సరికొత్త గ్లోబల్ వెల్నెస్ విధానం “కౌ హగ్గింగ్”

985

“గావో విశ్వస్య మాతరః” ఆవు ప్రపంచానికే తల్లి వంటిది అని అనాదిగా భారతీయుల విశ్వాసం. అందుకే భారతీయులు గోవును తల్లిగా భావించి పూజిస్తారు.  భారతీయులు, ముఖ్యంగా హిందువులు గోవును తల్లిగా భావించి పూజించడాన్ని కొందరు రాజకీయ నాయకులు, అన్య మత ప్రచారకులు, హేతువాదులు హేళన చెయ్యడం అనేక సందర్భాలలో జరుగుతూ ఉంటుంది.

కానీ నేడు శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలలోని ప్రజలు గోమాత యొక్క మహిమను గుర్తించి గోవుకు సన్నిహితంగా మెలిగితే,  గోమాతను  ఆలింగనం చేసుకుంటే తమకున్న శారీరిక, మానసిక రుగ్మతలు తొలగిపోతాయని నమ్మి ఇప్పుడు “కౌ హగ్గింగ్” (ఆవును కౌగిలించుకోవడం), “కాక్ నఫ్ల”  పేరుతో ఒక వెల్ నెస్ ప్రక్రియను ప్రారంభించి, ఎంతో ఆసక్తిగా ఆచరిస్తూ ఉండడం ఓ గొప్ప పరిణామం.

ఇప్పుడు అనేక దేశాలలో ఆవును కౌగిలించుకోవడం లేదా  కాక్ నఫ్ల” అనేది ఒత్తిడిని తగ్గించడానికి మరియు సానుకూల దృక్పధాన్నిపెంచడానికి సహాయపడే తాజా వెల్నెస్ పద్ధతిగా మారింది.

నెదర్లాండ్స్‌లోని గ్రామీణ పట్టణమైన రీవర్ లో ప్రారంభమైన ఆవును  కౌగిలించుకోవడమనే ఈ పద్ధతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది. స్విట్జర్లాండ్ మరియు యునైటెడ్ స్టేట్స్ లోని పొలాలలో కూడా ఇప్పుడు సందర్శకులకు ఈ కొత్త చికిత్సను అందిస్తున్నారు.

నెదర్లాండ్స్‌లోని స్పాన్‌బ్రూక్‌లో “ఫార్మ్ సర్వైవల్” నడుపుతున్న జోస్ వాన్ స్ట్రాలెన్ అనే వ్యక్తి ఆరు సంవత్సరాల క్రితం ఇతర రైతుల నుండి ఈ పద్ధతి గురించి విన్నతర్వాత “ఆవు కౌగిలింత” సెషన్లను అందించడం ప్రారంభించాడు.

ఆవుల గురించి ఇన్సైడర్తో మాట్లాడుతూ, “మీరు వాటి బాడీ లాంగ్వేజ్ ను బట్టి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా అవి కళ్ళు సగం మూసుకుని, చెవులు క్రిందికి వాల్చి ఉన్నప్పుడు, అలాగే కొన్నిసార్లు వ్యక్తి ఒడిలో తల పెట్టుకుని పడుకుని రిలాక్సవుతున్నట్టుగా ఉన్నప్పుడు….

“అంటే ఇది సానుకూల శక్తి మార్పిడన్నమాట. ఆవును గట్టిగా కౌగిలించుకునే వ్యక్తి ఆవు శరీరంలోని వెచ్చదనం ద్వారా రిలాక్స్ అవుతాడు. మరి కొన్నిసార్లు ఆవు హృదయ స్పందనను కూడా అనుసరిస్తాడు. ఇది ఆవుకు, వ్యక్తికి ఇద్దరికీ గొప్ప అనుభవం.

“ప్రజలు తాము ఊహించిన దానికంటే ఎక్కువగా అనుభూతి చెందుతున్నామని తరచుగా నాకు చెప్తూ ఉంటారు. వారు ఆవు కౌగిలిలోని వెచ్చదనాన్ని, అంగీకారాన్ని, ప్రేమను అనుభూతి చెందుతారు. ఆవులో కూడా అదే విధమైన భావనను వారు గుర్తించగలుగుతున్నారు.

“నీలి ఆకాశం క్రింద పచ్చని పొలాలలో చుట్టూ ఆవులతో ఉంటే చాలు. అంతకంటే అద్భుతమైన చోటు ఉండదు.” అని పేర్కొన్నారు.

BBC కథనం ప్రకారం… ఆవు యొక్క వెచ్చని శరీర ఉష్ణోగ్రత, నెమ్మదైన హృదయ స్పందన కారణంగా మానవులలో ఆక్సిటోసిన్ పెంపొందుతుంది. అది సానుకూల దృక్పధాన్ని ఏర్పరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుందని నమ్ముతారు. ఇది సహజంగా అనుబంధం కారణంగా విడుదలయ్యే హార్మోన్.

అప్లైడ్ యానిమల్ బిహేవియర్ సైన్స్ లో ప్రచురించబడిన ఫ్రెంచ్ మరియు ఆస్ట్రియన్ శాస్త్రవేత్తలు 2007 లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం ఆవులు “వాటిని యజమానులు రుద్దడం, మసాజ్ చేయడం లేదా ప్రేమను చూపించినప్పుడు అవి తమ ఆనందము మరియు విశ్రాంతి పొందుతున్న సంకేతాలను చూపుతాయి” అని తేలింది.

ఆవులను కౌగిలించుకునే మానవులు కూడా తక్కువ హృదయ స్పందన రేటును అనుభవించారని, శారీరకంగా తామెంతో రిలాక్స్ అవుతున్నట్లుగా అనుభూతి చెందుతున్న సంకేతాలను చూపించారు. ఇది “మానవులు – పశువుల మధ్య అనుబంధాన్ని మెరుగుపరచడానికి ఆసక్తి కలిగిస్తుంది” అని ఆ పత్రిక పేర్కొంది.

ఆచరణలో, ఆవులను కౌగిలించుకోవడం, వాటితో ప్రేమగా మెలగడం, వాటికి మసాజ్ చేయడం వంటివి ప్రతిరోజూ మూడు గంటల వరకు ఉంటాయి.  కానీ మనుషుల మాదిరిగానే, కొన్ని ఆవులు ఇతర జంతువులకంటే ఎక్కువ స్నేహశీలియైనవి. అలాగే వాటికి ఆసక్తి లేకపోతే మాత్రం దూరంగా నడుస్తాయి కూడా.

ఏదేమైనా, ప్రపంచ జంతు సంరక్షణ విభాగంలో విదేశాంగ సలహాదారు అయిన ఫిలిప్ విల్సన్ ఇన్సైడర్‌తో ఇలా అన్నారు: “ఆవును కౌగిలించుకున్నప్పుడు ఆవుకు కూడా కొన్ని ప్రయోజనాలున్నాయని కొన్ని నివేదికాలు వెల్లడి చేస్తున్నప్పటికీ… దీనిలో ప్రధాన లబ్ధిదారుడు కౌగిలించుకునే వ్యక్తి మాత్రమే.”

“జంతు సంక్షేమ సంస్థగా, జంతువుల యొక్క అంతర్గత స్వభావాన్ని ప్రజలు అర్థం చేసుకుని జీవించడం, భావోద్వేగాలు కలిగి ఉండడం, నొప్పి మరియు బాధలను అనుభవించగల సామర్థ్యాన్ని పొందడం, అలాగే సానుకూల భావోద్వేగాలను నేర్చుకుంటారు మరియు అర్థం చేసుకుంటారని మేం భావిస్తున్నాం.” అని ఆయన అన్నారు.

“ప్రజలతో అవాంఛిత పరిచయం కారణంగా జంతువు మరియు వ్యక్తికి వచ్చే ప్రమాదాలు, రవాణా మరియు గృహ పరిస్థితుల వల్ల కలిగే అనవసరమైన ఒత్తిడి గురించి కూడా మేము ఆందోళన చెందుతున్నాము.

“చికిత్సా ప్రయోజనాల పరంగా, కుక్కలు మరియు పిల్లులు వంటి పెంపుడు జంతువులను ఉపయోగించడం కూడా అంతే ప్రభావవంతంగా ఉంటుందా? దీనివలన ఏమైనా  ఉభయులకు తక్కువ ప్రమాదం కలిగిస్తుందా? అని కూడా మేము పరిశీలిస్తున్నాము.” అని ఆయన అన్నారు.

ఏదేమైనప్పటికీ  మిగతా ప్రపంచమంతా ఇప్పుడు, ఆలస్యంగా గోమాత యొక్క మహిమను గుర్తిస్తూ ఉన్నా కొన్ని యుగాల క్రితమే గోమాత మహిమను గుర్తించి,  గోవును తల్లిగా పూజించి, గో సంపదనే నిజమైన సంపదగా భావించిన భారతీయుల విజ్ఞానం ఎంత గొప్పది? గో మహిమకు అంతటి ప్రాధాన్యం ఇచ్చారు కనుకనే సాక్షాత్తు భగవానుడైన శ్రీకృష్ణుడే గోపాలకుడైనాడు.  ఏనాటికైనా యావత్ ప్రపంచం సనాతన ధర్మ ఛత్ర ఛాయలోకి రావలసిందే….  ఆ నీడలో సేద దీరవలసిందే.  వందే గోమాతరం.

14 COMMENTS

  1. Hello just wanted to give you a quick heads up. The text in your post seem to be running off the screen in Opera. I’m not sure if this is a formatting issue or something to do with internet browser compatibility but I thought I’d post to let you know. The design and style look great though! Hope you get the issue resolved soon. Cheers Gayle Antolak