బయట తిరగొద్దు…‘కరోనా’కి ‘కొత్త’ జీవితమివ్వద్దు…!

1857

‘బరి’తెగించి బయట తిరగొద్దు… ‘కరోనా’ మహమ్మారికి ‘కొత్త’ జీవితమివ్వద్దు…!!!

‘భయం’ వద్దన్నది…’బరి’తెగించి తిరగమనికాదు…

‘కరోనా’ మహమ్మారి నుండి మనకు ఇంకా పూర్తిగా రాలేదు ఏ ‘అభయం’

అనవసర ‘భయాల్నే’ వద్దన్నది… అడ్డూ, అదుపూ లేకుండా తిరగమనికాదు…

మరికొంత కాలం అన్ని జాగ్రత్తలూ తప్పక తీసుకోవడమే మనకు ‘అభయం’

అనుక్షణం, క్షణక్షణం ‘భయం’ భయంగా బ్రతకొద్దన్నది… కనీస జాగ్రత్తలు కూడా మరచిపోమ్మని కాదు…

మీ నిర్లక్ష్యం ‘కరోనా’ మహమ్మారిని మరింత కాలం పెంచి, పోషిస్తుందని మరువకండి.

ప్రభుత్వాలు ప్రకటించేవరకూ… డాక్టర్లు డిక్లేర్ చేసేవరకూ… ‘కరోనా’ మహమ్మారి వ్యాప్తి చెందకుండా మనం ఎంత జాగ్రత్త పడితే అంత మేలు.

ఎన్నో జబ్బులు… ఎన్నో వ్యాధులు… ఎన్నో బ్యాక్టీరియాలు… ఎన్నో వైరస్ లతో అనాదిగా మనం పోరాడుతూ వస్తున్నాం… ఇక ముందు కూడా పోరాడదాం…

ఈ ‘కరోనా’ మహమ్మారి మనకో లెక్కా…!!!… దీన్నీ ఎదిరిద్దాం…

అందరూ సంఘటితంగా పోరాడి ఈ ‘కరోనా’ మహమ్మారిని ఈ ప్రపంచం నుండి తరిమికొడదాo…

అందరూ ఎంత విధిగా జాగ్రత్తలు తీసుకుంటే, ప్రభుత్వాలు చెప్తున్న, డాక్టర్లు సూచిస్తున్న ప్రమాణాలు తప్పక ఆచరిస్తే ఈ ‘కరోనా’ మహమ్మారి మన ప్రపంచం నుండి అంత త్వరగా పారిపోతుంది…

ప్రభుత్వాలకృషితో… డాక్టర్ల అంకితభావంతో… రోజు, రోజుకూ క్షీణిస్తున్న ‘కరోనా’ మహమ్మారికి ‘కొత్త’ జవజీవాల్ని కల్పించొద్దు…

కేవలం మీ నిర్లక్ష్యాల కారణంగా… మీ అలక్ష్యంతో… ఇప్పటికీ ‘కరోనా’ మహమ్మారి మనమధ్యనే తిష్టవేస్కుని బ్రతుకుతోందని గ్రహించండి…

సమూలంగా ‘కరోనా’ మహమ్మారిని నిర్మూలించడంలో మన ప్రభుత్వాలకీ… డాక్టర్లకు మీ సహకారం, మీరు తీసుకొనే జాగ్రత్తలు అత్యవసరం అని తెలుసుకోండి.
  
పెన్మెత్స రవి ప్రకాష్ అశోక వర్మ, శృంగవృక్షం,
Near భీమవరం,
పాలకోడేరు మండలం,
పశ్చిమ గోదావరి జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్ – INDIA.

16 COMMENTS