కృష్ణా జిల్లా కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు కరోనా
స్వగ్రామం నుంచి చికిత్స కోసం హైదరాబాద్కు ఎమ్మెల్యే
ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా సోకింది. కృష్ణా జిల్లా కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని ఈ రోజు ఉదయం నిర్ధారణ అయింది. దీంతో ఆయన వెంటనే తన స్వగ్రామం నుంచి చికిత్స కోసం హైదరాబాద్కు వెళ్లారు. ప్రస్తుతం దూలం నాగేశ్వరరావు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరినట్లు తెలిసింది. గత 10 రోజులుగా తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించినట్లు సమాచారం. ఆయన సూచనలతో పలువురు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు.
You are my breathing in, I have few blogs and very sporadically run out from post :). “Actions lie louder than words.” by Carolyn Wells.