మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత

321

తెలంగాణ మాజీ హోమ్ శాఖ మంత్రి, తెరాస నేత నాయిని నర్సింహా రెడ్డి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.  వారం రోజుల క్రితం ఊపిరితిత్తుల సమస్యలతో ఆసుపత్రిలో చేరారు.  చికిత్స పొందుతూ మరణించినట్లు అపోలో ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.  నాయిని మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.  తెలంగాణ ఉద్యమంలో, టీ ఆర్ ఎస్ పార్టీలో, ప్రభుత్వంలో కలిసి పని చేసిన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాయిని  నర్సింహారెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంచనాలతో నిర్వహించాలని సీ ఎస్ ను ఆదేశించారు.

నాయిని నర్సింహారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.  వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు.  తెలంగాణ ఏర్పాటు తరువాత కేసీఆర్ కేబినెట్ లో హోమ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.  కార్మిక నాయకుడిగా నాయిని అందరికి సుపరిచితులు.  నల్గొండ జిల్లాకు చెందిన నాయిని 1960 దశకంలో హైదరాబాద్ కు వచ్చారు.  కార్మికుల హక్కుల పోరాటంతో అయన కార్మిక నాయకుడిగా ఎదిగారు.  1969లో తొలి తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా పనిచేశారు.  1978 లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.  1985, 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు.  2001లో కేసీఆర్ ఆద్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తరువాత, ఆ పార్టీతో కలిసి పనిచేశారు.

1 COMMENT