చురుగ్గా “రాఘవాచారి” పార్కు అభివృద్ధి పనులు

588

నిర్మాణ పనులను పరిశీలించిన ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే నాయకులు
విజయవాడ :: ప్రముఖ పాత్రికేయులు దివంగత చక్రవర్తుల రాఘవాచారి పేరుతో విజయవాడ నగరంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పార్కు అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలోని 19 బి సర్వే నెంబరులో ఏర్పాటవుతున్న ఈ పార్కును ఈనెలాఖరుకల్లా ప్రారంభించేందుకు వీలుగా నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. మున్సిపల్ కమిషనర్ వి. ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు ఉద్యానవనశాఖ ఏడీ జ్యోతి, ఏఈ పురుషోత్తం ప్రత్యేక శ్రద్ద తీసుకుని పార్కును ఆకర్షణీయంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నారు. పార్కులో వాకింగ్ ట్రాక్ తో పాటు షటిల్ కోర్టు, జిమ్, పిల్లలు ఆడుకోవడానికి వీలుగా పలు క్రీడా వసతులను సమకూర్చుతున్నారు. అలాగే పార్కు చుట్టూ పూల మొక్కలు లాన్ సౌకర్యంతో పార్కును సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పార్క్ అభివృద్ధి పనులను సోమవారం ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే విజయవాడ కృష్ణా అర్బన్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, కొండా రాజేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ పార్కు అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

1 COMMENT