత్రమే బోధించాలని తమకున్న అధికారం ద్వారా శాసనం చేశారు.

(అప్పటి నాగాలాండ్ ముఖ్యమంత్రి నాగ నేషనలిస్ట్ ఆర్గనైజేషన్ పార్టీకి చెందిన టి ఎన్ అంగమీ. అతడు నాగాలాండ్ మొదటి శాసనసభలో స్పీకరుగా ఉండి, నాగాలాండ్ ప్రభుత్వపు మొదటి ముఖ్యమంత్రి అయిన షీలు మీద అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించి, అతనిని పదవీభ్రష్టుని చేసి, తరువాత తానే స్వయంగా ముఖ్యమంత్రిగా ఎన్నికైనాడు. అంతకుముందు 1956 – 57 ప్రాంతంలో, నాగ నేషనల్ కౌన్సిల్ కు ప్రెసిడెంట్ గా ఉంటూ భారత ప్రభుత్వం మీద సాయుధ తిరుగుబాటు చేసిన చరిత్ర ఇతడికి ఉంది. ఇదంతా అతడు ఇంగ్లీష్ మీడియం క్రిస్టియన్ మిషనరీ స్కూలులో చదువుకున్నప్పుడు,వారు చేసిన జాతి వ్యతిరేక బోధనలను తలకెక్కించుకున్న ఫలితమే అని వేరుగా చెప్పనవసరం లేదు. అసలు అంగమీ అనేది నాగాలాండ్ లోని ఒక శక్తివంతమైన వర్గం పేరు. పూర్వం వీరిలో అధిక సంఖ్యాకులు బౌద్ధులు గాను ఫుట్ సానా అనుయాయులు గాను ఉండేవారు. క్రిస్టియన్ మిషనరీల పనితనం ఫలితంగా, ప్రస్తుతం వారిలో 98% కంటే ఎక్కువమంది క్రిస్టియన్లు అయినారు. )

ఈ విధంగా కుట్ర పన్ని, అధికారం చేజిక్కించుకుని, మిషనరీలకు అంతులేని వరాలను ప్రసాదించి, మాతృభాష అయిన నాగాభాషను తొలగించి, ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను ప్రవేశపెట్టి ఆనాడు అంగమీ వేసిన క్రిస్టియన్ బీజం నెమ్మదిగా మొలిచి క్రమంగా వృద్ధి చెంది, ఫలించి ఈనాడు క్రిస్టియన్ మహావృక్షం అయింది. దాదాపు నాగాలాండ్ రాష్ట్రప్రజలందరూ ఇప్పుడు క్రిస్టియన్లుగా మారిపోయారు.

మతం మారడంతోనే వారి దేశభక్తి కూడా మతభక్తిగా మారిపోయింది. వారు అధిక సంఖ్యాకులు అయ్యేసరికి ఆ మిషనరీలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఇప్పుడు ఆ నాగ ప్రజల చేతనే, మేము ప్రత్యేక దేశంగా ఉండాలని నినాదాలు చేయిస్తున్నారు.

ఈ విధంగా నాగప్రజలు క్రిస్టియన్లుగా మారడం ద్వారా మొదట తమ బంధుత్వాలను కోల్పోయారు. తమవైన ప్రత్యేక ఆచారాలను కోల్పోయారు. తమ భాషను కోల్పోయారు. చివరకు తమ భారతీయతను కూడా కోల్పోయి తమను తామే స్వయంగా కోల్పోతున్నారు.

ఈ మధ్యనే అస్సాంలో ఇద్దరి కంటే అధిక సంతానాన్ని కనరాదు అని అని నిషేదం విధించారు. దాంతో మనది సెక్యులర్ దేశం. ఇద్దరు పిల్లలను మాత్రమే కనడం మా ఇస్లాం మతానికి వ్యతిరేకం అంటూ ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడైన బద్రుద్దీన్ అజ్మల్ ఎదురు తిరిగాడు. “ఈ నియమాలు ముస్లింలకు వర్తించవు. ఏ నియమాలనూ ముస్లింలు పాటించనవసరం లేదు. ఎంతమంది పిల్లలనయినా స్వేచ్ఛగా కనండి” అంటూ ప్రోత్సహిస్తున్నాడు.

ఆయనకు కూడా పక్కనే నాగాలాండ్‌లో జరుగుతున్న పరిణామాలు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి కాబోలు. నాగాలాండ్‌లో క్రిస్టియన్లు అధిక సంఖ్యాకులై తమకొక ప్రత్యేక దేశాన్ని కోరుకున్నట్టుగానే అస్సాంలో కూడా ముస్లింలు ఎక్కువ సంతానాన్ని కని, తమ జనాభాను పెంచుకుని, అధికసంఖ్యాకులై దూర భవిష్యత్తులో అయినప్పటికీ, అస్సాంను కూడా తమకొక ప్రత్యేక దేశంగా ప్రకటించాలని కోరవచ్చునని ఆయన కలగంటే లేదా అభిప్రాయపడితే అందుకు మనం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు.

ఇవన్నీ మనకెందుకు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చరిత్ర నుండి నేర్చుకోవలసిన కొన్ని అంశాలు తప్పకుండా ఉంటాయి. నేర్చుకుంటే సరిపోదు. కొందరు చేసిన తప్పులను మళ్ళీ మనం చేయకుండా ఉండాలి. నాగాలాండ్‌లో ఏమి చేయాలో అస్సాంలో ఏమిచేయాలో కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ మన సంగతి ఏమిటి?

నాగాలాండ్ లో అంగమీ ముఖ్యమంత్రిగా ఉంటూ మిషనరీలను ప్రోత్సహించడం, ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం వంటి పరిస్థితులు ఇప్పుడు మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లో కూడా కనిపిస్తున్నాయి.

అత్యధిక సీట్లతో అధికారాన్ని పొందిన మన ప్రస్తుత ముఖ్యమంత్రి  క్రిస్టియన్ మతాన్ని ప్రచారం చేయడానికి ముందుకొచ్చిన ప్రతి వాడికి పాస్టర్ అని పేరు పెట్టి, వారికి నెల నెలా నజరానాలు అందించడం జరుగుతోంది. తెలుగు భాషకు పూర్వవైభవం తెచ్చే ప్రయత్నం చేయకుండా, అసలు అటువంటి మాటే తలపెట్టకుండా, తెలుగు మీడియంలో చదువుకున్న వారికి సరైన ఉద్యోగ అవకాశాలు లేవని కుంటి సాకులు చెబుతూ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను అధికారికంగా చొప్పించడం జరుగుతోంది.

ఆనాటి నాగాలాండ్ ముఖ్యమంత్రిగా టి యన్ అంగమీ నాటిన అవే విషబీజాలను ఈనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ నాటుతున్నాడు.

ఆనాటి అంగమీ లాగే, జగన్ కూడా, ఒక రహస్యలక్ష్యసిద్ధి కోసం పని చేస్తున్నట్టుగా అనిపిస్తోంది.

ఆ వ్యక్తి అన్యాయంగా ఎన్నో కష్టాలను అనుభవించినవాడని, అతడి మీద జాలి పడవచ్చు. తప్పులేదు. అతడు గొప్ప పట్టుదల కలిగినవాడు అని అతడి మీద అభిమానం ఉండవచ్చు. అందులో కూడా తప్పులేదు. చంద్రబాబు రాక్షస పాలనను అంతం చేసినవాడని అతడి పట్ల కృతజ్ఞతను కలిగి ఉండవచ్చు. అది కూడా తప్పు కాదు.

కానీ, మన భాష మీద, మన సంస్కృతి మీద, ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ జరుగుతున్న దాడులను మనం చూస్తూ సహించరాదు. తీవ్రంగా వ్యతిరేకించవలసిందే. ఆత్మరక్షణకు పూనుకోని మనుషులు నశించిపోతారు లేదా బానిసలైనా అవుతారు.

ఎప్పటికైనా వ్యక్తి కంటే జాతి ముఖ్యం. దేశమే ముఖ్యం. తరతరాల సంస్కృతి ముఖ్యం.

తస్మాత్ జాగ్రత.

రచన : శ్రీ శ్రీనివాస కృష్ణ.

( ఈ వ్యాసంలో వ్యక్తపరిచిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)