కాంట్రాక్టర్ డొల్లతనం…

175
విజయవాడ సయ్యద్ అప్పలస్వామి కాలేజి వెనుక భాగంలో కొండపైకి మెట్ల మార్గాన్ని నియమించారు కాంట్రాక్టర్. ఆగస్టు నెలలో పనులు ప్రారంభించి అసంపూర్తిగా వదిలి వెళ్లిపోయాడు. ఈలోగా వచ్చిన వర్షాలకు కట్టిన కట్టుడు మొత్తం కొట్టుకుపోయి వట్టి ఇటుకలు మాత్రమే మిగిలాయి. మరలా రెండు రోజుల క్రితం మెట్లకు సిమ్మెంట్ ప్లాస్టింగ్ చేసి మమా అనిపించాడు.  అయితే ఆ చేసిన పనిలోనూ డొల్లతనం ఇట్టే కనిపించడం అతని నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఎన్నో ఏళ్ల తరువాత నిర్మించిన ఈ మెట్ల మార్గానికి ఇంతకంటే మోక్షం లేదాని ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఈ పనులు సంపూర్ణంగా పూర్తి చేసిన తర్వాతే ఆ కాంట్రాక్టర్ కు బిల్లు చెల్లించేలాగున చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజల కోరుతున్నారు.

1 COMMENT

  1. An impressive share, I simply given this onto a colleague who was doing a bit evaluation on this. And he in reality purchased me breakfast as a result of I found it for him.. smile. So let me reword that: Thnx for the treat! However yeah Thnkx for spending the time to debate this, I really feel strongly about it and love studying extra on this topic. If doable, as you develop into experience, would you thoughts updating your weblog with extra details? It’s extremely helpful for me. Massive thumb up for this weblog put up!