కరోనా నుంచి కోలుకున్న రాజశేఖర్

1
33

ప్రముఖ సినీ నటుడు డాక్టర్ రాజశేఖర్ కరోనా నుంచి కోలుకున్నారు. నెలరోజులుగా బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజశేఖర్ కరోనా నుంచి బయటపడటంతో వైద్యులు ఆయన్ని డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్లే ముందు ఆస్పత్రి సిబ్బందితో ఫొటో దిగిన ఆయన… పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కరొనా క్లిష్ట పరిస్థితుల్లో తన భర్తను ప్రాణాపాయం నుంచి కాపాడిన సీఎన్ సీ వైద్య బృందానికి జీవిత రాజశేఖర్ ధన్యవాదాలు తెలిపారు. నెలరోజుల పాటు ఆస్పత్రి సిబ్బంది తమను కుటుంబసభ్యుల్లా చూసుకున్నారని తెలిపిన జీవిత రాజశేఖర్ … అభిమానులు, కుటుంబ సన్నిహితుల ప్రార్థనలు ఫలించి రాజశేఖర్ కోలుకున్నారని జీవిత సంతోషం వ్యక్తం చేశారు.

1 COMMENT