తెలుగు పండితుడికి దక్కిన అపురూప గౌరవం

414

శృంగేరీ శారదాపీఠం ఆస్థాన జ్యోతిర్విద్వాంసులుగా డా.శంకరమంచి రామకృష్ణశాస్త్రి

సుప్రసిద్ధ జ్యోతిష పండితులు పరిశోధకులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి కి అరుదైన గౌరవం దక్కింది. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఉత్కృష్టమైన జగద్గురు ఆది శంకరాచార్యుల వారు స్థాపించిన దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం ఆస్థాన జ్యోతిర్విద్వాంసులుగా నియమితులయ్యారు. శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు శ్రీ శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర స్వామి వారు స్వయంగా డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి జ్యోతిష్య శాస్త్రం పట్ల సాధించిన పరిశోధనలు సనాతన సూర్య సిద్ధాంతం పై ఒక సాధికారిక పరిశోధనా పత్రం అందించిన తీరుకు సంతోషించి వీరిని ఆస్థాన పండితునిగా నియమించాలని నిర్ణయించడం తెలుగువారందరికీ గర్వకారణం. విజయదశమి సందర్భంగా శృంగేరి శారదా పీఠం లో జరిగిన ప్రత్యేక ఉత్సవంలో జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారు శంకరమంచి రామకృష్ణ శాస్త్రిని జ్యోతిర్విద్వాంసులుగా నియమిస్తూ పట్టాను ప్రదానంచేసి ఆశీర్వదించారు.
తెలుగు రాష్ట్రాల లోనే కాక దేశ వ్యాప్తంగా జ్యోతిషశాస్త్ర ప్రాభవాన్ని సూర్య సిద్ధాంతం యొక్క వైశిష్ట్యాన్ని ఇనుమడింప చేసి మరింత కృషి సాగించాలని జగద్గురువులు ఆశీర్వదించారు.తెలుగునాట అతి పిన్న వయసులోనే జ్యోతిష శాస్త్రాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసి మూడు పి హెచ్ డి పట్టాలను సాధించి నాలుగు బంగారు పతకాలను అందుకోవడమే కాక ఎన్నో జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధన పత్రాలను కీలక ప్రసంగం పత్రాలను అందించిన జ్యోతిష మార్గదర్శి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి శృంగేరి ఆస్థాన జ్యోతిర్విద్వాంసులు అవ్వడం తెలుగు వారందరికీ దక్కిన ఒక అరుదైన గౌరవం.